కె.బాలకృష్ణన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొడియారి బాలకృష్ణ
కేరళ హోంశాఖ మంత్రి
In office
18 మే 2006 (2006-05-18) – 16 మే 2011 (2011-05-16)
అంతకు ముందు వారుఊమెన్ చాందీ
తరువాత వారుఊమెన్ చాందీ
కేరళ శాసనసభ సభ్యుడు
In office
2001 (2001)–2016 (2016)
నియోజకవర్గంతలసేరి శాసనసభ నియోజకవర్గ
In office
1982 (1982)–1991 (1991)
నియోజకవర్గంతలసేరి శాసనసభ నియోజకవర్గం
వ్యక్తిగత వివరాలు
జననం(1953-11-16)1953 నవంబరు 16
కానూర్ , కేరళ
మరణం2022 అక్టోబరు 1(2022-10-01) (వయసు 68)
చెన్నై, తమిళ నాడు, భారతదేశం
జాతీయతభారతీయుడు
రాజకీయ పార్టీCommunist Party of India (Marxist)
జీవిత భాగస్వామి. వినోదిని|1980}}
సంతానం2

కొడియేరి బాలకృష్ణన్ (16 నవంబర్ 1953 - 1 అక్టోబర్ 2022) కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు. బాలకృష్ణన్ 2015 నుండి 2022 వరుకు కేరళ రాష్ట్ర సిపిఐ కార్యదర్శిగా పనిచేశాడు. [1] ఆయన ఆరోగ్యం విషమించడంతో రాష్ట్ర కార్యదర్శి పదవికి రాజీనామా చేశారు. బాలకృష్ణన్ మలయాళ దిన పత్రిక దేశాభిమాని ప్రధాన సంపాదకుడిగా పనిచేశాడు. [2]

బాలకృష్ణన్ 2001 నుండి 2006 వరకు మొదటిసారి 2011 నుండి 2016 వరకు రెండోసారి కేరళ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశాడు. బాలకృష్ణన్ 2006 నుండి 2011 వరకు కేరళ రాష్ట్ర హోం శాఖ మంత్రిగా పనిచేశాడు. బాలకృష్ణన్ తలస్సేరి శాసనసభ నియోజకవర్గం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

బాలకృష్ణన్ 1970లో సీపీఐ(ఎం) విద్యార్థి యువజన విభాగం ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించారు. బాలకృష్ణన్ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (SFI) కార్యదర్శిగా పనిచేశాడు. 1973 నుంచి 1979 విద్యార్థి విభాగ కార్యదర్శిగా పనిచేశాడు. ఎమర్జెన్సీ సమయంలో, బాలకృష్ణన్ 16 నెలల పాటు జైలులో ఉన్నారు. [3]

1980 నుండి 1982 వరకు, బాలకృష్ణన్ కన్నూరు జిల్లా డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కన్నూర్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశాడు. బాలకృష్ణన్ సిపిఐ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా పనిచేశాడు. బాలకృష్ణన్ 1982, 1987, 2001, 2006 2011లో తలస్సేరి శాసనసభ నియోజకవర్గం నుండి ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. [1]బాలకృష్ణన్ 2006 నుంచి 2011 వరకు కేరళ రాష్ట్ర హోం శాఖ మంత్రిగా పనిచేశాడు. [4] [3]బాలకృష్ణన్ 2015 ఫిబ్రవరి 23న కేరళ రాష్ట్ర కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. [5] బాలకృష్ణన్ 2018లో రెండవసారి కేరళ రాష్ట్ర కమ్యూనిస్టు కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. బాలకృష్ణన్ 2022లో మూడోసారి కేరళ రాష్ట్ర కమ్యూనిస్టు కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. [6] బాలకృష్ణన్ 2022 ఆగస్టు 28న తన ఆరోగ్యం బాగా లేకపోవడంతో కేరళ రాష్ట్ర కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి పదవికి రాజీనామా చేశాడు. [7]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

బాలకృష్ణన్ 1953 నవంబర్ 16న తలస్సేరిలోని కొడియేరిలో కుంజున్ని కురుప్ నారాయణి అమ్మ దంపతులకు జన్మించాడు. బాలకృష్ణన్ తన తల్లిదండ్రులకు ఏకైక కుమారుడు. బాలకృష్ణన్ కు నలుగురు అక్కలు ఉన్నారు, అందరూ అతని కంటే చాలా పెద్దవారు. బాలకృష్ణన్ కొడియేరి జూనియర్ బేసిక్ స్కూల్ ఒనియన్ హైస్కూల్‌లో తన విద్యాభ్యాసం కొనసాగించాడు.

1980లో, బాలకృష్ణన్ మాజీ ఎమ్మెల్యే రాజగోపాలన్ [3] కుమార్తె వినోదినిని వివాహం చేసుకున్నాడు ఆ దంపతులకు బినోయ్ కొడియేరి [8] బినీష్ కొడియేరి అనే ఇద్దరు పిల్లలు సంతానం. [9]

మరణం

[మార్చు]

బాలకృష్ణన్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌తో సుదీర్ఘకాలంగా బాధపడుతున్నారు. బాలకృష్ణన్ ఆరోగ్యం క్షీణించడంతో 2022 ఆగస్టు 28న చెన్నైలోని అపోలో హాస్పిటల్‌లో చేరారు. [10] [11] బాలకృష్ణన్ 68 సంవత్సరాల వయస్సులో 2022 అక్టోబర్ 1న మరణించాడు. [12] బాలకృష్ణన్ మృతదేహాన్ని స్వగ్రామమైన కన్నూర్‌కు తరలించి, అక్కడ పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 Staff Reporter (2018-02-26). "Kodiyeri re-elected CPI(M) State secretary". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2020-09-02.
  2. "Kodiyeri Balakrishnan is Deshabhimani Chief Editor".
  3. 3.0 3.1 3.2 "KERALA LEGISLATURE - MEMBERS Shri. KODIYERI BALAKRISHNAN". Niyamasabha. Retrieved 2 November 2020.
  4. "Kodiyeri Balakrishnan Gets Second Term as Kerala CPI-M State Secretary". News18. 25 February 2018. Retrieved 2020-09-02.
  5. "Kodiyeri Balakrishnan new CPI(M) state Secretary in Kerala". The Economic Times. Retrieved 2020-09-02.
  6. "Kodiyeri Balakrishnan Is No More". Deshabhimani (in ఇంగ్లీష్). Retrieved 2022-10-03.
  7. "Kodiyeri Balakrishnan steps down, MV Govindan Master is new CPM Kerala state secretary". The Indian Express (in ఇంగ్లీష్). 2022-08-28. Retrieved 2022-10-03.
  8. "Kerala CPI-M secretary's son appears before police, agrees to DNA test". National Herald. 8 July 2019. Retrieved 2 November 2020.
  9. Peter, Petlee (29 October 2020). "Bineesh Kodiyeri, son of Kerala CPI-M leader, held by ED in Bangalore". Times of India. Retrieved 2 November 2020.
  10. Philip, Shaju (2022-10-01). "Veteran CPM leader Kodiyeri Balakrishnan passes away". The Indian Express (in ఇంగ్లీష్). Retrieved 2022-10-03.
  11. "Ailing Kerala politicias at their peak". Mathrubhumi. 3 September 2022.
  12. "Veteran CPM leader Kodiyeri Balakrishnan, 68, passes away". OnManorama. Retrieved 2022-10-01.