Jump to content

కొలనుపాక మ్యూజియం

వికీపీడియా నుండి
కొలనుపాక మ్యూజియం
ప్రదేశంకొలనుపాక, ఆలేరు మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా, తెలంగాణ, భారతదేశం
రకంమ్యూజియం
సందర్శకులుప్రజా

కొలనుపాక మ్యూజియం తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి భువనగిరి జిల్లా, ఆలేరు మండలం, కొలనుపాక గ్రామంలో ఉన్న మ్యూజియం.[1] కొలనుపాక గ్రామం 11వ శతాబ్దంలో కళ్యాణి చాళుక్యులకు రెండవ రాజధానిగా, జైనుల గొప్ప మత కేంద్రంగా, దక్షిణ భారతదేశంలోని జైన కేంద్రాలలో ఒకటిగా నిలిచింది. తరువాత ఈ పట్టణం చోళుల అధీనంలోకి, తరువాత కాకతీయుల అధీనంలోకి వెళ్ళింది. అంతటి ఘన చరిత్ర కలిగిన కొలనుపాకలోని జైన దేవాలయానికి సమీపంలోని సోమేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణాన్ని, ప్రాకార మండపాలను పురావస్తుశాఖ ఆధ్వర్యంలో మ్యూజియంగా ఏర్పాటుచేయబడింది.[2]

చరిత్ర

[మార్చు]

కొలనుపాక గ్రామంలో 1.5 మీటర్ల ఎత్తైన మహావీరుని విగ్రహంతో 2000 సంవత్సరాల పురాతన జైన దేవాలయం ఉంది. ఆ కాలానికి చెందిన స్మారక రాళ్ళు, హిందూ జైన మతాలకు సంబంధించిన విగ్రహాలు, ఇతర వస్తువులను భద్రపరచడానికి ఇక్కడ ఒక మ్యూజియంను ఏర్పాటుచేశారు. భారతదేశంలోని అద్భుతమైన మ్యూజియంలలో ఒకటిగా గుర్తింపు పొందిన ఈ మ్యూజియంలో ప్రాచీన సంస్కృతి, వారసత్వానికి సంబంధించినవి అందుబాటులో ఉన్నాయి.[3]

సేకరణలు

[మార్చు]

సామాన్యశకం 6 నుండి 16 వ శతాబ్దం వరకు ఉన్న మహావీరుడు, మత్స్యవల్లభ, చాముండి, నంది వంటి ముఖ్యమైన శిల్పాలు ఇందులో ఉన్నాయి. కొలనుపాకలోని వివిధ చారిత్రక కట్టడాల నుండి సేకరించిన కళాఖండాలను ప్రదర్శించడానికి శిల్పకళా గ్యాలరీ కూడా ఉంది. అలాగే చాళుక్య, కాకతీయ శైలులకు సంబంధించిన కళాఖండాలు, 100కు పైగా చిత్రాలు మ్యూజియంలో ప్రదర్శించబడ్డాయి. శిల్పం, కాలిగ్రఫీ రంగంలో పరిశోధన చేస్తున్నవారు చాళుక్య, కాకతీయ కాలాలను పాలనకాలం గురించి పరిశోధన చేయడానికి ఈ మ్యూజియం ఉపయోగపడుతుంది.[4] 2002లో దేవాలయం ఆవరణలో 15 లేదా 16 వ శతాబ్దాలకు చెందిన మత్స్య వల్లభుడి (ఆంజనేయ కుమారుడు) ఐదు అడుగుల విగ్రహం కనుగొనబడింది. మ్యూజియం సందర్శకులకు ఆ విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది.[5]

ముఖ్యమైనవి

[మార్చు]
  1. త్రిభువనమల్ల విజయ స్తంభ శాసనం (1076-1127)
  2. చాళుక్య కాలపు గణపతి విగ్రహం (12వ శతాబ్దం)
  3. చాళుక్య కాలపు నటరాజ విగ్రహం (12వ శతాబ్దం)
  4. కళ్యాణి చాళుక్య కాలపు వైరల్ విగ్రహం (12వ శతాబ్దం)
  5. కళ్యాణి చాళుక్య కాలపు మహిషాసురమర్దని విగ్రహం (12వ శతాబ్దం)
  6. కళ్యాణి చాళుక్య కాలానికి చెందిన ఉమామహేశ్వరంతో కోస్తపంజర (12వ శతాబ్దం)
  7. కాకతీయ కాలపు చాముండి విగ్రహం (13వ శతాబ్దం)
  8. కాకతీయ కాలపు గోవింద విగ్రహం (13వ శతాబ్దం)
  9. విజయనగర కాలపు కోదండరామ విగ్రహం (12వ శతాబ్దం)
  10. కాకతీయ కాలపు నంది విగ్రహం (13వ శతాబ్దం)
  11. చాళుక్య కాలపు యోగ భంగిమలో మహావీర్ విగ్రహం (13వ శతాబ్దం)
  12. కాకతీయ కాలంపు వజ్రపాణి విగ్రహం (13వ శతాబ్దం)

సందర్శన వివరాలు

[మార్చు]

ప్రతిరోజూ ఉదయం 10:30 నుండి సాయంత్రం 5:00 వరకు సందర్శనకు అనుమతి ఉంటుంది. శుక్రవారం, పబ్లిక్ హాలిడేస్‌లో మ్యూజియం మూసివేయబడుతుంది.[6]

మాలాలు

[మార్చు]
  1. Department of Heritage Telangana, Museums. "District Museum Kolanupaka". www.heritage.telangana.gov.in. Archived from the original on 8 March 2021. Retrieved 18 September 2021.
  2. Department of Heritage Telangana, Monuments. "Someswara group of temples". www.heritage.telangana.gov.in. Archived from the original on 18 September 2021. Retrieved 18 September 2021.
  3. Reddy, T. Karnakar (2015-11-27). "History lies scattered at Kolanupaka". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2021-09-18.
  4. Reddy, T. Karnakar (2016-05-15). "Kolanupaka to be part of tourism circuit". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2021-09-18.
  5. Reporter, Staff (2015-01-17). "Rare idol of Matysa Vallabha an attraction at Kolanupaka". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2021-09-18.
  6. "District Museum, Kolanupaka". map.sahapedia.org (in ఇంగ్లీష్). Retrieved 2021-09-18.