Jump to content

కేళడి చెన్నమ్మ

వికీపీడియా నుండి
(కేలడి చెన్నమ్మ నుండి దారిమార్పు చెందింది)
కేళడి చెన్నమ్మ

కేళడి చెన్నమ్మ కర్ణాటక రాష్ట్రం, షిమోగా జిల్లాలోని కేలడి ప్రాంతాన్ని పరిపాలించిన వీరవనిత. ఈమె కుందాపూర్ రాజు సిద్ధప్ప శెట్టి కుమార్తె. సోమశేఖరుని 1667 లో వివాహమాడింది. 1671 నుండి 1696 వరకు, పాతికేళ్ళు పరిపాలనలో ఉండి, బీజాపూర్ సైన్యాన్నీ, ఔరంగజేబు నూ ఎదిరించి, భర్త చేయలేని పనిని ఆమె చేసి రాజ్యాన్ని రక్షించుకొంది. శివాజీ కుమారుడు, రాజారామ్ కు ఆశ్రయమిచ్చి, ఔరంగజేబు కోపానికి గురి అయింది. 1824 లో బ్రిటిష్ సైన్యం కిత్తూరు (ఇప్పుడు కర్ణాటకలో ఉంది) ను ఆక్రమించుకోవడానికి ప్రయత్నించినప్పుడు, ఆమె కరవాలం ధరించి వీరోచితంగా పొరాడింది. చివరకు బ్రిటిష్ వారికి బందీగా చిక్కి, 1829 లో మరణించింది. కాని ఆ పోరు అంతటితో ఆగలేదు. రాయన్న అనే చెన్నమ్మ సైనికుడు తిరిగి యుద్ధాన్ని ప్రారంభించాడు. కాని ఎన్నో యుద్ధాల తరువాత, అతను కూడా బ్రిటిష్ వారికి చిక్కి, 1830 లో ఉరితీయబడ్డాడు.

మూలాలు

[మార్చు]

కేలడి చెన్నమ్మ

బయటి లింకులు

[మార్చు]

[1] కేలడి చెన్నమ్మ