కొండేపల్లి (మార్కాపురం)
స్వరూపం
కొండేపల్లి (మార్కాపురం) | |
---|---|
గ్రామం | |
అక్షాంశ రేఖాంశాలు: 15°42′36.144″N 79°13′14.520″E / 15.71004000°N 79.22070000°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం |
మండలం | మార్కాపురం |
అదనపు జనాభాగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | స్త్రీ పురుష జనాభా వివరాలు లేవు |
ప్రాంతపు కోడ్ | +91 ( | )
కొండేపల్లి ప్రకాశం జిల్లా మార్కాపురం మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
గ్రామ పంచాయతీ
[మార్చు]- ఈ గ్రామానికి చెందిన కె.పి.కొండారెడ్డి, మొదట కొండేపల్లి సర్పంచిగా పనిచేశాడు. 1985 మధ్యంతర ఎన్నికలలో మార్కాపురం శాసనసభ్యులుగా గెలుపొందినారు. 1989, 1999, 2004 లలో గూడా శాసనసభకు ఎన్నికైనాడు.
- ఈ గ్రామవాసియైన నిరక్షరాస్యురాలైన బలుసుపాటి అచ్చమ్మ, 1995లో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నికైంది. ఈమె హయాంలో గ్రామంలో అంతర్గత మట్టి రహదారులు, సిమెంటు రహదారులు, త్ర్రాగునీటి పథకాలు రూపుదిద్దుకున్నాయి. ఐదు సంవత్సరాలు ఈమె మంచి సర్పంచిగా గుర్తింపు తెచ్చుకుంది. పదవీ కాలం పూర్తి అయ్యేనాటికి ఈమెకు, రు. 2.5 లక్షల అప్పు మిగిలింది. ఆసరాగా నిలిచిన భర్త కాలం చేసాడు. చేసేది లేక ప్రస్తుతం వ్యవసాయ కూలీగా బ్రతుకీడుస్తుంది.
మూలాలు
[మార్చు]ఇదొక గ్రామానికి చెందిన మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |