కొరియాలో హిందూమతం
కొరియాలో హిందూ మతం మైనారిటీ మతం. దక్షిణ కొరియాలో 24,414 మంది భారతీయులు ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది హిందువులు. బౌద్ధమతం ద్వారా, ఇది సాంప్రదాయ కొరియన్ ఆలోచనలోని కొన్ని అంశాలపై పరోక్ష ప్రభావాన్ని కలిగించింది. కొరియన్ బౌద్ధ దేవాలయాలలో ఉండే నాలుగు హెవెన్లీ కింగ్స్ లోకపాలకుల నుండి ఉద్భవించినవే.
ఉత్తర కొరియా
[మార్చు]ఉత్తర కొరియాలో 586 మంది భారతీయులు (వారిలో ఎక్కువ మంది ఎంబసీ ఉద్యోగులు) ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది హిందువులు. [1]
దక్షిణ కొరియా
[మార్చు]సియోల్ ప్రాంతంలో శ్రీ రాధా శ్యామసుందర్ మందిర్, శ్రీ శ్రీ రాధా కృష్ణ దేవాలయం వంటి అనేక హిందూ దేవాలయాలు ఉన్నాయి, ఇవి సియోల్ శివార్లలో, సిటీ సెంటర్ నుండి సుమారు 2 గంటల దూరంలో ఉన్నాయి. దక్షిణ కొరియాలో భారతదేశం, నేపాల్ వంటి దేశాల నుండి విద్యార్థులు ఇంజనీర్‌లతో సహా తక్కువ సంఖ్యలో ప్రవాసులు నివసిస్తున్నారు. వీరిలో చాలా మంది హిందువులు. ఇటీవలి సంవత్సరాలలో యోగా కూడా బాగా ప్రాచుర్యం పొందింది.
శ్రీ రాధా శ్యామసుందర్ మందిర్ [2] ప్రతిరోజూ ఉదయ, సాయంత్రాల్లో నిర్దిష్ట సమయాల్లో తెరిచి ఉంటుంది. ఈ ఆలయంలో పిల్లల తరగతులు, మతపరమైన కోర్సులు, పండుగలు, వేడుకలు, వివాహాలు జరుగుతాయి. అలాగే శాకాహారులకు కిరాణా సామాగ్రి వంటి అనేక సేవలను ఎక్కువగా ప్రవాస హిందూ సమాజానికి అందిస్తుంది.
దక్షిణ కొరియా ఎక్కువగా లౌకిక రాజ్యం అయినప్పటికీ, అక్కడున్న మత విశ్వాసాల పరిధి చాలా విస్తృతమైనది. కొరియన్ షమానిజం హిందూ మతంతో కొన్ని సారూప్యతలను పంచుకున్నప్పటికీ, చాలా మంది ప్రజలు బౌద్ధమతం లేదా క్రైస్తవ మతానికి కట్టుబడి ఉంటారు. అక్కడ బలమైన కన్ఫ్యూషియన్ ఉనికి ఉంది.
దక్షిణ కొరియాలోని హిందూ దేవాలయాల జాబితా
[మార్చు]- శ్రీ రాధా శ్యామసుందర్ మందిర్, సియోల్
- సియోల్ శివార్లలో 20 కి.మీ దూరంలో ఉయిజియోంగ్బులో ఉన్న ఇస్కాన్ వారి శ్రీ శ్రీ రాధా కృష్ణ దేవాలయం
- శ్రీ లక్ష్మీ నారాయణన్ టెంపుల్, మెట్రోపాలిటన్ సియోల్
- హిమాలయన్ ధ్యాన, యోగా సాధన మందిర్, సియోల్‌లోని సియోచోలో
మూలాలు
[మార్చు]- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2019-05-01. Retrieved 2021-11-24.
- ↑ "First Indian Temple Opens in Seoul". koreatimes (in ఇంగ్లీష్). 2008-09-09. Retrieved 2021-05-20.