కనకాంగి రాగం
స్వరూపం
కనకాంగి రాగము (కనకాంగి అంటే బంగారు శరీరం కలిగినది) కర్ణాటక సంగీతంలో మొదటి మేళకర్త రాగము.[1] కర్ణాటక సంగీతంలోని 72 మేళకర్త రాగంలో ఇది 1వ మేళకర్త రాగం. ముత్తుస్వామి దీక్షితార్ పాఠశాలలో దీనిని కనకాంబరి అంటారు.[2][3]
రాగ లక్షణాలు
[మార్చు]- ఆరోహణ : స రిగా మ ప ధని స
- (S R1 G1 M1 P D1 N1)
- అవరోహణ : సని ధ ప మగా రి స
- (S N1 D1 P M1 G1 R1)
ఈ రాగం లోని స్వరాలు శుద్ధ రిషభం, శుద్ధ గాంధారం, శుద్ధ మధ్యమం, శుద్ధ ధైవతం , శుద్ధ నిషాధం. ఇది 37 మేళకర్త సాలగం రాగానికి శుద్ధ మధ్యమ సమానము.
ఉదాహరణలు
[మార్చు]చాలామంది వాగ్గేయకారులు కనకాంగి రాగంలో కీర్తనల్ని రచించారు.
- శ్రీగణనాథం భజామ్యహం - త్యాగరాజ స్వామి వారు రచించిన ప్రసిద్ధిచెందిన కీర్తన.
- సింధుభైరవి సినిమాలోని మోహం అనుడు హాలాహలమిదే అన్న పాట.
- శ్రుతిలయలు సినిమాలోని "శ్రీగణనాథం" పాట.
జన్య రాగాలు
[మార్చు]కనకాంగి రాగానికి కొన్ని జన్య రాగాలు ఉన్నాయి. వీనిలో మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి లవంగి ఒకటి.