కె. చెన్నకేశవ రెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కె. చెన్నకేశవ రెడ్డి
K Chenakeshava Reddy.jpg
ఎమ్మెల్యే
Assumed office
2014 - ప్రస్తుతం
Constituencyఎమ్మిగనూరు నియోజకవర్గం
వ్యక్తిగత వివరాలు
జననం
కడిమెట్ల చెన్నకేశవరెడ్డి

01 జులై 1940
కడిమెట్ల , యెమ్మిగనూరు మండలం , కర్నూలు జిల్లా , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం
రాజకీయ పార్టీవైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ
పదవులు
కాంగ్రెస్ పార్టీ
జీవిత భాగస్వామిభార్య రాజ్యలక్ష్మి
సంతానంఎర్రకోట జగన్‌మోహన్‌రెడ్డి (కుమారుడు), ఐదుగురు కుమార్తెలు
తల్లిదండ్రులుచెన్నారెడ్డి, విరుపాక్షమ్మ

కడిమెట్ల చెన్నకేశవరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో ఎమ్మిగనూరు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.

జననం, విద్యాభాస్యం[మార్చు]

కె. చెన్నకేశవ రెడ్డి 01 జులై 1940లో , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కర్నూలు జిల్లా , యెమ్మిగనూరు మండలం , కడిమెట్ల గ్రామంలో చెన్నారెడ్డి, విరుపాక్షమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన పీయూసీ వరకు చదివాడు.[1]

రాజకీయ జీవితం[మార్చు]

కె. చెన్నకేశవ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1985 నుండి 1990 వరకు కర్నూలు జిల్లా పరిషత్ వైస్ ఛైర్మన్‌గా పని చేశాడు. ఆయన 1994, 1999లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మిగనూరు నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన 2004, 2009 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా, వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణాంతరం 2011లో కాంగ్రెస్ పార్టీని విడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి బి.వి.మోహన్ రెడ్డి పై వరుసగా మూడుసార్లు గెలిచి ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్‌ సాధించాడు. కె.చెన్నకేశవ రెడ్డి 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బి.జయనాగేశ్వర రెడ్డి పై 25,610 ​ఓట్లతో గెలిచి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[2]

మూలాలు[మార్చు]

  1. Sakshi (18 March 2019). "కర్నూలు జిల్లా... అసెంబ్లీ స్థానాల అభ్యర్థుల జాబితా". Archived from the original on 17 September 2021. Retrieved 17 September 2021.
  2. Sakshi (2019). "Yemmiganur Constituency Winner List in AP Elections 2019". Archived from the original on 30 సెప్టెంబర్ 2021. Retrieved 30 September 2021. Check date values in: |archivedate= (help)