కొండ బిట్రగుంట

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొండ బిట్రగుంట
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
మండలం బోగోలు
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 524 101
ఎస్.టి.డి కోడ్ 08624

కొండ బిట్రగుంట, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, బోగోలు మండలానికి చెందిన గ్రామం.[1]. పిన్ కోడ్ నం. 524 101., ఎస్.టి.డి.కోడ్ = 08624.

మూలాలు[మార్చు]

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-09-11. Retrieved 2015-09-09.
  • ఇది బోగోలు మండలంలో తూర్పు వైపున బంగాళాఖాతం సరిహద్దులో ఉంది.కప్పరాళ్ళతిప్ప గ్రామం ఇక్కడికి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
  • ఈ గ్రామంలో సుప్రసిద్ధమైన పురాతన శ్రీప్రసన్న వెంకటేశ్వరస్వామి ఆలయం కొండమీద ఉంది. సుమారు 850 సంవత్సరాల క్రితం, చోళరాజులు ఈ ఆలయాన్ని నిర్మించారని చెప్పుకుంటారు. దీనిని "బిలకూటక్షేత్రం" అంటారు. ఇక్కడ దేవుడు కొండ మీద వెలసి ఉంటాడు. కొండ మీద వేంకటేశ్వర స్వామి ఆలయము, లక్ష్మీ దేవి ఆలయము ఉంది. వేంకటేశ్వర స్వామి ఆలయము ఎదురుగా ఆంజనేయ స్వామి ఆలయము ఉంది. ఆ ప్రాంగణములోనే కృష్ణుని ఆలయము, నవగ్రహాలు ఉన్నాయి. నారదమహర్షి కొండబిట్రగుంట బిలంలో తపస్సు చేసి విముక్తి పొందిన ప్రాంతంలో ప్రసన్న వేంకటేశ్వరస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారని ప్రతీతి. నారదమహర్షి ఆలయము కొండకి కొంచెం క్రింద భాగాన ఉంది. ఇక్కడ ప్రతి సంవత్సరము ఫాల్గుణ మాసంలో, స్వామివారి తిరునాళ్ళు, ఏడు రోజులపాటు వైభవంగా జరుగును. ఫాల్గుణ పౌర్ణమిరోజున స్వామివారి కళ్యాణం, తరువాత రథోత్సవం నిర్వహించెదరు. దాదాపు 4 లక్షల మంది జనం, ఈ తిరునాళ్ళను సందర్శిస్తారు.
  • ఈ దేవాలయానికి సమీపంలో శ్రీ షిర్డి శేషసాయి బాబా మందిరము ఉంది. ఈ మందిర వ్యవస్థాపకులు కుట్టుబోయిన బ్రహ్మానందం. ఇక్కడ ప్రతి గురువారము భజనలు, పల్లకి సేవ జరుగుతుంది.ప్రతి ఆదివారము అన్నదానకార్యక్రమము జరుగుతున్నది.
  • ఈ గుడి ప్రక్కన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉంది.
  • బిలకూటక్షేత్రంలో ఇకనుండి నిత్యాన్నదాన కార్యక్రమం నిర్వహించెదరు . కోరిన భక్తులు కనీసంగా రు.1116-00 చెల్లించి ఈ కార్య్క్రమంలో పాల్గొనవచ్చును. అన్నదానం జరిగిన రోజున గుడిలో దాత పేరుతో పూజలు నిర్వహించెదరు.

బయటి లింకులు[మార్చు]

[1] ఈనాడు నెల్లూరు; 2014, మార్చి-18; 5&16 పేజీలు.