Jump to content

కొమాండూరి రామకృష్ణమాచార్యులు

వికీపీడియా నుండి

కొమాండూరి రామకృష్ణమాచార్యులు సంస్కృతాంధ్ర పండితులు, రచయిత, లిపి శాస్త్రవేత్త, శాసన పరిశోధకులు.

వీరు నెల్లూరు సమీపంలోని గంగవరంలో జన్మించారు. వీరు నెల్లూరులోని వెంకటగిరి మహారాజాగారి ఉన్నత పాఠశాలలో మెట్రిక్యులేషన్ చదివారు. తరువాత చెన్నైలోని క్రైస్తవ కళాశాలలో చేరి ఎఫ్.ఏ. పరీక్షలో ఉత్తీర్ణులై, పిదప పచ్చయప్ప కళాశాలలో చదివి బి.ఏ. పట్టా పొందారు.

వీరు నెల్లూరులో కొంతకాలం ఉపాధ్యాయునిగా పనిచేసి తర్వాత కలెక్టరు కార్యాలయంలో పనిచేసి, పిదప ప్రభుత్వ పురాతత్వ శాఖకు సంబంధించిన శాసనశాఖలో చేరి ప్రాచీన లిపులలో ఉన్న శాసనాలను చదవటంలో నిష్ణాతులయ్యారు. ఆ శాఖలో వీరు సూపరింటెండెంట్ పదవిని అలంకరించి చివరకు అఖిల భారత శాసన పరిశోధన శాఖకు అధిపతిగా నియమితులయ్యారు. వీరి అమూల్యమైన పరిశోధనలకు మెచ్చి ప్రభుత్వంవారు వీరికి "రావు బహద్దూర్" గౌరవం ఇచ్చారు.