కామవర్ధిని రాగం
స్వరూపం
ఆరోహణ | S R₁ G₃ M₂ P D₁ N₃ Ṡ |
---|---|
అవరోహణ | Ṡ N₃ D₁ P M₂ G₃ R₁ S |
కామవర్ధిని రాగము కర్ణాటక సంగీతంలో ఒక రాగం ఇది 72 మేళకర్త రాగాల జాబితాలో 51వ రాగం. .[1][2] దీనిని "పంతువరాళి" [3] అనే పేరుతో కూడా పిలుస్తారు. అయినప్పటికీ స్వచ్ఛతావాదులు దీనిని కామవర్ధినిగా పేర్కొనడానికి ఇష్టపడతారు. దీని అర్థం "కోరికను పెంచేది"
కచేరీ ప్రారంభంలో సాధారణంగా సంగీతకారులు పాడటం వల్ల ఈ రాగం బాగా ప్రాచుర్యం పొందింది. ఈ రాగాన్ని ముత్తుస్వామి దీక్షితుల కర్ణాటక సంగీత పాఠశాలలో "కాశీరామక్రియ" గా పిలుస్తారు. హిందూస్థానీ సంగీతంలో దీనికి సమానమైన రాగం "పూర్వి థాట్/పురియ ధనశ్రీ"[3][4]
రాగ లక్షణాలు
[మార్చు]ఆరోహణ: స రిగా మ ప ధని స (S R1 G3 M2 P D1 N3 S) అవరోహణ: సని ధ ప మగా రి స (S N3 D1 P M2 G3 R1 S)
ఈ రాగంలో వినిపించే స్వరాలు : శుద్ధ రిషభం, అంతర గాంధారం, ప్రతి మధ్యమం, శుద్ధ ధైవతం, కాకలి నిషాధం. ఈ సంపూర్ణ రాగం 15వ మేళకర్త రాగమైన మాయామాళవగౌళ రాగము నకు ప్రతి మధ్యమ సమానం.
రచనలు
[మార్చు]- గురువిణ గులామనాగువ తనక - పురందరదాసు
- రఘువర నన్ను, శంభో మహదేవ, సరమేగని, అపరామ భక్తి, శోభానే, సుందర ధరదేహం, నిన్నే నేరా నమ్మి, శివ శివ శివ అనరాదా - త్యాగరాజు
- ఎన్న గాను రామ - భద్రాచల రామదాసు
- రామనాథం భజహే, విశాలక్షీం విశ్వేసీం, సేనాపతె పాలయమాం - ముత్తుస్వామి దీక్షితులు
- సరసాక్ష పరిపాలయ మామాయి, పరిపాలయ సరసిరుహ , సరోరుహాసన - స్వాతి తిరునాళ్
- శరణం తవ - మంగళంపల్లి బాలమురళీకృష్ణ
- శంకరి నిన్నే - మైసూరు వాసుదేవాచారి
తెలుగు సినిమా పాటలు
[మార్చు]క్రమ సంఖ్య | పాట | తెలుగు సినిమా |
1 | చందన చర్చిత నీలకళేబర పీతవసన వనమాలీ[5] | సతీ తులసి |
2 | కామలీలా ధను సన్నిభ | మహాకవి కాళిదాసు (సినిమా) |
3 | మరులు రేకెత్త | కరుణశ్రీ |
4 | నా హృది పయనించు శృంగార రథమా | మర్యాద రామన్న |
5 | రామ చిలుక | త్యాగయ్య |
మూలాలు
[మార్చు]- ↑ Ragas in Carnatic music, డా॥ఎస్.భాగ్యలక్ష్మి రచన, ప్ర.సం.1990, సీబీహెచ్ పబ్లిషర్స్
- ↑ Sri Muthuswami Dikshitar Keertanaigal by Vidwan A Sundaram Iyer, Pub. 1989, Music Book Publishers, Mylapore, Chennai
- ↑ 3.0 3.1 Ragas in Carnatic music by Dr. S. Bhagyalekshmy, Pub. 1990, CBH Publications
- ↑ Raganidhi by P. Subba Rao, Pub. 1964, The Music Academy of Madras
- ↑ "Carnatic Songs - chandhana charchitha (ashTapadi)". karnatik.com. Retrieved 2020-07-27.