కొత్త కోటేశ్వరరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


K. Koteswara Rao

జననం (1929-10-19)1929 అక్టోబరు 19
Sangam jagarlamudi, Tenali
మరణం2021 సెప్టెంబరు 29(2021-09-29) (వయసు 91)
Visakhapatnam

కొత్త కోటేశ్వరరావు (1929, అక్టోబరు 19 - 2021, సెప్టెంబరు 29)[1] 1973-1989 కాలంలో వరంగల్ ప్రాంతీయ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్‌గా ఉన్నారు. ఇప్పుడు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వరంగల్‌గా పేరు మార్చబడింది.

జననం

[మార్చు]

కోటేశ్వరరావు 1929, అక్టోబరు 19న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తెనాలి సమీపంలోని సంగం జాగర్లమూడి గ్రామంలో జన్మించాడు. 1951లో మద్రాసులోని గిండిలోని కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ నుండి సివిల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ పొందాడు.

వృత్తిరంగం

[మార్చు]

1955లో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అధ్యాపకుడిగా చేరాడు. యూనివర్సిటీ ఆఫ్ అయోవాలో హైడ్రాలిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీని అభ్యసించాడు. డాక్టర్ హంటర్ రూస్‌తో కలిసి పనిచేశాడు. 1966లో యూనివర్సిటీ ఆఫ్ అయోవా నుండి డాక్టరల్ డిగ్రీని కూడా పొందాడు.

ప్రాంతీయ ఇంజినీరింగ్ కళాశాల వరంగల్ ప్రిన్సిపాల్‌గా నియమితుడయ్యాడు. రాడికల్ ఉద్యమం ద్వారా ప్రేరేపించబడిన గందరగోళ స్థితి నుండి సంస్థను తిరిగి అకడమిక్ ట్రాక్‌లో ఉంచాడు. ఈ కళాశాలను దేశంలోని ప్రధాన సంస్థల్లో ఒకటిగా చేయడంలో ఆయన కీలకపాత్ర పోషించాడు.[2]

గ్రాడ్యుయేట్ ప్రవేశానికి జాతీయ నియంత్రణ పరీక్ష, గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్) కోసం రూపొందించిన కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలో సభ్యునిగా ఆయన నియమితులయ్యాడు.


మూలాలు

[మార్చు]
  1. "Prof. Koteswara Rao Kotha". Retrieved 2022-02-21.
  2. "NITW alumni Association". Archived from the original on 19 January 2011. Retrieved 29 September 2011.