కోటగిరి విద్యాధరరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తూర్పు యడవల్లి గ్రామంలో 1946, ఏప్రిల్ 28న జన్మించిన కోటగిరి విద్యాధరరావు బీ.టెక్., ఈ గ్రామ సర్పంచిగా 1970 లో రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. 1970 నుండి 1983 లోపు రెండు సార్లు సర్పంచిగా చింతలపూడి సమితి ఉపాధ్యక్షునిగా, 1977-79 మధ్య చింతలపూడి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ గా పనిచేశారు. 1983 లో చింతలపూడి నుండి ఎం.ఎల్.ఏగా గెలుపొందారు. 1985, 1989, 1994, 1999 లలో గూడా చింతలపూడి ఎం.ఎల్.ఏగా గెలుపొందారు. 1985 లో వ్యవసాయశాఖా మంత్రిగా, తరువాత గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, భారీ పరిశ్రమల శాఖా మంత్రిగా చేశారు. 1985 నుండి 1989 వరకూ ఆర్.టీ.సీలో శాతవాహన రీజియన్ ఛైర్మన్ గా చేశారు. 1989 లో డీ.పీ శాసనసభాపక్ష నేతగా ఎన్నికైనారు. [1]కోటగిరి విద్యాధరరావు గుండెపోటుతో జూలై 20, 2013 న మరణించారు.[1] .

మూలాలు[మార్చు]

  • ఈనాడు మెయిన్ జూలై 21, 2013. 3వ పేజీ.
  1. "కోటగిరి విద్యాధరరావు కన్ను మూత". Archived from the original on 2013-11-29. Retrieved 2015-07-24.