Jump to content

కె. కృష్ణమూర్తి

వికీపీడియా నుండి
కె. కృష్ణమూర్తి
జననం(1915-10-22)1915 అక్టోబరు 22
మరణం2011 మార్చి 6(2011-03-06) (వయసు 95)
వృత్తిస్వాతంత్ర్య సమరయోధుడు, రచయిత, ప్రచురణకర్త, రాజకీయ నాయకుడు
జీవిత భాగస్వామిలక్ష్మీ కృష్ణమూర్తి (1943-2009)

కె. కృష్ణమూర్తి ( 1915 అక్టోబరు 22 - 2011 మార్చి 6) కేరళ రాష్ట్రానికి చెందిన చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు, రచయిత, ప్రచురణకర్త, రాజకీయ నాయకుడు.

జననం, విద్యాభ్యాసం

[మార్చు]

కృష్ణమూర్తి 1915, అక్టోబరు 22న కేరళ రాష్ట్రంలోని కొట్టాయంలో జన్మించాడు. కొట్టాయంలోని పాఠశాల విద్యను పూర్తి చేసిన తర్వాత, తిరువనంతపురంలోని మహారాజా కళాశాల నుండి ఆంగ్లంలో పట్టభద్రుడవడంతోపాటు విశ్వవిద్యాలయ బంగారు పతకం కూడా సాధించాడు. తరువాత ఎంఏ చదువు కోసం మద్రాస్‌లోని ప్రెసిడెన్సీ కాలేజీలో చేరాడు. కొంతకాలం తర్వాత ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలోని హెర్ట్‌ఫోర్డ్ కాలేజీలో న్యాయశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీని అభ్యసించాడు. అక్కడ కూడా అతను బంగారు పతకాన్ని అందుకున్నాడు.

రచనా ప్రస్థానం

[మార్చు]

రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమవుతున్న సమయంలో భారతదేశానికి వచ్చిన కృష్ణమూర్తి రచనారంగాన్ని ఎంచుకున్నాడు. అతని మాన్యుస్క్రిప్ట్‌ను ప్రధాన ప్రచురణకర్తలు తిరస్కరించినప్పుడు, తన స్వంత పుస్తక విక్రేతలు ప్రచురణకర్తల సంస్థను స్థాపించాడు. 1944లో ఒక చిన్న బుక్‌షాప్ సబ్‌స్క్రిప్షన్ ఏజెన్సీని స్థాపించాడు. కొన్నేళ్ళ తరువాత ఇది కె. కృష్ణమూర్తి బుక్ సెల్లర్స్ పేరుతో ప్రముఖ పుస్తకాల దుకాణంగా అభివృద్ధి చెందింది. భారతదేశంలోని ఫెడరేషన్ ఆఫ్ పబ్లిషర్స్, బుక్ సెల్లర్స్ అసోసియేషన్స్ స్థాపకుల్లో ఒకడిగా ఉన్నాడు. బుక్ సెల్లర్స్ - పబ్లిషర్స్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఇండియాకు వైస్ ప్రెసిడెంట్‌గా, అధ్యక్షుడిగా ఉన్న పనిచేశాడు.

తన భార్యతో కలిసి 1965లో తమిళంలో 'వాచకర్ వట్టం' అనే పుస్తక క్లబ్‌ను ప్రారంభించాడు. 1970ల ప్రారంభంలో సంపాదకుడిగా నూలగం అనే తమిళ లైబ్రరీ సైన్స్ మ్యాగజైన్‌ను ప్రచురించాడు.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

1943లో భారత జాతీయ కాంగ్రెస్ నాయకుడు ఎస్. సత్యమూర్తి కుమార్తె లక్ష్మీ కృష్ణమూర్తిని వివాహం చేసుకున్నాడు. వారికి ముగ్గురు కుమారులు ఉన్నారు. లక్ష్మీ 2009లో మరణించింది.

మరణం

[మార్చు]

కృష్ణమూర్తి 2011, మార్చి 6న తమిళనాడులోని చెన్నైలో మరణించాడు.[1]

మూలాలు

[మార్చు]
  1. "Publisher K. Krishnamurty passes away". The Hindu. 7 March 2011.