కె. పరాశరన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కె. పరాశరన్
రాజ్యసభ సభ్యుడు (నామినేటెడ్)
In office
జూన్ 29, 2012 – జూన్ 28, 2018
అడ్వకేట్ జనరల్ ఆఫ్ తమిళనాడు
In office
1976–1977
అంతకు ముందు వారుగోవింద్ స్వామినాధన్
తరువాత వారువి పి. రామన్
వ్యక్తిగత వివరాలు
జననం (1927-10-09) 1927 అక్టోబరు 9 (వయసు 96)
శ్రీరంగం, తమిళనాడు, భారతదేశం
జాతీయతభారతీయుడు
జీవిత భాగస్వామి
సరోజ పరశరన్
(m. 1949)
సంతానంఇద్దరు కూతుర్లు, ముగ్గురు కుమారులు
తల్లిదండ్రులుశ్రీ ఆర్. కేశవ అయ్యంగార్ (తండ్రి)
శ్రీమతి రంగనాయకి (తల్లి)
నివాసంన్యూ ఢిల్లీ
చదువుబి.ఎ. (ఎకనామిక్స్), బి.ఎల్. చెన్నై ప్రెసిడెన్సీ కళాశాల , లా కాలేజీ, మద్రాస్
వృత్తిన్యాయవాది
పురస్కారాలుపద్మ భూషణ్ (2003), పద్మ విభూషణ్ (2011)

కె. పరాశరన్ (జననం: అక్టోబర్ 9, 1927) భారతదేశానికి చెందిన న్యాయవాది. ఈయన 1976లో రాష్ట్రపతి పాలనలో తమిళనాడు రాష్ట్రానికి అడ్వకేట్ జనరల్ గా, 1983, 1989 మధ్య ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ హయాంలో భారత అటార్నీ జనరల్ గా పనిచేసాడు.[1][2]

తొలినాళ్ళ జీవితం[మార్చు]

ఈయన 1927, అక్టోబర్ 9న రంగనాయకి, కేశవ అయ్యంగార్ దంపతులకు తమిళనాడు రాష్ట్రంలోని శ్రీరంగం జిల్లాలో జన్మించారు. ఈయన తండ్రి పేరున్న న్యాయవాది, వేద పండితుడు. ఈయన తన బిఎల్ (ఇప్పుడు, బిఎ. ఎల్ఎల్బి) చదువుతున్నప్పుడు శ్రీ జస్టిస్ సి.వి. కుమారస్వామి శాస్త్రి సంస్కృత పతకం, జస్టిస్ శ్రీ వి. భాష్యమ్ అయ్యంగార్ హిందూ చట్టంలో బంగారు పతకాలు వచ్చాయి. ఈయన బార్ కౌన్సిల్ లో ఉండగా జస్టిస్ శ్రీ కె.ఎస్. కృష్ణస్వామి అయ్యంగార్ పతకం వరించింది.

కెరీర్[మార్చు]

ఈయన 1958 లో సుప్రీంకోర్టులో తన న్యాయ ప్రాక్టీసును ప్రారంభించాడు. ఈయన రెండు పర్యాయాలు భారత అటార్నీ జనరల్‌గా పనిచేసాడు. ఈయన హిందూ పవిత్ర గ్రంథాలను ఔపోసన పట్టిన పండితుడు. తనకున్న పరిజ్ఞానాన్ని అయోధ్య వాదనల్లో వినిపించాడు. రాజ్యసభ సభ్యుడిగా 2014 లో జాతీయ న్యాయ నియామక కమిషన్‌ను సమర్థించాడు. ఆరు దశాబ్దాలుగా తన కెరీర్‌లో శబరిమల కేసులో, శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశం గురించి సుప్రీంకోర్టులో తన వాదనను వినిపించాడు. ఈయన సేతుసముద్రం ప్రాజెక్ట్ కేసు కూడా వాదించాడు. ఈ కేసులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాదించాడు. ఈయన రాముడి కాలంలోనే సముద్రంలో బ్రిడ్జి నిర్మాణం జరిగిందని తన వాదనను వినిపించాడు.

శబరిమల కేసు[మార్చు]

శబరిమల ఆలయంలో రుతుస్రావం సమయంలో మహిళల ప్రవేశాన్ని పరిమితం చేయడం నిషేధం సరైనేదేనని నాయర్ సర్వీస్ సొసైటీని సమర్థించాడు. ఈయన నైతిక బ్రహ్మచార్య యొక్క భావనను వివరించడానికి రామాయణం నుండి పేరాలు పారాయణం చేశాడు.

అయోధ్య కేసు[మార్చు]

నూట నలభై ఏళ్లుగా నలుగుతున్న చారిత్రక అయోధ్య కేసు పరిష్కారానికి ఈయన వాదనలు వినిపించాడు. సుప్రీంకోర్టులో 40 రోజుల పాటు జరిగిన విచారణలో ప్రతిరోజు ఈయన పాల్గొన్నాడు. ఈయనకు ఈ కేసులో పీవీ యోగేశ్వరన్, అనిరుద్ధ్ శర్మ, పొట్టరాజు శ్రీధర్, అదితి దాని, డీఎస్ అశ్విని కుమార్, భక్తి వర్ధన్ సింగ్ సహకరించారు. ఈ కేసును సుప్రీంకోర్టు 2019 నవంబరు 9 న అయోధ్య తీర్పు రామ్ లల్లా విరాజ్మన్ అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఈ కేసులో ఈయన ముఖ్య పాత్ర పోషించాడు.

వ్యక్తిగత జీవితం[మార్చు]

ఈయన 1949లో సరోజాను వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ముగ్గురు కుమారులు, మోహన్ పరాశరన్, బాలాజీ పరాశరన్,, సతీష్ పరాశరన్, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

పురస్కారాలు[మార్చు]

ఈయనకు 2003లో భారత ప్రభుత్వం పద్మ భూషణ్ పురస్కారంతో సత్కరించింది.[3] 2011లో పద్మ విభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది.[4] 2019లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ‘మోస్ట్‌ ఎమినెంట్‌ సీనియర్‌ సిటిజెన్‌’ పురస్కారంతో సత్కరించారు.[5]

మరిన్ని విశేషాలు[మార్చు]

ఈయనను 2012లో ఆనాటి రాష్ట్రపతి భారత పార్లమెంటు ఎగువ సభ అయినటువంటి రాజ్యసభకు ఎంపీగా ఆరేళ్ల కాలానికి సభ్యునిగా నామినేట్ చేసాడు.

మూలాలు[మార్చు]

  1. "Meet K Parasaran, the 93-year-old Advocate For Hindus Whose Spiritual Connect With Ram Kept Him Going". News18. Retrieved 2019-12-06.
  2. "You Know Rajeev Dhavan, Now Meet 92-Year-Old K Parasaran Who Is Leading Hindus' Legal Fight For Ram Mandir". swarajyamag.com. Retrieved 2019-12-06.
  3. "K Parasaran, 'Pitamaha' of India Bar, emerges hero in Ayodhya land dispute case". www.businesstoday.in. Retrieved 2019-12-06.
  4. "Parasaran, Vittal, Natarajan among Padma awardees". The Hindu (in Indian English). Special Correspondent. 2011-01-26. ISSN 0971-751X. Retrieved 2019-12-06.{{cite news}}: CS1 maint: others (link)
  5. "M Venkaiah Naidu presents Most Eminent Senior Citizen Award to K Parasaran | DD News". ddnews.gov.in. Retrieved 2019-12-06.