కొమాండూరి సాకేత్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కొమాండూరి సాకేత్ గాయకుడు, సంగీత దర్శకుడు.[1]

జీవిత విశేషాలు[మార్చు]

అతను ప్రముఖ సంగీత అధ్యాపకుడు, గాయకుడు, మరియు సంగీత దర్శకుడు కోమండూరి రామాచారి, సుజాత దంపతులకు జన్మించాడు.[2] సంగీత కుటుంబ నేపధ్యం ఉన్నందున చిన్నప్పటి నుంచీ పాటలు, సంగీతమంటే ఎక్కువగా ఇష్టపడేవాడు. రెండో తరగతిలోనే మొదటి కచేరీ చేశాడు. ఓరుగంటి లీలావతిగారు అతని తొలి గురువు. ఆ తర్వాత నీతా చంద్రశేఖర్‌, మోహనకృష్ణగారి దగ్గర కర్ణాటక క్లాసికల్‌ నేర్చుకున్నాడు. డా.వైజర్సు బాల సుబ్రహ్మణ్యం గారు ప్రస్తుతం అతని గురువు. రాయల్‌ స్కూల్‌ ఆఫ్‌ లండన్‌, బెంజిమన్‌ మార్తండ్‌, థామస్‌గారి దగ్గర పియానో 5 గ్రేడ్స్‌ చేశాడు. వెస్ట్రన్‌ వోకల్స్‌లో త్రీగేడ్స్‌, ఆడియో ఇంజనీరింగ్‌, మాస్టరింగ్‌ ఆశీర్వద్‌ లూక్‌ దగ్గర నేర్చుకున్నాడు. లలిత సంగీతాన్ని తన తండ్రి వద్ద నేర్చుకున్నాడు. తన తండ్రి స్థాపించిన లిటిల్‌ మ్యుజీషియన్స్‌ అకాడమీలో అతనికి ప్రత్యేకంగా బోధించేవారు కాదు. అందరితో సమానంగానే చూసేవారు.[3] వృత్తిరీత్యా రామాచారి బిజీగా ఉండటం వల్ల ఎక్కడ సంగీత పోటీలు ఉన్నా అతనిని తన తల్లి తీసుకొనిపోయేది. ‘పాడాలనివుంది’, ‘సప్తస్వరాలు’ వంటి ఎన్నో పోటీల్లో పాల్గొన్నాడు. ‘సూపర్‌సింగర్స్‌ 8’కు మెంటర్‌గా వ్యవహరించాడు. ‘సూపర్‌సింగర్స్‌ జూనియర్స్‌’, ‘కలర్స్‌ ఆప్‌ మ్యూజిక్‌’ కార్యక్రమాలకు హోస్ట్‌గా చేశాడు.

చిన్నతనంలో ఆర్‌.పి పట్నాయక్‌, మణిశర్మ గార్ల దగ్గర కోరస్‌తో తన సంగీత జీవితాన్ని ప్రారంభించాడు. పెద్దయ్యాక కీరవాణి గారి సంగీత బృందంలో చేరాడు. బద్రీనాథ్‌ నుంచీ బాహుబలి వరకూ అతని దగ్గర పాడుతూనే ఉన్నాడు. పూర్తిస్థాయి ప్లేబ్యాక్‌ సింగర్‌గా మారాక అతనికి అవకాశమిచ్చింది సాయికార్తీక్‌గారు. మొత్తం మీద 30 సినిమాల్లో పాడాడు. ఫైనల్‌ మిక్సింగ్‌ అండ్‌ మాస్టరింగ్‌ కూడా చేశాడు. కీరవాణి, తమన్‌, సాయికార్తీక్‌, గోపీసుందర్‌ వంటి సంగీత దర్శకుల దగ్గర రెగ్యులర్‌గా పాడుతున్నాడు. కార్తీక్‌ కొడకండ్ల సంగీతం అందించిన బంధూక్‌ చిత్రంలో అతను పాడిన ‘పూసిన పున్నమివెన్నెలమేన తెలంగాణ వీణా’ పాట అతనికెంతో గుర్తింపు తీసుకొచ్చింది.[4]

మూలాలు[మార్చు]

  1. "నాన్న చెబుతానంటే... నేను వద్దంటుంటా!". Cite web requires |website= (help)
  2. "Saketh and Sony's unshakable bond". Cite web requires |website= (help)
  3. "నేను కొత్తగా తెచ్చే పేరేమీ లేదు". Cite web requires |website= (help)
  4. "సంస్కా‌రం నేర్పే సంగీత బ‌డి". Cite web requires |website= (help)

బయటి లంకెలు[మార్చు]