కే వాసుదేవరెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కేతిరెడ్డి వాసుదేవరెడ్డి
కే వాసుదేవరెడ్డి


తెలంగాణ రాష్ట్ర వికలాంగుల సహకార సంస్థ చైర్మన్‌
పదవీ కాలం
2017 - 07 డిసెంబర్ 2023[1]
నియోజకవర్గం భూపాలపల్లి

వ్యక్తిగత వివరాలు

జననం 24 ఆగష్టు [2]
గోర్లవేడు గ్రామం, భూపాలపల్లి మండలం ,హన్మకొండ జిల్లా
రాజకీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి
జీవిత భాగస్వామి రమ్య
సంతానం కేతిరెడ్డి చంద్రశేఖర్ రావు
మతం హిందూ
జనవరి 3, 2022నాటికి

కేతిరెడ్డి వాసుదేవరెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన తెలంగాణ రాష్ట్ర వికలాంగుల సహకార సంస్థ చైర్మన్‌గా 2017లో నియమితుడయ్యాడు.[3] ఆయన పదవి కాలాన్ని సెప్టెంబర్ 2020లో రెండోసారి ఏడాది పెంచుతూ, తెలంగాణ రాష్ట్ర వికలాంగుల సహకార సంస్థ చైర్మన్‌గా మూడోసారి రెండేండ్లు పెంచుతూ పదవి కాలాన్ని డిసెంబర్ 2021లో రాష్ట్ర ప్రభుత్వం పొడగించగా,[4] 22 డిసెంబర్ 2021న మూడోసారి సంస్థ చైర్మన్‌గా భాద్యతలు చేపట్టాడు.[5]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

కే వాసుదేవ రెడ్డి 24 ఆగష్టు న తెలంగాణ రాష్ట్రం, హన్మకొండ జిల్లా, భూపాలపల్లి మండలం , గోర్లవేడు గ్రామంలో జన్మించాడు. ఆయన కాకతీయ యూనివర్సిటీ నుండి ఏం.ఏ (పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్), ఎంఫిల్, పి.హెచ్.డి, బి.ఈ.డి పూర్తి చేశాడు. ఆయన వివాహం హన్మకొండలో 28 మే 2015న రమ్యతో జరిగింది.[6]

రాజకీయ జీవితం

[మార్చు]

కే వాసుదేవ రెడ్డి 2004లో తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరి 2004 నుండి 2006 వరకు కాకతీయ యూనివర్సిటీ టీఆర్‌ఎస్‌వీ అధ్యక్షుడిగా, టీఆర్‌ఎస్‌వీ వరంగల్ ఇంచార్జిగా, టిఆర్ఎస్వి వరంగల్ పట్టణ అధ్యక్షుడిగా, టీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర జనరల్ సెక్రటరీగా వివిధ హోదాల్లో పని చేశాడు. ఆయన తెలంగాణ రాష్ట్ర వికలాంగుల సహకార సంస్థ చైర్మన్‌గా 2017 మే 29న నియమితుడయ్యాడు.[7][8] ఆయన పదవి కాలాన్ని రెండేళ్లు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం 19 డిసెంబర్ 2021న ఉత్తర్వులు జారీ చేయగా,[9] ఆయన 22 డిసెంబర్ 2021న మూడోసారి చైర్మన్‌గా భాద్యతలు చేపట్టాడు.[10]

మూలాలు

[మార్చు]
  1. V6 Velugu (11 December 2023). "54 కార్పొరేషన్ల చైర్మన్లు ఔట్". Archived from the original on 19 February 2024. Retrieved 19 February 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. Namasthe Telangana (24 August 2021). "సీఎం కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్న వాసుదేవరెడ్డి". Archived from the original on 10 January 2022. Retrieved 10 January 2022.
  3. Deccan Chronicle (29 May 2017). "Telangana govt appoints chairpersons to 8 state-run corporations" (in ఇంగ్లీష్). Archived from the original on 22 June 2022. Retrieved 22 June 2022.
  4. Namasthe Telangana (17 December 2021). "వాసుదేవరెడ్డి పదవీకాలం పొడిగింపు". Archived from the original on 18 December 2021. Retrieved 18 December 2021.
  5. Eenadu (22 December 2021). "ముగ్గురు చైర్మన్ల బాధ్యతల స్వీకరణ". Archived from the original on 30 December 2021. Retrieved 30 December 2021.
  6. Sakshi (28 May 2015). "విద్యార్థి నేత వివాహానికి కేసీఆర్ హాజరు". Archived from the original on 10 January 2022. Retrieved 10 January 2022.
  7. Sakshi (29 May 2017). "8 కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం". Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
  8. The Hans India (1 June 2017). "Warangal gets major share in nominated posts" (in ఇంగ్లీష్). Archived from the original on 10 January 2022. Retrieved 10 January 2022.
  9. Eenadu (19 December 2021). "రెండు కార్పొరేషన్ల ఛైర్మన్లపదవీకాలం పొడిగింపు" (in ఇంగ్లీష్). Archived from the original on 10 January 2022. Retrieved 10 January 2022.
  10. Namasthe Telangana (22 December 2021). "బాధ్యతలు స్వీకరించిన వాసుదేవరెడ్డి". Archived from the original on 10 January 2022. Retrieved 10 January 2022.