కొత్తూరు (మాచర్ల)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొత్తూరు
—  గ్రామం  —
కొత్తూరు is located in Andhra Pradesh
కొత్తూరు
కొత్తూరు
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 16°29′N 79°26′E / 16.48°N 79.43°E / 16.48; 79.43
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం మాచర్ల
ప్రభుత్వము
 - సర్పంచి శ్రీమతి బోయ వెంకటరావమ్మ
పిన్ కోడ్ 522 426
ఎస్.టి.డి కోడ్ 08642

కొత్తూరు గుంటూరు జిల్లా, మాచర్ల మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 522 426., ఎస్.ట్.డి.కోడ్ = 08642.

గ్రామములో మౌలిక వసతులు[మార్చు]

అంగనవాడీ కేంద్రం.

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

  1. మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల.
  2. మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల.

ముంబాయి నగరానికి చెందిన తదేకం ఫౌండేషను వారు,2 నెలల క్రితం ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ఈ రెండు పాఠశాలల్లోనూ మౌలిక సదుపాయాల రూపకల్పనకు శ్రీకారం చుట్టినారు. వీరు రు. 60,000 విలువచేసే 20 బల్లలను అందజేసినారు. ఈ రెండు పాఠశాలలోనూ ఇద్దరు ఆంగ్ల ఉపాధ్యాయులను నియమించి, రక్షిత మంచినీటి పథకం ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు.

గ్రామ పంచాయతీ[మార్చు]

2013 లో, ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీమతి బోయ వెంకటరావమ్మ, సర్పంచిగా ఎన్నికైనారు.

గ్రామ విశేషాలు[మార్చు]

ఈ గ్రామాన్ని ఆకర్షణీయ గ్రామం (స్మార్ట్ విలేజ్) గా అభివృద్ధిచేయటానికై, ఈ గ్రామాన్ని తదేకం ఫౌండేషన్ దత్తత తీసుకొని పనులను ప్రారంభించారు. ముంబాయికి చెందిన తదేకం ఫౌండేషన్ వ్యవస్థాపకులు, శ్రీ మహా అవతార్ బాబాజీ నౌషర్ ఇంజనీర్, ఈ గ్రామాన్ని మ్యాప్ ద్వారా ఎంచుకున్నారు.