కె.సుబ్రమణ్యం
కృష్ణస్వామి సుబ్రమణ్యం | |
---|---|
జననం | |
మరణం | 1971 ఏప్రిల్ 7 మద్రాసు | (వయసు 66)
వృత్తి | సినిమా దర్శకుడు, సినిమా నిర్మాత |
క్రియాశీల సంవత్సరాలు | 1931-1957 |
కృష్ణస్వామి సుబ్రమణ్యం (1904 - 1971) ప్రముఖ తొలితరం తమిళ సినిమా నిర్మాత, దర్శకుడు. 1904 ఏప్రిల్ 20న తంజావూరు జిల్లా పాపనాశంలో ఒక సంపన్న కుటుంబములో జన్మించాడు. ఈయన తండ్రి కృష్ణస్వామి అయ్యర్ పేరుమోసిన న్యాయవాది. సుబ్రమణ్యం కూడా తండ్రిబాటలో న్యాయశాస్త్రం చదివి న్యాయవాది అయ్యాడు. లా ప్రాక్టీసు కంటే సినిమాలపై మక్కువ ఏర్పరచుకున్న సుబ్రమణ్యం మద్రాసులో మూకీ సినిమా దర్శకుడు రాజా సందౌ వద్ద పనిచేశాడు. ఈయన ప్రముఖ భరతనాట్య కళాకారిణి పద్మా సుబ్రమణ్యం తండ్రి.
సుబ్రమణ్యం మద్రాసులో చలనచిత్ర పరిశ్రమ స్థాపనలో ప్రముఖపాత్ర వహించాడు. సుబ్రమణ్యం పేయుమ్ పెన్నుమ్ వంటి రాజా సందౌ యొక్క మూకీ చిత్రాలలో సినారిస్టుగా, నిర్మాతగా సినీజీవితాన్ని ప్రారంభించాడు. ఆర్.ఎమ్.అలగప్ప చెట్టియారుతో కలిసి మీనాక్షీ సినీటోన్ అనే నిర్మాణ సంస్థ ప్రారంభించి దర్శకుడిగా తొలిచిత్రమైన పావలక్కోడి సినిమా తీశాడు. ఈ సినిమాలో ఎం.కె.త్యాగరాజ భాగవతార్ సినీరంగానికి పరిచయమయ్యాడు. సమాజంలో ప్రచలితమైన కుల వ్యవస్థను విమర్శిస్తూ బాలయోగిని వంటి రాజకీయ చిత్రాన్ని తీసి, విభిన్నమైన దర్శకుడుగా పేరొందాడు.
1938లో, స్త్రీల సమస్యలను ఎత్తి చూపుతూ సేవాసదనం సినిమాను, అంటరానితనాన్ని విమర్శిస్తూ భక్త చేట, యుద్ధ ప్రయత్నాలను అద్దంపడుతూ మానసంరక్షణం సినిమాలు తీశాడు. ఈయన సినిమాలలో ప్రసిద్ధమైనది 1939లో విడుదలైన త్యాగభూమి. కల్కి కృష్ణమూర్తి నవల త్యాగభూమి ఆధారితంగా నిర్మించబడిన ఈ జాతీయవాద సంస్కరణా చిత్రాన్ని బ్రిటీషు ప్రభుత్వం నిషేధించింది.[1] ఈయన 1941లో ప్రముఖ నాటకకర్త ఎన్.పి.చెల్లప్పన్ వ్రాసిన ప్రహ్లాద అనే మలయాళ చిత్రానికి దర్శకత్వం వహించాడు.
చిత్రాలు
[మార్చు]- ప్రహ్లాద (1941) (దర్శకుడు)
- త్యాగభూమి (1939) (దర్శకుడు, నిర్మాత, రచయిత)
- సేవాసదన్ (1938)
- బాలయోగిని (1936) (దర్శకుడు, నిర్మాత, రచయిత)
బయటి లింకులు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-09-24. Retrieved 2013-08-02.