మార్కాపురం మండలం
ఆంధ్రప్రదేశ్ మండలం | |
![]() | |
| Coordinates: 15°44′28″N 79°16′12″E / 15.741°N 79.27°E | |
| దేశం | భారతదేశం |
| రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
| జిల్లా | మార్కాపురం జిల్లా |
| మండల కేంద్రం | మార్కాపురం |
| విస్తీర్ణం | |
• మొత్తం | 348 కి.మీ2 (134 చ. మై) |
| జనాభా (2011)[2] | |
• మొత్తం | 1,22,984 |
| • సాంద్రత | 350/కి.మీ2 (920/చ. మై.) |
| జనగణాంకాలు | |
| • లింగ నిష్పత్తి | 980 |
మార్కాపురం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని మార్కాపురం జిల్లాకు చెందిన మండలం. మండలం లోని 23 గ్రామాల్లో రెండు నిర్జన గ్రామాలు. మండలానికి తూర్పున దొనకొండ, ఉత్తరాన పెద్దారవీడు, పశ్చిమాన అర్ధవీడు, దక్షిణాన తర్లుపాడు, నైరుతిలో కంభం మండలాలు సరిహద్దులుగా ఉన్నాయి.
మండలం లోని పట్టణాలు
[మార్చు]- మార్కాపురం (మున్సిపల్ టౌన్)
జనాభా గణాంకాలు
[మార్చు]2011 భారత జనాభా లెక్కల ప్రకారం ప్రకాశం జిల్లాలోని మార్కాపురం మండలంలో మొత్తం జనాభా 122,984. వీరిలో 62,117 మంది పురుషులు, 60,867 మంది మహిళలు. 2011లో మార్కాపూర్ మండల పరిథిలో మొత్తం 29,906 కుటుంబాలు నివసిస్తున్నాయి. మండల సగటు లింగ నిష్పత్తి 980.[3]
మండల మొత్తం జనాభాలో 57.8% మంది పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు, 42.2% మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో సగటు అక్షరాస్యత రేటు 75.3% కాగా, గ్రామీణ ప్రాంతాల్లో 57.1%. అలాగే మండలంలోని పట్టణ ప్రాంతాల లింగ నిష్పత్తి 992 కాగా, గ్రామీణ ప్రాంతాల్లో 964.
మండలంలో 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 14627, ఇది మొత్తం జనాభాలో 12%. 0-6 సంవత్సరాల మధ్య వయస్సు గల 7515 మంది మగ పిల్లలు ఉండగా, 7112 మంది ఆడ పిల్లలు ఉన్నారు. బాలల లింగ నిష్పత్తి 946, ఇది మండల సగటు లింగ నిష్పత్తి (980) కంటే తక్కువ.
మండల మొత్తం అక్షరాస్యత రేటు 67.66%. మార్కాపూర్ మండలంలో పురుషుల అక్షరాస్యత రేటు 69.12%, స్త్రీల అక్షరాస్యత రేటు 49.92%.[4]
మండలంలోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూయేతర గ్రామాలు
[మార్చు]- జమ్మనపల్లి
- నికరంపల్లి
- పెద నాగులవరం
- ఇడుపూరు
- గజ్జలకొండ
- పెద యాచవరం
- మార్కాపురం
- వేములకోట
- కొలభీమునిపాడు
- అక్కచెరువు
- గొట్టిపడియ
- తిప్పాయపాలెం
- భూపతిపల్లి
- బొందలపాడు
- మల్యావంతునిపాడు
- బడేఖాన్‌పేట
- చింతకుంట
- శివరాంపురం
- నరసింహపురం
- గోగులదిన్నె
- రాయవరం
రెవెన్యూయేతర గ్రామాలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "District Handbook of Statistics - Prakasam District - 2014" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
- ↑ CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, PRAKASAM, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972957, archived from the original (PDF) on 25 August 2015
- ↑ "Markapur Mandal Population, Religion, Caste Prakasam district, Andhra Pradesh - Census India". www.censusindia.co.in (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2025-12-31.[permanent dead link]
- ↑ "Census of India Website : Office of the Registrar General & Census Commissioner, India". www.censusindia.gov.in. Archived from the original on 2019-11-13. Retrieved 2020-01-15.
