కొర్రపాటి పట్టాభిరామయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కొరపాటి పట్టాభిరామయ్య, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కమ్యూనిస్టు నాయకుడు. ఆంధ్ర ప్రదేశ్ మాజీ శాసనసభా సభ్యుడు. 70వ దశకములో ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ప్రకటించాలని కోరుతూ తన 65 సంవత్సరాల వయసులో నిరాహారదీక్ష చేశారు. తెలుగు రాష్ర్టాల నుంచి ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడిన మొదటి వ్యక్తి ఈయనే. పట్టాభి రామయ్యది ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా కపిలేశ్వరపురం.

జీవిత విశేషాలు[మార్చు]

పట్టాభి రామయ్య ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు ముందు మద్రాస్ రాష్ట్ర అసెంబ్లీలో రెండుసార్లు ‘కమ్యూనిస్ట్ పార్టీ’ కి ప్రాతినిధ్యం వహించాడు. 1954 లో పార్టీకి రాజీనామా చేసి సోషలిస్టు పార్టీ నిర్వహిస్తున్న నవశక్తి వార్తాపత్రికకు సంపాదకుడిగా పనిచేశాడు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి మద్దతుగా ఉపవాసం ఉన్న ఏకైక ఆంధ్ర నాయకుడు ఆయన.

ప్రత్యేక తెలంగాణ పోరాటం[మార్చు]

తూర్పు గోదావరి జిల్లా ఎమ్మెల్యే అయిన కొరపాటి పట్టాభి రామయ్య ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని కోరుతూ 1969 మార్చి 4న రాష్ట్ర అసెంబ్లీ ముందు నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించాడు. ఇదే సందర్భంలో సికింద్రాబాద్ నుంచి ప్రారంభమైన ఊరేగింపుకు సర్దార్ గౌతులచ్చన్న నాయకత్వం వహించి ఉద్యకారులకు బాసటగా నిలిచాడు.[1]

ఆత్మహత్యాయత్నం కేసులో మార్చి 12 న పట్టాభిరామయ్యను అరెస్టు చేసి ఉస్మానియా ఆసుపత్రిలో చేర్చారు. 1939 మార్చి 16 న నిరాహార దీక్ష ఉపసంహరించుకోవలసి వచ్చింది.

తన నిరాహార దీక్ష ప్రారంభించే ముందు, ‘ఎందుకు తెలంగాణ రాష్ట్రం’ అనే బ్రోచర్‌ను ముద్రించి ప్రచురించాడు. దీనిలో అతను రాష్ట్రంలోని ఆంధ్ర నాయకుల పాలనను బ్రిటిషర్లు, నిజాంల సామ్రాజ్యవాద పాలనతో పోల్చాడు. అతను ఆంధ్ర నాయకులను దుర్యోధనుని అనుచరులుగా పేర్కొన్నాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడవలసిన అవసరాన్ని కూడా వివరించాడు.[2]

మూలాలు[మార్చు]

  1. "'అన్నదమ్ముల్లా విడిపోదాం.. ఆత్మీయుల్లా కలిసుందాం'". గుండె చప్పుడు... 2010-08-31. Retrieved 2020-06-16.
  2. Reddy, AuthorDeepika. "1969 agitation: Eegalapenta incident". Telangana Today (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-06-16.