ధర్మవతి రాగం
స్వరూపం
ధర్మవతి రాగము కర్ణాటక సంగీతంలో 59వ మేళకర్త రాగము.[1][2]
రాగ లక్షణాలు
[మార్చు]- ఆరోహణ: స రి గ మ ప ధ ని స
- (S R2 G2 M2 P D2 N3 S)
- అవరోహణ: స ని ధ ప మ గ రి స
- (S N3 D2 P M2 G2 R2 S)
ఈ రాగంలో వినిపించే స్వరాలు : చతుశృతి రిషభం, సాధారణ గాంధారం, ప్రతి మధ్యమం, చతుశృతి ధైవతం, కాకలి నిషాధం. ఈ సంపూర్ణ రాగం 23వ మేళకర్త రాగమైన గౌరీమనోహరి రాగము నకు ప్రతి మధ్యమ సమానం.
రచనలు
[మార్చు]- పరంధామవతీ జయతి - ముత్తుస్వామి దీక్షితులు
- అందెలరవమిది - సీతారామశాస్త్రి - ఇళయరాజా సంగీతం(స్వర్ణకమలం చిత్రంలో)
- కొంటెగాణ్ణి కట్టుకో- జెంటిల్‍మ్యాన్ సినిమాలో - ఏ ఆర్ రెహ్మాన్ సంగీతం