చక్రవాకం రాగం
Appearance
చక్రవాకం రాగము కర్ణాటక సంగీతంలో 16వ మేళకర్త రాగము.[1] ఇది హిందుస్థానీ సంగీతంలోని అహిర్ భైరవ్ రాగాన్ని పోలివుంటుంది.
రాగ లక్షణాలు
[మార్చు]- ఆరోహణ : స రిగా మ ప ధని స
- (S R1 G3 M1 P D2 N2 S)
- అవరోహణ : సని ధ ప మగా రి స
- (S N2 D2 P M1 G3 R1 S)
ఈ రాగం లోని స్వరాలు శుద్ధ ఋషభము, అంతర గాంధారము, శుద్ధ మధ్యమము, చతుశ్రుతి ధైవతము, కైశికి నిషాధము). ఇది 52 వ మేళకర్త రాగమైన రామప్రియకి శుద్ధ మధ్యమ సమానము.
ఉదాహరణలు
[మార్చు]- భళి వైరాగ్యంబెంతో బాగై యున్నది - రామదాసు కీర్తన.
- గజాననయుతం - ముత్తుస్వామి దీక్షితార్ కీర్తన.
- ఎటుల బ్రోతువో తెలియ, సుగుణములే - త్యాగరాజు కీర్తనలు.
చక్రవాకం జన్యరాగాలు
[మార్చు]చక్రవాకం లోని కొన్ని జన్య రాగాలు: బిందుమాలిని, మలయమారుతం, వలాచి.
మూలాలు
[మార్చు]- ↑ Ragas in Carnatic music, డా॥ఎస్.భాగ్యలక్ష్మి రచన, ప్ర.సం.1990, సీబీహెచ్ పబ్లిషర్స్