సప్తస్వరాలు

వికీపీడియా నుండి
(అవరోహణ (సంగీతం) నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
భారతీయ సంగీతం
వ్యాసముల క్రమము
సాంప్రదాయక సంగీతం

కర్ణాటక సంగీతము  · హిందుస్థానీ సంగీతము
భారత ఫోక్ సంగీతం  · తుమ్రి · దాద్రా · గజల్ · ఖవ్వాలీ
చైతీ · కజ్రీ · సూఫీ

ఆధునిక సంగీతము

భాంగ్రా · చలన చిత్ర సంగీతము
పాప్ సంగీతం · రాక్ సంగీతం · బ్లూస్ సంగీతం
 · జజ్ సంగీతం · ట్రాన్స్ సంగీతం

వాగ్గేయకారులు, సంగీత విద్వాంసులు

హిందుస్థానీ సంగీత విద్వాంసులు
కర్ణాటక సంగీత విద్వాంసులు

గాయకులు

హిందుస్థానీ సంగీత గాయకులు
హిందుస్థానీ సంగీత గాయకులు

సంగీత వాద్యాలు

సంగీత వాద్యపరికరాల జాబితా
సంగీత వాయిద్యాలు

భావనలు

రాగము · తాళము · పల్లవి
తాళదశ ప్రాణములు
షడంగములు · స్థాయి · స్వరము
గీతము · కృతి · వర్ణము
రాగమాలిక · పదము · జావళి · తిల్లాన
మేళకర్త రాగాలు · కటపయాది సంఖ్య
జానపదము

సంగీత ధ్వనులు

స్థాయి · తీవ్రత · నాదగుణము
ప్రతిధ్వని · అనునాదము
సహాయక కంపనము
గ్రామఫోను · రేడియో

సంగీత పద నిఘంటువు

సంగీత పదాల పర్యాయ పదములు

భారతీయ సంగీతము
భారతీయ సాంప్రదాయ సంగీతము
కర్ణాటక సంగీతము

భారతీయ సంగీతంలో సప్తస్వరాలు : స, రి, గ, మ, ప, ద, ని. వీటిలో ఒక్కొక్కటి ఒక్కొక్క పక్షి కూత లేక జంతువు అరుపు నుంచి పుట్టినది.

'స ' షడ్జమము, 'రి ' రిషభం, 'గ ' గాంధారం, 'మ ' మధ్యమము, 'ప ' పంచమం, 'ద 'దైవతం, 'ని ' నిషాధం, అని సప్తస్వరాల పేర్లు. ఈ సప్త స్వరాలను అనేక రీతులు మేళవించడం వల్ల రాగాలు ఏర్పడతాయి. అయితే ఒక రాగంలో సప్త స్వరాలు తప్పని సరిగా ఉండాలన్న నియమం లేదు.

సాధారణంగా ఒక రాగంలో కనీసం ఐదు స్వరాలు ఉండాలన్న ఒక నియమం ఉంది. కానీ [మంగళంపల్లి బాలమురళీకృష్ణ] నాలుగు స్వరాలనే వినియోగించుకోని రాగాలను కూర్చారు.ఈ రాగాల కూర్పుతోనే భారతీయ సంగీతం, సంగీత ప్రపంచంలో తనదైన ప్రత్యకతను నిలుపుకోగల్గుతున్నదని పరిశీలకుల భావన. స్వరాలకు ఆధారం శృతులు., శృతి అంటే ధ్వని విశేషం.సంగీతానికి పనికి వచ్చే శృతులు 22. వీనికి సిద్ధ, ప్రభావతి, కాంత, సుప్రభ, శిఖ, దీప్తిమతి, ఉగ్ర, హలది, నివ్రి, ధీర, క్షాంతి, విభూతి, మాలని, చపల వంటి పేర్లున్నాయి. పాశ్ఛాత్య సంగీతంలో 12 శ్రుతులతో సంగీత ఉచ్చస్థితి (అష్టమ స్వరం) కి చేరుకోగా భారతీయ సంగీతంలో 22 శ్రుతులతో తారాస్థాయి చేరుకుంటుంది.

స = షడ్జమం (నెమలి క్రేంకారం)

రి = రిషభం (ఎద్దు రంకె)

గ = గాంధర్వం (మేక అరుపు)

మ = మధ్యమం (క్రౌంచపక్షి కూత)

ప = పంచమం (కోయిల కూత)

ద = దైవతం (గుర్రం సకిలింత)

ని = నిషాదం (ఏనుగు ఘీంకారం)

  • ఆరోహణ: తక్కువ పౌనఃపున్యం ఉన్న స్వరం నుంచి ప్రారంభించి - ఎక్కువ పౌనఃపున్యం ఉన్న స్వరం దాకా పాడడం లేదా వాయించడం ఆరోహణ అవుతుంది. అనగా మధ్యమ స్థాయి షడ్జం నుండి తారా స్థాయి షడ్జం వరకు.
    • ఉదా: స రి గా మ ప ద ని స.
  • అవరోహణ: ఎక్కువ పౌనఃపున్యం ఉన్న స్వరం నుంచి ప్రారంభించి - తక్కువ పౌనఃపున్యం ఉన్న స్వరం దాకా పాడడం లేదా వాయించడం అవరోహణ అవుతుంది. అనగా తారా స్థాయి షడ్జం నుండి మధ్యమ స్థాయి షడ్జం వరకు.
    • ఉదా: స ని ద ప మ గా రి స.

కర్ణాటక సంగీత స్వరాలు

[మార్చు]

కర్ణాటక సంగీతంలో రిషభం, గాంధారం, ధైవతం, నిషాదంలో మూడు, మధ్యమంలో రెండు, పంచమం, షడ్జంలో ఒక్కొక్కటి చొప్పున 16 స్వరాలు ఉన్నాయి.

స్థానము స్వరము Short name Notation Mnemonic
1 షడ్జము S sa
2 శుద్ధ ఋషభము రి R1 ra
3 చతుశ్రుతి ఋషభము రి R2 ri
3 శుద్ధ గాంధారము G1 ga
4 షట్చ్రుతి ఋషభము రి R3 ru
4 సాధారణ గాంధారము G2 gi
5 అంతర గాంధారము G3 gu
6 శుద్ధ మధ్యమము M1 ma
7 ప్రతి మధ్యమము M2 mi
8 పంచమము P pa
9 శుద్ధ ధైవతము D1 dha
10 చతుశ్రుతి ధైవతము D2 dhi
10 శుద్ధ నిషాదము ని N1 na
11 షట్చ్రుతి ధైవతము D3 dhu
11 కైసికి నిషాదము ని N2 ni
12 కాకలి నిషాదము ని N3 nu

As you can see above, Chathusruthi Rishabha and Shuddha Gandhara share the same pitch (3rd key/ position). Hence if C is chosen as Shadja, D would be both Chathusruthi Rishabha and Shuddha Gandhara. Hence they will not occur in same raga together. Similarly for two swaras each at notes 4, 10 and 11.

స్వరాల అర్ధ వివరణ

[మార్చు]

ప్రతి శుద్ధ స్వరం (i.e., స, రి, గ, మ, ప, ధ,, ని) సాంప్రదాయం ప్రకారం వివిధ జంతువుల కూతల నుండి ఆవిర్భవించినట్లు భావిస్తారు. కొన్నిటికి ఇతర అర్ధాలు కూడా ఉన్నాయి. ప్రతి స్వరం మన శరీరంలోని ఏడు చక్రాలతో సంధించబడ్డాయి. సప్తస్వరాలు అరోహణ పద్ధతిలో చక్రాలు కూడా అరోహణ లోనే చెప్పబడ్డాయి. కోమల స్వరాలు ఎడమవైపు చక్రాలతో (ఇడ, పింగళ, శుషుమ) సంధించబడితే శుద్ధ, తీవ్ర స్వరాలు కుడివైపు చక్రలతో అనుసంధానించబడ్డాయి. అందువలన ప్రతి రాగం దానికి అనుసంధించబడిన చక్రం ప్రకారం ప్రభావం చూపుతాయి.

స్వరం వివరణ అర్ధం జంతువు చక్రం దేవుడు
షడ్జం (षड्जं) Sagar నెమలి mūlādhāra मूलाधार (anus) బ్రహ్మ
రి రిషభం (रिषभं) bull ఎద్దు svādhiṣṭhāna स्वाधिष्ठान (genitals) అగ్ని
గా గాంధారం (गान्धारं) Gagan మేక maṇipūra मणिपूर (solar plexus and stomach) రుద్రుడు
మధ్యమం (मध्यमं) middle క్రౌంచపక్షి anāhata अनाहत (heart and lungs) విష్ణువు
పంచమం (पंचमं) fifth కోయిల viśuddha विशुद्ध (throat) నారదుడు
ధైవతం (धैवतं) Dharti గుర్రం ājñā आज्ञा (third eye) వినాయకుడు
ని నిషాదం (निषादं) outcast/hunter ఏనుగు sahasrāra सहस्रार (crown of the head) సూర్యుడు