Jump to content

కొల్లం-తిరువంతపురం ప్రధాన రైలు మార్గం

వికీపీడియా నుండి
(కొల్లం-తిరువంతపురం ప్రధాన రైలు మార్గము నుండి దారిమార్పు చెందింది)
కొల్లం-తిరువంతపురం ప్రధాన రైలు మార్గము
కొల్లం జంక్షన్లో రైలు పట్టాలు
అవలోకనం
రకము (పద్ధతి)అంతర్నగర రైలు మార్గం
వ్యవస్థవిద్యుదీకరించబడింది
స్థితిపనిచేస్తోంది
లొకేల్కేరళ
చివరిస్థానంకొల్లం జంక్షను
తిరువనంతపురం సెంట్రల్
స్టేషన్లు18
సేవలు1 (కొల్లం - తిరువనంతపురం)
ఆపరేషన్
ప్రారంభోత్సవం4 జనవరి 1918; 106 సంవత్సరాల క్రితం (1918-01-04)
యజమానిదక్షిణ రైల్వే
నిర్వాహకులుతిరువనంతపురం రైల్వే డివిజను
పాత్రAt–grade
డిపో (లు)కొల్లం మేము షెడ్
రోలింగ్ స్టాక్WAP-1, WAP-4 electric locos; WAP-7 WDS-6, WDM-2, WDM-3A, WDP-4 and WDG-3A, WDG-4
సాంకేతికం
లైన్ పొడవు65 కిలోమీటర్లు (40 మై.)
ట్రాక్ గేజ్1,676 mm (5 ft 6 in)
ఆపరేటింగ్ వేగం110 kilometres per hour (68 mph)
మార్గ పటం
మూస:Kollam Junction–Thiruvananthapuram Central trunk line

కొల్లం-తిరువనంతపురం ట్రంక్ లైన్ కేరళ లోని కొల్లం, తిరువనంతపురం నగరాలను కలుపే దక్షిణ రైల్వే జోన్‌లోని రైలు మార్గం. మీటర్ గేజ్ యుగంలో మద్రాస్-క్విలాన్ లైన్ పొడిగింపుగా ఈ లైను 1918 జనవరి 4 న మొదలైంది.

చరిత్ర

[మార్చు]

ట్రావెన్‌కోర్ వాణిజ్య రాజధానిగా ఉన్న క్విలాన్ (కొల్లాం) ను మద్రాస్‌తో అనుసంధానించే ఉద్దేశంతో దక్షిణ భారత రైల్వే కంపెనీ 1902లో క్విలాన్-సెంగోట్టై రైలు మార్గాన్ని ప్రారంభించింది. మిరియాలు, జీడిపప్పు, తదితర సుగంధ ద్రవ్యాలను సాఫీగా రవాణా చేయడానికి క్విలాన్ నగరాన్ని మద్రాస్‌తో అనుసంధానించాలని పోర్ట్ ఆఫ్ క్విలాన్, నగరం లోని వాణిజ్య వర్గాలు బ్రిటిష్ పాలకులను కోరాయి. [1] 1918 జనవరి 4 న, దక్షిణ భారత రైల్వే కంపెనీ కొల్లం - తిరువనంతపురం పొడిగింపును చాల వరకు ప్రారంభించింది. టెర్మినస్‌ను త్రివేండ్రం సెంట్రల్ (తంపనూర్)కి మార్చి, 1931లో ప్రారంభించారు. [2]

పరిపాలన

[మార్చు]

దక్షిణ రైల్వే జోన్‌లోని తిరువనంతపురం రైల్వే డివిజన్ పరిపాలనా నియంత్రణలో ఉన్న ఈ మార్గం దక్షిణాన తిరువనంతపురం - కన్యాకుమారి లైన్, ఉత్తరాన కొల్లం - కాయంకుళం లైన్, తూర్పున కొల్లం-పునలూర్-సెంగోట్టై లైన్‌తో కలుపుతుంది. [2] [3]

స్టేషన్లు

[మార్చు]
నం. స్టేషన్ వర్గం సగటు రోజువారీ ప్రయాణీకులు సగటు రోజువారీ ఆదాయం
1 కొల్లం జంక్షను NSG 3 23,285 18,48,050
2 ఎరవిపురం HG 2 225 3,022
3 మెయ్యనాడ్ NSG 6 412 7,200
4 పరవూర్ NSG 5 2,761 40,480
5 కప్పిల్ NSG 6 43 513
6 ఎదవ NSG 6 532 3,024
7 వర్కాల శీవగిరి NSG 4 11,427 3,04,661
8 ఆకతుమూరి HG 3 34 677
9 కడక్కవూరు NSG 6 967 18,844
10 చిరయింకీళు NSG 5 2,581 39,965
11 పెరుంగుజి HG 2 93 859
12 మురుక్కంపుజ NSG 6 195 2,937
13 కనియాపురం NSG 6 345 3,474
14 కజకూట్టం NSG 5 1881 75,342
15 వెలి HG 2 62 995
16 కొచ్చువేలి NSG 3 1,720 666420
17 తిరువనంతపురం పెట్టా NSG 6 914 14,307
18 తిరువనంతపురం సెంట్రల్ NSG 2 39,157 52,91,536

సేవలు

[మార్చు]

కొల్లాం-తిరువనంతపురం మార్గంలో ప్రస్తుతం 67 జతల ప్రయాణీకుల సర్వీసులు ఉన్నాయి, వీటిలో 25 జతలు రోజువారీ సర్వీసులు (4 జతల పాసెంజరు రైళ్ళు, 18 జతల ఎక్స్‌ప్రెస్ రైళ్లు, 3 జతల సూపర్ ఫాస్ట్ రైళ్లు) నడుస్తున్నాయి. కొల్లాం జంక్షన్ రాష్ట్రంలోని 2వ అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషను. మొత్తం వార్షిక ప్రయాణీకుల పరంగా అత్యంత రద్దీగా ఉండే స్టేషన్లలో 4 వది.

మూలాలు

[మార్చు]
  1. "Kollam Municipal Corporation". Archived from the original on 20 అక్టోబరు 2017. Retrieved 15 June 2015.
  2. 2.0 2.1 "History of Quilon". Retrieved 15 June 2015.
  3. Jimmy, Jose. "Cochin Harbour Terminus". Trainweb. Retrieved 15 June 2015.