మానవతి రాగము
Appearance
(మానవతి రాగం నుండి దారిమార్పు చెందింది)
మానవతి రాగము కర్ణాటక సంగీతంలో ఒక రాగం. ఇది కర్ణాటక సంగీతంలోని 72 మేళకర్త రాగాల వ్యవస్థలో 5వ మేళకర్త రాగము.[1] ముత్తుస్వామి దీక్షితుల కర్ణాటక సంగీత పాఠశాలలో ఈ రాగాన్ని మనోరంజని అంటారు.[2]
రాగ లక్షణాలు
[మార్చు]- ఆరోహణ : స రి గ మ ప ధ ని స
- (S R1 G1 M1 P D2 N3 S)
- అవరోహణ : స ని ధ ప మ గ రి స
- (S N3 D2 P M1 G1 R1 S)
ఈ రాగం లోని స్వరాలు శుద్ధ రిషభం, శుద్ధ గాంధారం, శుద్ధ మధ్యమం, చతుశృతి ధైవతం, కాకళి నిషాధం. ఇది 41 మేళకర్త పావని రాగానికి శుద్ధ మధ్యమ సమానము.
ఉదాహరణలు
[మార్చు]చాలామంది వాగ్గేయకారులు మానవతి రాగంలో కీర్తనల్ని రచించారు.
- ఎవరితో నీ దెల్పుడు - త్యాగరాజ స్వామి వారి కీర్తన
- నిజభక్తిం - కోటీశ్వర అయ్యర్
- శ్రీ హనుమంతన్ - మంగళంపల్లి బాలమురళీ కృష్ణ
జంట స్వరకల్పనలు మనోరంజని రాగంలో ఉన్నాయి.
- అటు కారాదని - ఆది తాళం - త్యాగరాజు
- బాలాంభిక - మధ్య తాళం - ముత్తుస్వామి దీక్షితులు
- బహ్జ భజ మానస - ఆది తాళం - పి.బి.శ్రీరంగాచారి
జన్య రాగాలు
[మార్చు]మానవతి రాగానికి కొన్ని జన్య రాగాలు ఉన్నవి.