Jump to content

కొంతమంది ఇంటిపేరు కాదుర గాంధీ

వికీపీడియా నుండి
"కొంతమంది ఇంటిపేరు కాదుర గాంధీ"
రచయితసిరివెన్నెల సీతారామశాస్త్రి
సాహిత్యంసిరివెన్నెల సీతారామశాస్త్రి
ప్రచురణ1982
రచింపబడిన ప్రాంతంఆంధ్ర ప్రదేశ్
భాషతెలుగు
రూపంభావగీతం

కొంతమంది సొంత పేరు కాదుర గాంధీ అనేది "మహాత్మా" సినిమా లో వచ్చిన పాట. దీనిని సిరివెన్నెల (చేంబోలు) సీతారామశాస్త్రి రచించగా, ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం గానం చేశారు.

ఇందిరాగాంధీ ఇంటిపేరు కాదుర గాంధీ అనేది ఈపాట ఒరిజినల్ పల్లవి; కాని సెన్సార్ కారణంగా పల్లవిని మార్చి ఇందిరాగాంధీ పదానికి బదులుగాకొంతమంది సొంత పేరు అని మార్చి రాశారు.

నేపథ్యం

[మార్చు]

మహాత్మాగాంధీ అంటే ఏమిటో కూడా తెలియని ఒక చదువు సంస్కారం లేని వీధి రౌడీకి, గాంధేయవాదాన్ని పరిచయం చేస్తూ అందులోని గొప్పదనాన్ని వివరించి చెప్పే సన్నివేశంలోని పాట ఇది. ఒక సాధారణ మనిషి, మనలాగే పుట్టి మనలాగే బ్రతికిన ఒక సామాన్య మనిషిని మనం ఎందుకు ఇంతలా పూజిస్తామో, కరెన్సీ నోటు మీద ముద్ర వేసి, వీధి వీధికో బొమ్మ పెట్టి, ప్రతి ఊరిలోనూ ఒక వీధికి మహాత్ముని పేరు పెట్టి ఎందుకు ఆరాధిస్తామో చెబుతూనే, గాంధీ అంటే మన ప్రతి అడుగులోనూ కనిపించే ఆ బొమ్మ మాత్రమే కాదు, అదొక మతం అంటూ చెప్పకనే చెప్పారు. రెండు వందల సంవత్సరాలకు పైగా అనుభవించిన నరక యాతనని తీర్చి, భరత మాత తలరాతని మార్చేసిన విధాత గాంధీ అని వివరిస్తాడు.

పాటలోని సాహిత్యం

[మార్చు]

రఘుపతి రాఘవ రాజారాం పతిత పావత సీతారం
ఈశ్వర అల్లా తేరేనాం సబ్‌కో సన్మతి దే భగవాన్

పల్లవి:
కొంతమంది సొంంతపేరు కాదుర గాంధీ..
ఊరికొక్క వీధి పేరు కాదుర గాంధీ... ”కొంతమంది సొంంతపేరు కాదుర గాంధీ.”
ఊరికొక్క వీధి పేరు కాదుర గాంధీ...
  
అనుపల్లవి:
కరెన్సీ నోటు మీద ఇలా నడి రోడ్డు మీద మనం చూస్తున్న బొమ్మ కాదుర గాంధీ..
భరత మాత తలరాతను మార్చిన విధాతరా గాంధీ..
తరతరాల యమ యాతన తీర్చిన వరదాతర గాంధీ...
        “కొంతమంది సొంంతపేరు కాదుర గాంధీ.”

చరణం1:
రామ నామమే తలపంతా ప్రేమ ధామమే మనసంతా..
ఆశ్రమ దీక్ష స్వతంత్ర్య కాంక్ష ఆకృతి దాల్చిన అవధూతా.
అపురూపం ఆ చరితా..ఓ..
ధర్మ యోగమే జన్మంతా ధర్మ క్షేత్రమే బ్రతుకంతా..
సంభవామి అని ప్రకటించిన అలనాటి కృష్ణ భగవద్గీత.. ఈ బోసినోటి తాతా..
మనలాగే ఓ తల్లి కన్న మామూలు మనిషి కదరా గాంధీ..
మహాత్ముడంటూ మన్నన పొందే స్థాయికి పెంచద ఆయన స్ఫూర్తీ..
సత్యాహింసల మార్గ జ్యోతీ నవ శకానికే నాందీ... “రఘుపతి..”

చరణం2:
గుప్పెడు ఉప్పును పోగేసి నిప్పుల ఉప్పెనగా చేసి
దండి యాత్రనే దండ యాత్రగా ముందుకు నడిపిన అధినేతా..
సిసలైన జగజ్జేతా..
చరఖా యంత్రం చూపించి స్వదేశి సూత్రం నేర్పించీ..
నూలు పోగుతో మదపుటేనుగుల బంధించాడుర జాతిపితా
సంకల్పబలం చేతా..
సూర్యుడస్తమించని రాజ్యానికి పడమర దారిని చూపిన క్రాంతీ..
తూరుపు తెల్లారని నడిరాత్రికి స్వేఛ్చా భానుడి ప్రభాత కాంతీ..
పదవులు కోరని పావన మూర్తీ..
హృదయాలేలిన చక్రవర్తీ...
ఇలాంటి నరుడొక ఇలాతలంపై నడయాడిన ఈ నాటి సంగతీ..
నమ్మరానిదని నమ్మకముందే ముందు తరాలకు చెప్పండీ..
సర్వ జన హితం నా మతం. అంటరాని తనాన్ని అంతః కలహాలని అంతం చేసేందుకే నా ఆయువంతా అంకితం...

పురస్కారాలు

[మార్చు]