వకుళాభరణం రాగము
(వకుళాభరణం రాగం నుండి దారిమార్పు చెందింది)
వకుళాభరణం రాగం కర్ణాటక సంగీతంలో ఒక రాగం. ఇది కర్ణాటక సంగీతంలోని 72 మేళకర్త రాగాల వ్యవస్థలో 14వ మేళకర్త రాగము.[1] దీనిని ముత్తుస్వామి దీక్షితుల కర్ణాటక సంగీతం పాఠశాలలో ధాటి వసంత భైరవిi[2][3], లేదా వాటి వసంత భైరవి[4] అని పిలుస్తారు.
లక్షణాలు
[మార్చు]- ఆరోహణం: స రి గ మ ప ధ ని స
- (S R1 G3 M1 P D1 N2 S)
- అవరోహణం: స ని ధ ప మ గ రి స
- (S N2 D1 P M1 G3 R1 S)
ఇందులోని స్వరాలు : శుద్ధ రిషభం, అంతర గాంధారం, శుద్ధ మధ్యమం, శుద్ధ ధైవతం, కైసకి నిషాధం.
ఇదొక సంపూర్ణ మేళకర్త రాగము. ఇది 50వ మేళకర్త రాగమైన నామనారాయణ రాగానికి శుద్ధ మధ్యమ సమానమైనది.
జన్య రాగాలు
[మార్చు]వకుళాభరణ రాగానికి సంబంధించిన జన్య రాగాలలో వసంతభైరవి ఒకటి.
ఉదాహరణలు
[మార్చు]ఈ రాగంలోని కొన్ని రచనలు.
- ఏ రాముని నమ్మితినో -త్యాగరాజు
- రామ నామమై - మైసూర్ వాసుదేవాచారి
- గౌరీనాథం - ఓట్టుక్కడు వెంకట కవి
- నంబినేన్ అయ్యా - కోటేశ్వర్ అయ్యర్
- కుమారుని వాలెము కావవే - మంగళంపల్లి బాలమురళీకృష్న
మూలాలు
[మార్చు]- ↑ Ragas in Carnatic music, డా॥ఎస్.భాగ్యలక్ష్మి రచన, ప్ర.సం.1990, సీబీహెచ్ పబ్లిషర్స్
- ↑ Ragas in Carnatic music by Dr. S. Bhagyalekshmy, Pub. 1990, CBH Publications
- ↑ Raganidhi by P. Subba Rao, Pub. 1964, The Music Academy of Madras
- ↑ Sri Muthuswami Dikshitar Keertanaigal by Vidwan A. Sundaram Iyer, Pub. 1989, Music Book Publishers, Mylapore, Chennai, India