రిషభప్రియ రాగం
రిషభప్రియ రాగము కర్ణాటక సంగీతంలో 62వ మేళకర్త రాగము.[1][2] ఇది 26వ మేళకర్త అయిన చారుకేశి ప్రతి మధ్యమానికి సమానమైనది. దీనిని ముత్తుస్వామి దీక్షితుల కర్ణాటక సంగీతం విధానంలో 'రతిప్రియ' అని పేర్కొన్నారు.[2][3]
రాగ లక్షణాలు
[మార్చు]
ఇది 11వ చక్రరుద్రంలో 2వ రాగం. దీనిని గుర్తుంచుకునే పేరు (mnemonic name) 'రుద్రశ్రీ'. పదబంధం - స రి గ మ ప ద ని. ఈ రాగంలో వినిపించే స్వరాలు: చతుశృతి రిషభం, అంతర గాంధారం, ప్రతి మధ్యమం, శుద్ధ ధైవతం, కైశికి నిషాధం. ఇది మేళకర్త, ఆరోహణ అవరోహణ క్రమంలో సప్త స్వరాలు పలికే ఈ రాగం సంపూర్ణ రాగం. ఈ రాగానికి సంబంధించి స్వరాలు ఆరోహణ-అవరోహణ స్థాయిలు, హిందుస్తానిలోను , ఇంకా దాని పాశ్చాత్య స్కేలు ఈ క్రింది పట్టికలో ఉన్నాయి.
| ఆరోహణ | అవరోహణ | |
|---|---|---|
| కర్ణాటక | స రి గ మ ప ద ని స | స ని ద ప మ గ రి |
| హిందుస్తానీ | స రి గ మ ప ద ని స | స ని ద ప మ గ రి |
| పాశ్చాత్త్య | C D E F# G Ab Bb | C Bb Ab G F# E D C |
జన్యరాగాలు
[మార్చు]ఈ రాగానికి అనుబంధంగా ఏర్పడిన జన్యరాగాలు, వాటి ఆరోహణ, అవరోహణ వివరాలు ఈ పట్టికలో పొందుపర్చడమైనది.
| మేళకర్త | 62వ మేళ కర్త |
|---|---|
| రకము | సంపూర్ణ రాగం |
| ఆరోహణ | S | R2 | G3 | M2 | P | D1 | N2 | S (స రి గ మ ప ధ ని స) |
| అవరోహణ | S | N2 | D1 | P | M2 | G3 | R2 | S (స ని ధ ప మ గ రి) |
ఇవీ చూడండి: జన్య రాగాల జాబితా
| 62 - రిషభప్రియ | S R2 G3 M2 P D1 N2 S | S N2 D1 P M2 G3 R2 S |
| రతి ప్రియ | S R2 G3 M2 P D1 N2 S | S N2 D1 P M2 G3 R2 S |
| గోప్రియ | S R2 G3 M2 D1 N2 S | S N3 D1 M2 G3 R2 S |
| పూర్ణసావేరి | S R2 M2 P D1 S | S N2 D1 P M2 G3 R2 S |
| రత్నభాను | S R2 M2 P N2 D1 N2 S | S N2 D1 P M2 G3 R2 S |
| శుద్ధ సారంగ | S G M2 P N2 S | S D1 P M2 G3 S |
ఈ రాగంలో రచనలు
[మార్చు]- మార రతిప్రియం - ముత్తుస్వామి దీక్షితులు
- నందీశం వందే - మంగళంపల్లి బాలమురళికృష్ణ
- మహిమ దక్కించు - త్యాగయ్య
- ఘనా నయ దేశిక - కోటీశ్వర అయ్యర్
- ఇంట సోదనములకు - వీణే శేషన్న గారి
- పన్నీరు కయ్యనే - డి.పట్టమ్మాళ్
- మహాత్ములే తెలియలేరు - మైసూర్ వాసుదేవాచార్యులు
శాస్త్రీయ అంశాలు
[మార్చు]పంచమం ('పా') నుండి గ్రహభేదం ఉపయోగించి రిషభప్రియ స్వరాలను (notes) మార్చినప్పుడు, మరొక మేళకర్త రాగం వస్తుంది, అది కోకిలప్రియ. గ్రహభేదం అంటే సాపేక్ష స్వర పౌనఃపున్యాలను (ఫ్రీక్వెన్సీలో) ఒకే విధంగా ఉంచే ప్రక్రియ, అదే సమయంలో షడ్జమాన్ని రాగంలో తదుపరి స్వరానికి మారుస్తుంది. "రిషభప్రియ" "కోకిలప్రియ" కూడా పూర్తి స్వర స్కేల్‌ను కలిగి ఉన్న మేళకర్త రాగాలు.
రిషభప్రియ ఆరోహణంలో పంచమాన్ని (ప) తొలగించడం ద్వారా ఏర్పడిన జన్య రాగం 'గోప్రియ'. ఆరోహణం, అవరోహణం (S R2 G3 M2 D1 N2 S---S N2 D1 M2 G3 R2 S) ప్రత్యేకమైనవి, దానిపై గ్రహభేదం చేయడం వలన అదే రాగం పదే పదే ఉత్పత్తి అవుతుంది. ఎందుకంటే స్వరాలు పౌన:పున్యంలో సమానంగా వేరు చేయబడతాయి. పాశ్చాత్య శాస్త్రీయ సంగీత పరిభాషలో, దీనిని హోల్ టోన్ స్కేల్ అంటారు.