నాగానందిని రాగం
Appearance
నాగానందిని రాగం కర్ణాటక సంగీతంలో ఒక రాగం. ఇది కర్ణాటక సంగీతంలోని 72 మేళకర్త రాగాల వ్యవస్థలో 30 వ మేళకర్త రాగము. దీనిని కర్ణాటక సంగీత ముత్తుస్వామి దీక్షితుల పాఠశాలలో నాగాభరణం అని పిలుస్తారు.[1][2][3]
రాగ లక్షణాలు
[మార్చు]- ఆరోహణ: స రిగా మ ప ధని స
- S R2 G3 M1 P D3 N3 S
- అవరోహణ: సని ధ ప మగా రి స
- S N3 D3 P M1 G3 R2 S
ఈ రాగంలోని స్వరాలు : చతుశ్రుతి రిషభం, అంతర గాంధారం, శుద్ధ మధ్యమం, షట్‍శృతి ధైవతం, "కాకలి నిషాదం". ఈ సంపూర్ణ రాగంలో ఏడు స్వరాలు ఉంటాయి. ఇది 66 వ మేళకర్త రాగమైన చిత్రాంబరి రాగము నకు శుద్ధ మధ్యమ సమానం.
ఉదాహరణలు
[మార్చు]ఈ రాగంలోని కొన్ని ప్రసిద్ధిచెందిన రచనలు.
- సత్తలేనిదినము - ఆది - త్యాగరాజు
- నాగాభరణం- ఆది - ముత్తుస్వామి దీక్షితులు
- సంచారి - మఠ్య - సుబ్బరాయ దీక్షితులు
- దాక్షాయణి రక్షమాం - మంగళంపల్లి బాలమురళీకృష్ణ