కైప సుబ్రహ్మణ్యశర్మ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కైప సుబ్రహ్మణ్యశర్మ అనంతపురం జిల్లాకు చెందిన ప్రముఖుడు.

కైప సుబ్రహ్మణ్యశర్మ
జననంకైప సుబ్రహ్మణ్యశర్మ
1890 అక్టోబరు
India ఇల్లూరు గ్రామం, అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
వృత్తిఆయుర్వేదవైద్యుడు
ప్రసిద్ధిస్వాతంత్ర్య సమరయోధుడు, పాత్రికేయుడు, సంఘసంస్కర్త,
పదవి పేరుభిషగ్వర
మతంహిందూ
తండ్రిమహానంది శాస్త్రి
తల్లిసుబ్బమ్మ

ఈయన 1890, అక్టోబరులో అనంతపురం జిల్లా ఇల్లూరు గ్రామంలో సుబ్బమ్మ, మహానందిశాస్త్రిగార్లకు జన్మించాడు. మద్రాసులోని పండిత దివి గోపాలాచార్యుల ఆయుర్వేద కళాశాలలో 4 సంవత్సరాలు చదివి 'భిషగ్వర' పట్టాను పొందాడు. 1920లో పామిడిలో జరిగిన మద్యపాన నిషేధకార్యక్రమంలో పప్పూరు రామాచార్యులు, తరిమెల సుబ్బారెడ్డి, కైప మహానందయ్య మొదలైన వారితో కలిసి పాల్గొని ప్రభుత్వ నిర్బంధానికి గురి అయ్యాడు. 1929లో నంద్యాలలో గాడిచర్ల హరిసర్వోత్తమరావు అనుయాయిగా సాంఘిక, సాంస్కృతిక,రాజకీయ రంగాలలో చురుకుగా పాల్గొన్నాడు. యుద్ధ వ్యతిరేక ప్రచారం సాగిస్తున్నాడనే అభియోగం పై 1941 ఫిబ్రవరి 11వ తేదీ అరెస్టయి 6 నెలలు జైలు శిక్ష అనుభవించాడు. అనంతపురంలో పినాకిని ముద్రణాలయం ప్రారంభించి తద్వారా పినాకిని అనే వారపత్రికను పప్పూరు రామాచార్యులు ఆధ్వర్యంలో నడిపాడు.