Jump to content

కేటీ మార్టిన్

వికీపీడియా నుండి
కేటీ మార్టిన్
2020 ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్ సమయంలో న్యూజిలాండ్ తరపున బ్యాటింగ్ చేస్తున్న మార్టిన్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
కేటీ జేన్ మార్టిన్
పుట్టిన తేదీ (1985-02-07) 1985 ఫిబ్రవరి 7 (వయసు 39)
డునెడిన్, న్యూజీలాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
పాత్రవికెట్-కీపర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
ఏకైక టెస్టు (క్యాప్ 116)2003 27 November - India తో
తొలి వన్‌డే (క్యాప్ 97)2003 4 December - England తో
చివరి వన్‌డే2022 26 March - Pakistan తో
తొలి T20I (క్యాప్ 25)2008 6 March - Australia తో
చివరి T20I2022 9 February - India తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2001/02–2021/22Otago
2017/18–2019/20Melbourne Stars
కెరీర్ గణాంకాలు
పోటీ WTest WODI WT20I WLA
మ్యాచ్‌లు 1 103 95 279
చేసిన పరుగులు 49 1,793 996 6,459
బ్యాటింగు సగటు 24.50 22.13 18.10 28.32
100లు/50లు 0/0 0/7 0/4 7/34
అత్యుత్తమ స్కోరు 46 81 65 118*
వేసిన బంతులు 6
వికెట్లు 1
బౌలింగు సగటు 7.00
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0
అత్యుత్తమ బౌలింగు 1/7
క్యాచ్‌లు/స్టంపింగులు 0/0 63/19 33/24 172/90
మూలం: CricketArchive, 18 May 2022

కేటీ జేన్ మార్టిన్ (జననం 1985, ఫిబ్రవరి 6) న్యూజీలాండ్ క్రికెట్ వ్యాఖ్యాత, వికెట్ కీపర్, కుడిచేతి వాటం బ్యాటర్‌గా ఆడిన మాజీ క్రికెటర్.[1] 2003 - 2022 మధ్యకాలంలో న్యూజీలాండ్ తరపున ఒక టెస్ట్ మ్యాచ్, 103 వన్ డే ఇంటర్నేషనల్స్, 95 ట్వంటీ 20 ఇంటర్నేషనల్స్ ఆడింది. ఒటాగో, మెల్‌బోర్న్ స్టార్స్ తరపున దేశవాళీ క్రికెట్ లో ప్రాతినిధ్యం వహించింది.[2][3]

దేశీయ క్రికెట్

[మార్చు]

మార్టిన్ 2001–02 స్టేట్ లీగ్‌లో ఒటాగో తరపున సెంట్రల్ డిస్ట్రిక్ట్‌లతో జరిగిన మ్యాచ్ లో అరంగేట్రం చేసింది.[4] 2021–22 సీజన్ ముగిసే వరకు తన కెరీర్ మొత్తం ఒటాగో కోసం ఆడింది.[3] న్యూజీలాండ్ తరపున మహిళల దేశవాళీ వన్డే క్రికెట్‌లో అత్యధిక మ్యాచ్‌లు, అత్యధిక వికెట్ కీపింగ్ అవుట్ చేసి రికార్డు సాధించింది. దేశీయ వన్డే క్రికెట్‌లో 4,000 పరుగులు చేసిన ఆరుగురు క్రీడాకారిణులలో ఒకరిగా, దేశవాళీ టీ20 క్రికెట్‌లో 2,000 పరుగులు చేసిన ఆరుగురు క్రీడాకారిణులలో ఒకరిగా నిలిచింది.[5]

అంతర్జాతీయ క్రికెట్

[మార్చు]

2003 నవంబరు, డిసెంబరులో భారత పర్యటన కోసం మార్టిన్ మొదటిసారిగా న్యూజిలాండ్ జట్టుకు ఎంపికయింది. సిరీస్‌లోని మొదటి మ్యాచ్, టెస్ట్ మ్యాచ్‌లో అంతర్జాతీయ అరంగేట్రం చేసి, మొదటి ఇన్నింగ్స్‌లో 46 పరుగులు చేసింది. మార్టిన్ ఆడిన ఏకైక టెస్ట్ మ్యాచ్ ఇది.[6] పర్యటనలోని 1వ వన్డేలో వన్డే అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేసింది.[7] 2008లో ఆస్ట్రేలియాపై ట్వంటీ20 అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేసింది.[8]

2022 మేలో క్రికెట్ లోని అన్ని ఫార్మాట్ల నుండి మార్టిన్ రిటైర్మెంట్ ప్రకటించింది.[5]

మూలాలు

[మార్చు]
  1. George, Zoë (15 January 2022). "White Fern Katey Martin is throwing out the traditional cricket commentary rule book". Stuff.
  2. "Player Profile: Katey Martin". ESPNcricinfo. Retrieved 18 May 2022.
  3. 3.0 3.1 "Player Profile: Katey Martin". CricketArchive. Retrieved 18 May 2022.
  4. "Otago Women v Central Districts Women, 5 January 2002". CricketArchive. Retrieved 18 May 2022.
  5. 5.0 5.1 "Martin calls time on cricket career". New Zealand Cricket. 17 May 2022. Archived from the original on 7 June 2022. Retrieved 17 May 2022.
  6. "India Women v New Zealand Women, 27th, 28th, 29th, 30th November 2003". CricketArchive. Retrieved 18 May 2022.
  7. "India Women v New Zealand Women, 4 December 2003". CricketArchive. Retrieved 18 May 2022.
  8. "New Zealand Women v Australia Women, 6 March 2008". CricketArchive. Retrieved 18 May 2022.

బాహ్య లింకులు

[మార్చు]