కొడుకు పుట్టాల (నాటిక)

వికీపీడియా నుండి
(కొడుకు పుట్టాల నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
కొడుకు పుట్టాల
Koduku Puttala Playlet Book Cover Page.png
కొడుకు పుట్టాల పుస్తక ముఖచిత్రం
కృతికర్త: గణేష్ పాత్రో
దేశం: భారతదేశం
భాష: తెలుగు
ప్రక్రియ: నాటిక
ప్రచురణ: అరుణా పబ్లిషింగ్ హౌజ్, ఏలూరు రోడ్డు, విజయవాడ
విడుదల:


కొడుకు పుట్టాల 1970లో గణేష్ పాత్రో రాసిన సాంఘీక నాటిక.[1] పద్నాలుగు భారతీయ భాషల్లోకి అనువాదమై ఆకాశవాణి, దూరదర్శన్ లలో ప్రసారమైన ఈ నాటికతో గణేష్ పాత్రోకు భారతదేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది.[2] తెలుగు నాటకరంగంలో ఒక మలుపు తెచ్చిన నాటికగా పేర్కొనబడి, నటుడు ప్రభాకరరెడ్డి నిర్మాతగా, లక్ష్మీదీపక్‌ దర్శకుడిగా, కృష్ణంరాజు హీరోగా నాకూ స్వతంత్రం వచ్చింది పేరుతో సినిమా కూడా రూపొందించబడింది.[3]

కథా నేపథ్యం[మార్చు]

కుటుంబ నియంత్రణ ఆవశ్యకత నేపథ్యంలో రాయబడిన నాటిక.

పాత్రలు[మార్చు]

 • గంగులు (ఇంటి పెద్ద, జబ్బు మనిషి)
 • కొర్లమ్మ (గంగులు కూతురు)
 • సిమ్మాద్రి (కొర్లమ్మ భర్త)
 • పకీరుగాడు (గంగులు కొడుకు)
 • శరభయ్య తాత (పొరుగువాడు, వృద్ధుడు, ఏకాకి)

ఇతర వివరాలు[మార్చు]

 1. ఈ నాటిక ఆంధ్రజ్యోతి నాటిక రచన పోటీలో ద్వితీయ బహుమతి గెలుచుకుంది.[4][5]
 2. భీమునిపట్నం సముద్రానికి, పోర్టు బంగళాకు, బెస్తలకు, అస్వస్థులకు ఈ నాటకం అంకితం చేయబడింది.
 3. కుప్పిలి వెంకటేశ్వరరావు దర్శకత్వంలో ఈ నాటిక తొలి ప్రదర్శనతోపాటు అనేక ప్రదర్శనలు జరుపుకుంది. ఇదే నాటక ప్రదర్శన రోజు గుండెపోటుతో మరణించాడు.[6]
 4. జి.ఎస్.ఆర్. మూర్తి, రాజేశ్వరరావు బృందాలు విరివిగా ప్రదర్శించాయి.
 5. ఈ నాటిక ప్రదర్శన చూసిన గుమ్మడి వెంకటేశ్వరరావు గణేష్ పాత్రోను సినిమారంగంకు పరిచయం చేయగా, రాజబాబు పుట్టినరోజు నాటిక ప్రదర్శించినపుడు ప్రభాకర్ రెడ్డి మొదటి అవకాశం ఇచ్చాడు.[7]
 6. విశాఖపట్టణంకి చెందిన బహురూప నటసమాఖ్య సంస్థ నుండి కుప్పిలి వెంకటేశ్వరరావు దర్శకత్వంలో ఎస్.కె. మిశ్రో/కుప్పిలి వెంకటేశ్వరరావు (గంగులు), పి. కృష్ణచైతన్య/కె.విఎస్.డి. ప్రసాద్ (పకీరు), వి.ఎస్.ఎన్. మూర్తి/జి. జగన్నాధరావు (సిమ్మాద్రి), కుప్పిలి వెంకటేశ్వరరావు/గణేష్ పాత్రో (శరభయ్య), కె. విజయలక్ష్మి (కొర్లమ్మ) నటీనటులుగా ఈ నాటిక ప్రదర్శనలు ఇచ్చారు.

మాలాలు[మార్చు]

 1. సాక్షి, ఫీచర్స్ (6 January 2015). "మాటల వంతెనపై నడచి వెళ్లినవాడు". రామతీర్థ. మూలం నుండి 16 డిసెంబర్ 2015 న ఆర్కైవు చేసారు. Retrieved 28 February 2020. Cite news requires |newspaper= (help)
 2. ప్రజాశక్తి, మూవీ (21 June 2015). "మాటల సవ్యసాచి". మూలం నుండి 25 జూన్ 2015 న ఆర్కైవు చేసారు. Retrieved 28 February 2020. Cite news requires |newspaper= (help)
 3. తెలుగు వెలుగు, వెండితెర వెన్నెల. "భాషలేనిది... బంధమున్నది". www.teluguvelugu.in. ఓలేటి శ్రీనివాసభాను. మూలం నుండి 28 ఫిబ్రవరి 2020 న ఆర్కైవు చేసారు. Retrieved 28 February 2020.
 4. ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (6 January 2015). "'పాత్రో'చిత సంభాషణల స్రష్ట!". www.andhrajyothy.com. ఎస్‌.కె. మిశ్రో. మూలం నుండి 28 ఫిబ్రవరి 2020 న ఆర్కైవు చేసారు. Retrieved 28 February 2020.
 5. కొడుకు పుట్టాల (నాటిక), గణేష్ పాత్రో, అరుణా పబ్లిషింగ్ హౌజ్ విజయవాడ, పుట. 6
 6. కొడుకు పుట్టాల (నాటిక), గణేష్ పాత్రో, అరుణా పబ్లిషింగ్ హౌజ్ విజయవాడ, పుట. 7
 7. కొడుకు పుట్టాల (నాటిక), గణేష్ పాత్రో, అరుణా పబ్లిషింగ్ హౌజ్ విజయవాడ, పుట. 10