భూపతిపల్లి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


భూపతిపల్లె ప్రకాశం జిల్లా, మార్కాపురం మండలంలోని గ్రామం. భూపతిపల్లె , బొడిచెర్ల , మిట్టమీదిపల్లె గ్రామాలూ ఈ పంచాయితీ లో భాగంగా ఉన్నయి. ఇది మండల కేంద్రమైన మార్కాపురం నుండి 14 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 985 ఇళ్లతో, 3944 జనాభాతో 1930 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 2051, ఆడవారి సంఖ్య 1893. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1173 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 107. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 590857[1].పిన్ కోడ్: 523332.


భూపతిపల్లి
రెవిన్యూ గ్రామం
భూపతిపల్లి is located in Andhra Pradesh
భూపతిపల్లి
భూపతిపల్లి
నిర్దేశాంకాలు: 15°39′32″N 79°09′36″E / 15.659°N 79.16°E / 15.659; 79.16Coordinates: 15°39′32″N 79°09′36″E / 15.659°N 79.16°E / 15.659; 79.16 Edit this at Wikidata
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంమార్కాపురం మండలం Edit this on Wikidata
విస్తీర్ణం
 • మొత్తం1,930 హె. (4,770 ఎ.)
జనాభా
(2011)
 • మొత్తం3,944
 • సాంద్రత200/కి.మీ2 (530/చ. మై.)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ( Edit this at Wikidata)
పిన్(PIN)Edit this at Wikidata

విద్యా సౌకర్యాలు[మార్చు]

ప్రాదమిక పాఠశాల :[మార్చు]


ప్రాదమిక ఉన్నత పాఠశాల :[మార్చు]

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల :[మార్చు]

తొలుత ప్రాథమికోన్నత పాఠశాలగా ఉన్న ఈ పాఠశాలను 2004-2005 విద్యాసంవత్సరం నుండి ఉన్నత పాఠశాలగా ఉన్నతీకరించారు. మొదట అధ్వాన్నంగా ఉన్న ఈ పాఠశాలను ఉపాధ్యాయులే పూనుకొని, ప్రతి ఉపధ్యాయుడూ 15వేల నుండి 20వేల రూపాయలు చందాలు వేసుకొని, మొత్తం రెండున్నర లక్షల రూపాయలు సమీకరించి, ఈ పాఠశాలను అభివృద్ధి పరచారు. దాతలు గూడా సహకరించారు. గ్రామానికి చెందిన దాతలు, లక్షల రూపయలు ఖరీదుచేసే 3 ఎకరాల స్థలాన్ని పాఠశాలకు విరాళంగా అందించారు. విద్యార్థులకు, ఉపాధ్యాయులకు మరుగుదొడ్లు కట్టిమంచారు. త్రాగునీటి ట్యాంకులు కట్టించారు. ఒక కళావేదికను గూడా వితరణ చేసారు. ఈ విధంగా పాఠశాలకు అన్ని సౌకర్యాలు ఏర్పడినవి. గ్రామస్తులలో గూడా అవగాహన కల్పించారు. పాఠశాలను సుందరంగా తీర్చిదిద్దినారు. పాఠశాల ప్రాంగణాన్ని, పచ్చదనంతో నింపివేసినారు. దేశభక్తుల, మహనీయుల విగ్రహాలను ఏర్పాటుచేసారు. వాహనాలు నిలుపుదల కొరకు ఒక రేకులషెడ్డు ఏర్పాటుచేసుకున్నారు. ప్రభుత్వం మంజూరుచేసిన నిధులకు మరికొంత జమచేసి, ఒక వంటశాలను ఏర్పాటుచేసుకున్నారు. ఈ పాఠశాల ఫలితాలలో గూడా తన ఘనతను చాటుకుంటున్నది. పదవ తరగతి పరీక్షలలో వరుసగా 4 సంవత్సరాలు 90% కంటే ఎక్కువగా ఫలితాలు సాధించుచున్నది. [2]

ఆదర్ష పాఠశాల :[మార్చు]

సమీప ఆదర్శ పాఠశాల గ్రామం నుంచి ఒక కిలోమీటర్ దూరం లో 2013-14 సంవత్సరం నుంచి  అందుబాటులో ఉంది. ''ఆంధ్రప్రదేశ్ ఆదర్శ పాఠశాల, కళాశాల ,మిట్టమీదిపల్లి "

జూనియర్ కళాశాల :[మార్చు]

 1. 07016 ఆంధ్రప్రదేశ్ ఆదర్శ పాఠశాల, కళాశాల ,మిట్టమీదిపల్లి   2013-2014

గ్రామం నుంచి 15 కి.మీ దూరం లో అందుబాటు ఉన్న కళాశాలలు

 1. 07103 ప్రభుత్వ జూనియర్ కళాశాల , కంభం 1970-1971
 2. 07039 ఆంధ్ర ప్రదేశ్ సాంఘిక  సంక్షేమ జూనియర్ కళాశాల ( బాలికల ) , మార్కాపురం 2013-2014
 3. 07108 ఆంధ్ర ప్రదేశ్ సాంఘిక  సంక్షేమ జూనియర్ కళాశాల ( బాలికల ) , కంభం 2005-2006
 4. 07072 శ్రీ రెడ్డి జూనియర్ కళాశాల (బాలికల ) , మార్కాపురం 1981-198
 5. 07035 నారాయణ జూనియర్ కళాశాల , మార్కాపురం 2009-2010
 6. 07075 శ్రీ భావన జూనియర్ కళాశాల , మార్కాపురం , 1994-1995
 7. 07077 శ్రీ సాధన  జూనియర్ కళాశాల , మార్కాపురం 2001-2002
 8. 07078 శ్రీ గౌతమ్  జూనియర్ కళాశాల ,మార్కాపురం 2005-2006
 9. 07080 శ్రీ సాయి వికాస్ జూనియర్  కళాశాల , మార్కాపురం 2007-2008
 10. 07081 కమలా జూనియర్  కళాశాల , మార్కాపురం 2009-2010
 11. 07104 శ్రీ రంగరాజు జూనియర్  కళాశాల , కంభం 1992-1993
 12. 07105 విజ్ఞాన భారతి  జూనియర్  కళాశాల , కంభం 1997-1998
 13. 07107 శ్రీ వాసవి  జూనియర్  కళాశాల , కంభం 2005-2006
 14. 07106 శ్రీ వెంకటేశ్వర కో!  జూనియర్  కళాశాల , కంభం 988-1989


డిగ్రీ కళాశాల[మార్చు]

 1. ప్రభుత్వ డిగ్రీ కళాశాల , కంభం
 2. శ్రీ  వాసవి  కన్యకా  పరమేశ్వరి  ఆర్ట్స్ ,సైన్స్& కామర్స్  కాలేజీ , మార్కాపురం
 3. శ్రీ రెడ్డి డిగ్రీ కాలేజీ , మార్కాపురం
 4. శ్రీ సాధన  డిగ్రీ కాలేజీ , మార్కాపురం
 5. Ideal and Sri Krishna Chaitanya Memorial Degree College, Markapuram
 6. Kamala College of Education , markapuram
 7. Trinity Degree College , markapuram
 8. Chaitanya College of Education , markapuram

వృత్తి విద్య కళాశాలలు:[మార్చు]

ITI & POLYTECHNIC[మార్చు]

 1. C.P.R.R.Private I.T.I , cumbum
 2. Govt ITI College, Markapuram
 3. SVKP Polytechnic College , cumbum
 4. Dr.Samuel George Institute of Engineering & Technology , markapuram


ENGG & PHARMA[మార్చు]

 1. Dr Samuel George Institute of Engineering and Technology, Markapuram
 2. Dr Samuel George Institution of Pharmaceutical Sciences, Markapuram
 3. Krishna Chaitanya Institute of Technology and Sciences, Markapuram
 4. Indira Institute of Technology and Sciences, Markapuram
 5. Chaitanya College Of Pharmacy , Markapuram
 6. A1 Global Institute of Engineering & Technology , markapuram

BUSINESS MANAGEMENT & PG COLLEGES:[మార్చు]

MBA[మార్చు]

 1. Kamala Institute Of Management Studies , markapuram
 2. Vasavi MCA & MBA College , markapuram
 3. Sri Venkateswara Mba College , markapuram
 4. Global Institute Of Business Management , markapuram

PG[మార్చు]

 1. Svkp Pg Center , cumbum
 2. Sadhana Degree College , markapuram


BED & DED COLLEGES:[మార్చు]


 1. Kamala College of Education , Markapuram
 2. chaitanya college , Markapuram
 3. Tarlupadu College of Education , Markapuramసమీప వైద్య కళాశాల గుంటూరులోను, . సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం మార్కాపురంలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల చీమకుర్తి లోనూ ఉన్నాయి.


వైద్య సౌకర్యం[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం[మార్చు]

భూపతిపల్లిలో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఇద్దరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు.

ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది.

డిస్పెన్సరీ, సంచార వైద్య శాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.

సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం[మార్చు]

తాగు నీరు[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా శుద్ధి చేయని నీరు సరఫరా అవుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది.

పారిశుధ్యం[మార్చు]

మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ అందుబాటులో ఉంది . సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థఅందుబాటులో ఉంది.

సమాచార, రవాణా సౌకర్యాలు[మార్చు]

భూపతిపల్లిలో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. ప్రైవేటు బస్సు సౌకర్యం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు[మార్చు]

గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత ఉన్నాయి. వాణిజ్య బ్యాంకు గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. రోజువారీ మార్కెట్ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. ATM, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది.

అసెంబ్లీ పోలింగ్ స్టేషన్, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి.

గ్రంథాలయం గ్రామం నుండి 5 కి.మీ.లోపు దూరంలో ఉంది.

సమీకృత బాలల అభివృద్ధి పథకం, ఆటల మైదానం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

సినిమా హాలు, పబ్లిక్ రీడింగ్ రూం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

విద్యుత్తు[మార్చు]

గ్రామం లో APSPDCL ౩౩/11 KV విద్యుత్ ఉపకేంద్రం అందుబాటులో వుంది.

గృహావసరాల నిమిత్తం 24/7 గంటల విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజు 7 గంటల పాటు వ్యవసాయానికి, 10 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

గ్రామం లో ప్రతి వీధికి   LED విద్యుత్ దీపాలసౌకర్యం వుంది.

భూమి వినియోగం[మార్చు]

భూపతిపల్లిగ్రామంలో భూ వినియోగం కింది విధంగా ఉంది:


 • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 151 హెక్టార్లు
 • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 141 హెక్టార్లు


 • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 140 హెక్టార్లు
 • సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 386 హెక్టార్లు
 • నికరంగా విత్తిన భూమి: 1109 హెక్టార్లు
 • నీటి సౌకర్యం లేని భూమి: 1221 హెక్టార్లు
 • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 275 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు[మార్చు]

భూపతిపల్లిలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.


 • బావులు/బోరు బావులు: 275 హెక్టార్లు


ఉత్పత్తి[మార్చు]

భూపతిపల్లిలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు[మార్చు]

మిరప

ప్రత్తి

ఒరిగ

కొర్ర

జొన్న

శనగ

కంది

మొక్కజొన్న

రాగి

వరి

ప్రధాన దేవాలయాలు/ప్రదేశాలు[మార్చు]


 • శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానం


దస్త్రం:SREE VEERANJANEYA SWAMY.jpg
శ్రీ వీరాంజనేయస్వామి వారి దేవస్థానం
శ్రీ వీరాంజనేయస్వామి వారి ఆలయం లోని  మూల విరాట్
శ్రీ వీరాంజనేయస్వామి వారి మూల విరాట్

బొడ్డుచెర్ల గ్రామంలో శ్రీ వీరాంజనేయ స్వామి వెలయడం వెనక ఒక విశిష్ట సంఘటన జరిగినట్లు చెప్పబడుతుంది. సుమారు 400 సంవత్సరాల క్రితం పలనాటి బ్రహ్మనాయుడు మాచర్ల శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ని ప్రతిష్టించిన కాలంలోనే ఇక్కడ శ్రీ వీరాంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ట కూడా జరిగిందని పెద్దల అభిప్రాయం. అప్పట్లో ప్రస్తుత స్వామి వారి ఆలయానికి 2 కిలోమీటర్ల దూరంలో అన్నపురెడ్డివారిపాలెం అనే చిన్న గ్రామంలో అన్నపురెడ్డి ఇంటి పేరు గల కొన్ని కుటుంబాలు నివసిస్తుండేవి. వారికి తిమ్మాపురం, మల్యవంతునిపాడు,బొడ్డుచెర్ల,బొండలపాడు, భుపతిపల్లె,తిప్పాయపాలెం, సూరేపల్లి గ్రామ ప్రాంతాలలో పంట పొలాలు ఉండేవి. ఈ పొలాలు గుండ్లకమ్మ నది పరివాహక ప్రాంతంలో ఉండటం వలనను వర్షాలు సకాలంలో కురుస్తుండడం వలనను ఆ రోజుల్లో జొన్న పంట విస్తారం పండించేవారు. అందులో ఒక కుటుంబం వారు బొడ్డుచెర్ల గ్రామానికి ఉత్తరదిశగా ఉన్న తిమ్మాపురం గ్రామంలో జొన్నపైరు వేశారు. ఆ భూమి యజమాని ఆ పొలంలో ఒక మంచెను ఏర్పాటు చేసుకొని తన 10 సంవత్సరాల వయసు గల కూతురు తోడుగా పిట్టల కాపలా కాసేవాడు. ఒకరోజు తన కూతురు చేను మధ్యలోని కి వెళ్లడం గమనించక కూతురు కోసం పెద్దగా పిలుస్తూ చేను చుట్టూ తిరుగుతుండగా చేను మధ్య నుండి ఏవో మాటలు వినిపించాయి. ఆ మాటలను బట్టి అక్కడకు వెళ్లి తన కూతురు సుమారు ఒక అడుగు ఎత్తు గల ఆంజనేయస్వామి విగ్రహాన్ని చేతితో పట్టుకొని మాట్లాడుతుండడం గమనించాడు. ఆ విగ్రహానికి నమస్కరించి తన చేతిలోని తీసుకుంటుండగా విగ్రహము చాలా బరువుగా ఉండి ఎత్తు పెరుగుతుండటం ఆశ్చర్యంతో గమనించి కిందకు దించి గ్రామంలోనికి పరుగు పరుగున వెళ్లి గ్రామస్తులకు విషయాన్ని తెలియజేశాడు. గ్రామస్తులు గుంపులు గుంపులుగా వెళ్లి పెరుగుతున్న విగ్రహాన్ని చూసి ఆశ్చర్యచకితులయ్యారు. ఇంతలో ఆ బాలికను స్వామి ఆవేశించి " నా విగ్రహాన్ని మీ గ్రామంలో ప్రతిష్ఠించుకొనండి, మీకు మేలు జరుగుతుంది" అని ఆదేశించాడు. పరిసర గ్రామాల నుండి జనం తండోపతండాలుగా వచ్చి స్వామి వారిని రాతిగాండ్ల బండిపై ఎక్కించుకొని జయజయధ్వానాలతో తీసుకుని వస్తుండగా విగ్రహం 12 అడుగుల ఎత్తుకు పెరిగింది. ప్రస్తుతం స్వామి వారి ఆలయం ఉన్న చోటుకు వచ్చేసరికి రాతిగాండ్లు తిరగక ఎద్దులు బండిని లాగలేక పోయాయి. ఎంత ప్రయత్నించినను బండి ముందుకు సాగలేదు. అప్పుడు మరల స్వామివారు బాలికను ఆవేశించి " ఈ గుండ్లకమ్మ సమీప స్థలమే నేను వెలయుటకు అనువైనది. ఇక్కడనే నన్ను ప్రతిష్టించండి" అని ఆదేశించగా ఒక మంచి ముహూర్తం వేదమంత్రాలతో శాస్త్రయుక్తంగా విగ్రహ ప్రతిష్టగావించారు. అన్నపురెడ్డి వంశీయుడైన ఆసామి స్వామివారికి గుడి నిర్మింపజేసాడు. నాటి నుండి బొడ్డుచెర్ల వీరాంజనేయ స్వామి చుట్టుపక్కల గ్రామ ప్రజలకు ఆరాధ్యదైవంగా వెలుగొందుతున్నది.

కొంతకాలానికి కంభం చెరువు నిర్మాణ సమయంలో కర్ణాటక ప్రభువులు శ్రీ వీరాంజనేయ స్వామి వారి మహత్యమును తెలుసుకొని వచ్చి స్వామి వారిని దర్శించి శిధిలావస్థలో ఉన్న గుడికి 15×15×15 అడుగుల విస్తీర్ణంలో గర్భాలయాన్ని సర్వాంగ సుందరంగా నిర్మించారు.

ఆ తర్వాత ఒంగోలు, కనిగిరి, పొదిలి, తర్లుపాడు, ప్రాంతాలు నెల్లూరు వెంకటగిరి ఆస్థానం వారి ఏలుబడిలో నున్నప్పుడు స్వామివారిని దర్శించి గర్భాలయం ముందు భాగాన కర్రతో సుందరమైన మందిరాన్ని నిర్మించారు. ఆలయం చుట్టూ ప్రహరీగోడను కూడా ఏర్పాటు చేశారు. పల్నాటిరెడ్డి రాజులు మార్కాపురం శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దర్శనార్థం వచ్చినప్పుడు శ్రీ వీరాంజనేయ స్వామి వారి మహిమను గూర్చి తెలుసుకొని స్వామివారిని దర్శించి విలువైన కానుకలు సమర్పించారు.

బొడ్డుచెర్ల ప్రాంతంలో వరుసగా కొన్ని సంవత్సరాలు వర్షాలు పడక పంటలు పండలేదు. పశువులకు నీరు,మేత కరువైనాయి. ప్రజలు పనులు లేక పొట్ట చేత పట్టుకొని పలు ప్రాంతాలకు వలసదారిపట్టారు. అన్నపురెడ్డి వంశీయులు వారికి ఉన్న స్థిరాస్తులు 70 ఎకరాల పంట పొలాలను శ్రీ వీరాంజనేయ స్వామి వారి ఆలయ పోషణార్థం సమర్పించి ఊరు వదిలి వెళ్ళిపోయారు.

ప్రతి సంవత్సరం శ్రీ వీరాంజనేయ స్వామి వారి ఆలయంలో ఉగాది, శ్రీరామనవమి హనుమాన్జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి.ఈ సందర్భంగా జరిగే బండలాగుడు పందాలు చూడడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో వస్తారు.

శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా బండలాగుడు పోటీలు


శ్రీ చెన్న మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం[మార్చు]

శ్రీ భూదేవి తల్లి ఆశ్రమం[మార్చు]


గణాంకాలు[మార్చు]

 • 2011 జనాభ లెక్కల ప్రకారం
  జనాభా (2011) - మొత్తం 3,944
  పురుషుల సంఖ్య 2,051 - స్త్రీల సంఖ్య 1,893 - గృహాల సంఖ్య 985
  గ్రామ విస్తీర్ణం-1930 హెక్టార్లు
జనాభా వివరాలు
వివరనలు మొత్తం పురుషులు స్త్రీలు
గృహాల సంఖ్య 985
జనాభా 3,944 2,051 (52%) 1,893(48%)
చిన్న పిల్లలు (0-6) 466 252 214
లింగ నిష్పత్తి వివరాలు
వివరనలు మొత్తం జనరల్ షెడ్యూల్ కులాలు షెడ్యూల్డ్ తెగలు
లింగ నిష్పత్తి 923
919 923 1019
అక్షరాస్యత వివరాలు
వివరనలు మొత్తం పురుషులు స్త్రీలు
అక్షరాస్యత 63.92% 78.27% 48.54%
2,223 1,408 815
నిరక్ష్యరాస్యత 1,721 643 1,078
కులాల వివరాలు
వివరనలు మొత్తం పురుషులు స్త్రీలు
సాధరన కులాలు 2,664 1,388 1,276
షెడ్యూల్ కులాలు 1,173 (29.7%) 610 563
షెడ్యూల్డ్ తెగలు 107 (2.7%) 53 54


వృత్తుల వారీగా వివరాలు
వివరనలు మొత్తం పురుషులు స్త్రీలు
వ్యవసాయదారులు 494 281 213
వ్యవసాయ కూలీలు 1,307 686 621
సాధారణ కూలీలు 2,047
ఇతర పనుల కూలీలు 100

సమీప మండలాలు[మార్చు]

దక్షణాన తర్లుపాడు మండలం, ఉత్తరాన పెద్దారవీడు మండలం, పశ్చిమాన కంభం మండలం, తూర్పున దొనకొండ మండలం.

మూలాలు[మార్చు]

 1. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".

వెలుపలి లింకులు[మార్చు]

[2] ఈనాడు ప్రకాశం; 2015, ఆగస్టు-20; 7వపేజీ.