కె.వీరరాఘవరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కె.వీరరాఘవయ్య మదురై జిల్లా కలెక్టర్‌[1][2][3]

జీవిత విశేషాలు

[మార్చు]

గుంటూరు జిల్లా తొట్టెంపూడి గ్రామం. నాన్న కె.వెంకటేశ్వర్లు, అగ్రికల్చరల్‌ మార్కెటింగ్‌ కార్యదర్శిగా రిటైరయ్యారు. అమ్మ ధనలక్ష్మి.గుంటూరు జిల్లా మద్దిరాల లో జవహర్‌ విద్యాలయంలో 6 నుంచి 10వ తరగతి వరకు చదివారు.విజయవాడ వీఆర్‌ సిద్ధార్థ కాలేజీలో బీటెక్‌ కంప్యూటర్‌సైన్స్‌ 2001లో పూర్తి చేశారు.నాలుగో ప్రయత్నంలో ఐఏఎస్‌కు ఎంపికయ్యారు.తొలి పోస్టింగ్‌ మదురై అసిస్టెంట్‌ కలెక్టర్‌ ట్రైనీ. తర్వాత తిరునల్వేలి సబ్‌ కలెక్టర్‌గా, కడలూరు అడిషనల్‌ కలెక్టర్‌గా, తిరుచ్చి నగర కమిషనర్‌గా, కడలూరు, విల్లుపురం జిల్లాల్లో సైక్లోన్‌ బాధితుల పునరావాస ప్రాజెక్టు డైరెక్టర్‌గా, తిరువళ్లూరు జిల్లా కలెక్టర్‌గా పని చేశారు.[4] జల్లికట్టు వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించిన అధికారి.బడుగుల దేవుడిగా చెప్పుకునే కలెక్టర్‌.కనీస సదుపాయాల కోసం ప్రజలు తన వద్దకు రావడం కాదు, అవి తెలుసుకోవడం కోసం, వాటిని పరిష్కరించడం కోసం తనే వారి దగ్గరికి వెళ్తానంటారు. గంటల తరబడి క్యూలో నిలబెట్టి ప్రజలకు సమస్యను సృష్టించకుండా సత్వరం ఆ సమస్యను తేల్చేస్తారు.ఎక్కడ పని చేసినా ఏ స్కూలుకెళ్లినా, కార్యాలయానికి వెళ్లినా అవి పరిశుభ్రంగా వున్నాయా లేదా, అక్కడ మొక్కలు వున్నాయా లేదా అని పరిశీలిస్తుంటారు.

పురస్కారాలు

[మార్చు]
  • వ్యక్తులకు పునరావాస సేవలను అందించి ఉత్తమజిల్లా గా తీర్చినందుకుగాను భారతదేశ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నుండి 2017 డిసెంబరు 3న జాతీయ పురస్కారాన్ని అందించారు.

మూలాలు

[మార్చు]
  1. "K Veera Raghava Rao releases delimitation draft map for Madurai - Times of India". The Times of India. Retrieved 2019-01-17.
  2. "district collectors, tamilnadu".
  3. "He comes back to the place of first posting".
  4. Reporter, Staff (2016-01-23). "He comes back to the place of first posting". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2019-01-17.

బయటి లంకెలు

[మార్చు]