శ్యామలాంగి రాగం
Appearance
శ్యామలాంగి రాగము కర్ణాటక సంగీతంలో ఒక రాగం. ఇది కర్ణాటక సంగీతంలోని 72 మేళకర్త రాగాల వ్యవస్థలో 55వ మేళకర్త రాగము. దీనిని కర్ణాటక సంగీత ముత్తుస్వామి దీక్షితార్ పాఠశాలలో శ్యామలం అంటారు.[1][2][3]
రాగ లక్షణాలు
[మార్చు]- ఆరోహణ: స రి గ మ ప ధ ని స
- (S R2 G2 M2 P D1 N1 S)
- అవరోహణ: స ని ధ ప మ గ రి స
- (S N1 D1 P M2 G2 R2 S)
ఈ రాగంలో వినిపించే స్వరాలు : చతుశృతి రిషభం, సాధారణ గాంధారం, ప్రతి మధ్యమం, శుద్ధ ధైవతం, శుద్ధ నిషాధం. ఈ సంపూర్ణ రాగం 19వ మేళకర్త రాగమైన ఝంకారధ్వని రాగము నకు ప్రతి మధ్యమ సమానం.
రచనలు
[మార్చు]- శ్యామలాంగి జలయేలోచన - బాలమురళికృష్ణ
- శ్యామలాంగి - ముత్తుస్వామి దీక్షితులు
- వీర రాఘవ - కోటేశ్వర అయ్యర్
- వినతి చకొనవయ్యా - డా. మంగళంపల్లి బాలమురళీ కృష్ణ
- నమో నమస్తే గీర్వాణి - ముత్తుస్వామి దీక్షితులు