రసికప్రియ రాగం
Appearance
(రసికప్రియ నుండి దారిమార్పు చెందింది)
రసికప్రియ రాగము కర్ణాటక సంగీతంలో ఒక రాగము.[1][2] కర్ణాటక సంగీతంలోని 72 మేళకర్త రాగాల వ్యవస్థలో చివరిదైన 72 వరాగం. ముత్తుస్వామి దీక్షితుల కర్ణాటక సంగీత పాఠశాలలో ఈ రాగాన్ని "రసమంజరి" అని పిలుస్తారు. [3][4]
రాగ లక్షణాలు
[మార్చు]- ఆరోహణ: స రి గ మ ప ధ ని స
- (S R3 G3 M2 P D3 N3 S)
- అవరోహణ: స ని ధ ప మ గ రి స
- (S N3 D3 P M2 G3 R3 S)
ఈ రాగంలో వినిపించే స్వరాలు : షట్‍శృతి రిషభం, అంతర గాంధారం, ప్రతి మధ్యమం, షట్‍శృతి ధైవతం, కాకలి నిషాధం. ఈ సంపూర్ణ రాగం 36వ మేళకర్త రాగమైన చలనాట రాగము నకు ప్రతి మధ్యమ సమానం.
రచనలు
[మార్చు]రసికప్రియ రాగంలో స్వరకల్పన చేయబడ్డ కొన్ని కృతులు:
- శృతిద్వావింశతీ - వెంకటమఖి
- శృంగారరసమంజరీం - ముత్తుస్వామి దీక్షితులు
- పవనతనయే - బాలమురళికృష్ణ
- అరుల్ సెయ్య - కోటేశ్వర అయ్యర్
- పావన తనయ పాలయమా.... - డా. మంగళంపల్లి బాలమురళీ కృష్ణ
- పరిపాహి పాహి కుట్టికుంహి తంగచి
- వీణాగాన ప్రియే వర్ణం - చంద్రపోతర్ (బి.శశికుమార్)
- రాజత సభా నాయకనే - ముత్తయ్య భాగవతార్
మూలాలు
[మార్చు]- ↑ Ragas in Carnatic music, డా॥ఎస్.భాగ్యలక్ష్మి రచన, ప్ర.సం.1990, సీబీహెచ్ పబ్లిషర్స్
- ↑ Sri Muthuswami Dikshitar Keertanaigal by Vidwan A Sundaram Iyer, Pub. 1989, Music Book Publishers, Mylapore, Chennai
- ↑ Ragas in Carnatic music by Dr. S. Bhagyalekshmy, Pub. 1990, CBH Publications
- ↑ Raganidhi by P. Subba Rao, Pub. 1964, The Music Academy of Madras