కేశవదాసు
తెలుగు రచయిత చందాల కేశవదాసు గురించిన వ్యాసం ఇక్కడ చూడండి.
రసికప్రియ అను హిందీ శృంగార కావ్యమున కేశవదాసు (Keśavdās) (హిందీ: केशवदास) (1555 – 1617) అను కవి రచించెను. కేశవదాసుడు బుందేల్ఖండ్ అను గ్రామ వాసి. ఈ గ్రామం ప్రస్తుతము ఉత్తర్ ప్రదేశ్, మధ్య ప్రదేశ్ లో విస్తరించి ఉంది. రాజా మధుకరషా ఇతనికి ఆస్థానమున ఆశ్రయమిచ్చి సన్మానించెను[1]. మధుకరుని అనంతరము అతని ఆసనమును అధిష్ఠించిన అతని కుమారుడు ఆంధ్రజిత్తుషా ఇతని పాండితికి మెచ్చి 21 గ్రామంలను బహుమతిగా ఇచ్చెను.
కేశవదాసు రచనలలో రెండవది ఈరసికప్రియ. ఇది సుమారు క్రీ.శ. 1591 సం. రచింపబడింది. దీని తరువాతి రచన 'కవిప్రియ' అను అలంకార గ్రంథము. అది క్రీ.శ. 1601 సం. నాటిది. హిందీ భాషయందు గల ప్రేమకావ్యములలో ఈ రసికప్రియకు చక్కని పేరు గలదు. 17, 18 వ శతాబ్దములనాటి పహారీ చిత్రములు చాలా వరకు ఈ కావ్యమును అధారపడినవే. ఆ చిత్రములలో చాలావరకు అడుగు భాగమునను, కొన్ని వెనుక వైపున ఇతని పద్యములు రచింపబడినవి.ఒకప్పుడు అక్బరుచక్రవర్తి ఇద్రజిత్తుషాకు అవిధేయతగా 10 మిలియనుల రూపాయలు అపరాధమును విధించెను. ఆసందర్భమున కేశవదాసు అక్బరు అస్ఠానమునకు బయలుదేరి, అక్బరు మంత్రి వీరబలునితో ఈ విషయమై రహస్యముగా మంతనమాడి ఈ రసికప్రియను ఆతనికి వినిపించెను. వీరబలుడు ఆతని పాండితికి మెచ్చి ఈ అపరాధమును రద్దు చేయిపించెను. రసికప్రియ 16 అధ్యాయముల కావ్యము. అందు ద్వితీయ, తృతీయ, సత్పమాధ్యాయములు బాగా ప్రాచుర్యము పొందినవి. నాయక లక్షణములను ద్వితీయాధ్యాయమునునందు, తృతీయాధ్యాయమునందు నాయికా లక్షణములను, అష్టానయికావర్ణన సప్తమాధ్యాయమునందు వివరించెను. ఈ పహారీ చిత్రములందు చాలావరకు రాధా, కృష్ణులే నాయికా, నాయకులుగా చిత్రింపబడినవి. ఈ పహారీ చిత్రములు "The Journal of Indian Art" చాలా మట్టుకు వర్ణింపబడినవి.
చిత్రమాలిక[మార్చు]
మూలాలు[మార్చు]
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-04-02. Retrieved 2014-04-02.
- Bahadur, K.P. (tr.) (1972). The Rasikapriya of Keshavadasa, Delhi: Motilal Banarsidass.
ఇతర లింకులు[మార్చు]
![]() |
Wikimedia Commons has media related to Keshavdas. |
- Keshavdas at Kavita Kosh (Hindi)