కె.ఎస్.నిసార్ అహ్మద్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కె.ఎస్.నిసార్ అహ్మద్
K.S. Nissar Ahmed
ಕೆ.ಎಸ್.ನಿಸಾರ್ ಅಹಮದ್
కె.ఎస్.నిసార్ అహ్మద్
పుట్టిన తేదీ, స్థలం(1936-02-05)1936 ఫిబ్రవరి 5
దేవనహళ్ళి, బెంగళూరు, కర్నాటక
మరణం2020 మే 3(2020-05-03) (వయసు 84)[1]
వృత్తిరచయిత, ప్రొఫెసర్
భాషకన్నడ
జాతీయతభారతదేశం
రచనా రంగంకన్నడ సాహిత్యం
విషయంకాల్పనిక రచన
సాహిత్య ఉద్యమంనవ్య
గుర్తింపునిచ్చిన రచనలుమనసు గాంధీ బజారు (1960)
నిత్యోత్సవ
ప్రభావంజి.పి.రాజరత్నం, ఎం.సి.సీతారామయ్య, ఎల్.గుండప్ప
పురస్కారాలుపద్మశ్రీ
2008
రాజ్యోత్సవ అవార్డు
1981

కె.ఎస్.నిసార్ అహ్మద్ (జననం. ఫిబ్రవరి 5 1936 - మరణం మే 3 2020 ) కన్నడ భాషకు చెందిన భారతీయ రచయిత.[2] వీరి పూర్తి పేరు కొక్కరె హోసహళ్ళి శేఖ్‍హైదర్ నిసార్ అహ్మద్. ఇతని తండ్రి కె.స్.హైదర్ రెవెన్యూ శాఖలో చేరక ముందు శానిటరీ ఇన్స్పెక్టర్ గా, ఉపాధ్యాయునిగా పనిచేసాడు. ఈయన భూగర్భ శాస్త్రంలో పోస్టుగ్రాడ్యుయేట్ తీసుకొని, మైసూరు గనులు, భూగర్భశాస్త్ర విభాగం, గుల్బర్గాలో కొన్నాళ్లు అసిస్టెంటు భూగర్భ శాస్త్రవేత్తగా పనిచేశాడు.ఆ సమయం లోనే రచయిత కువెంపుతో పరిచయం కలిగింది. ఆ పరిచయం కారణంగా 1959 లో మైసూరు దసరా ఉత్సవాలలో జరిగే కన్నడ రచయితల సమావేశానికి ఆహ్వానించబడ్డాడు. ఆయన కొన్నాళ్లపాటు బెంగళూరు సెంట్రల్ కళాశాల లో, తర్వాత చిత్రదుర్గలో భూగర్భశాస్త్ర ఉపన్యాసకునిగా పనిచేశాడు. ఆ తర్వాత శివమొగ్గలోని సహ్యాద్రి ఫస్టు గ్రేడు కాలేజిలో రెండు దఫాలుగా 1967-1972, 1975-1978 సంవత్సరాలలో పనిచేశాడు.[3]

అతనికి బాగా పేరుతెచ్చినది "నిత్యోత్సవ" గీతం.[3] 1978 లో కన్నడంలో మొదటి లలితగీతాల కేసెట్టు విడుదల అయినప్పుడు, అందులోని "నిత్యోత్సవ" గీతం, ఆ పాటకు సమకూర్చిన సంగీతపు బాణీ, పాటలోని భావాల మేలు కలయిక వలన, బాగా జనాదరణ పొందింది.

చేసిన సేవలు[మార్చు]

చీలీ దేశపు రచయిత పాబ్లో నెరూడా గీతాలను "బరి మర్యాదస్తరె" (మర్యాదస్తులు మాత్రమే) పేరుతో కన్నడం లోకి అనువదించాడు. "కురిగళు సార్ నావు కురిగళు", "భారతవు నమ్మ దేశ" ( ఇక్బాల్ అహమ్మద్ గీతం "సారే జహాన్ సె అచ్ఛా"కు అనువాదం), బెణ్ణె కద్ద నమ్మకృష్ణ" గీతాలు ఆయన రచనలలో కొన్ని. ఆయన వ్రాసిన గీతం "నిమ్మోదనిద్దు, నిమ్మంతాగడె"లో తన మతపు మూలాలను పాటించడానికి తాను పడిన విచికిత్సను బాధాత్మకంగా వర్ణించాడు.

పురస్కరాలు[మార్చు]

 • పంపా పురస్కారం
 • రాజ్యోత్సవ పురస్కారం (1981) [2]
 • నడోజా పురస్కారం (2003) [4]
 • పద్మశ్రీ పురస్కారం (2008) [5]
 • హానరరీ డాక్టరేట్, కుంవెపు విశ్వవిద్యాలయం నుండి.[6]

మూలాలు[మార్చు]

 1. "Kannada Nityotsava poet KS Nissar Ahmed passes away". www.deccanherald.com. Retrieved 3 May 2020.
 2. 2.0 2.1 "NITYOTSAVA: Pgm by Nisar Ahmed on Mar 28". Archived from the original on 17 జూలై 2011. Retrieved 7 December 2010.
 3. 3.0 3.1 "Glad a Kannadiga's name has gone all the way to Delhi: Nisar". The Hindu. 27 January 2008. Archived from the original on 31 జనవరి 2008. Retrieved 7 December 2010.
 4. "Subhadramma Mansur receives Nadoja Award". The Hindu. 7 January 2004. Archived from the original on 18 ఫిబ్రవరి 2004. Retrieved 15 December 2010.
 5. "Padma Awards Directory (1954-2009)" (PDF). Ministry of Home Affairs. Archived from the original (PDF) on 10 మే 2013. Retrieved 7 December 2010.
 6. "Kuvempu University honour for six". Deccan Herald. Retrieved 7 December 2010.