వనస్పతి రాగము
(వనస్పతి రాగం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation
Jump to search
వనస్పతి రాగం కర్ణాటక సంగీతంలో ఒక రాగం. ఇది కర్ణాటక సంగీతంలోని 72 మేళకర్త రాగాల వ్యవస్థలో 4వ మేళకర్త రాగము. ముత్తుస్వామి దీక్షితుల కర్ణాటక సంగీత పాఠశాలలో, ఈ రాగాన్ని భానుమతి రాగం అంటారు.[1][2][3]
రాగ లక్షణాలు[మార్చు]
- ఆరోహణ : స రి గ మ ప ధ ని స
- (S R1 G1 M1 P D2 N2 S)
- అవరోహణ : స ని ధ ప మ గ రి స
- (S N2 D2 P M1 G1 R1 S)
ఈ రాగం లోని స్వరాలు శుద్ధ రిషభం, శుద్ధ గాంధారం, శుద్ధ మధ్యమం, చతుశృతి ధైవతం, కైశికి నిషాధం. ఇది 40 మేళకర్త నవనీతం రాగానికి శుద్ధ మధ్యమ సమానము.
ఉదాహరణలు[మార్చు]
చాలామంది వాగ్గేయకారులు గానమూర్తి రాగంలో కీర్తనల్ని రచించారు.
- పరియాచకమా - త్యాగరాజ స్వామి వారి కీర్తన
- బృహదాంబ - ముత్తుస్వామి దీక్షితార్
జన్య రాగాలు[మార్చు]
వనస్పతి రాగానికి కొన్ని జన్య రాగాలు ఉన్నవి. వీనిలో రసాలి రాగం ఒకటి.