కోటగిరి వెంకటయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కోటగిరి వెంకటయ్య 1930లో కరీంనగర్ జిల్లా రుద్రంగిలో జన్మించారు. ప్రాథమిక విద్య స్థానికంగా రుద్రంగిలోనూ మరియు కోరుట్లలోనూ అభ్యసించారు. 1946-48 కాలంలో హైదరాబాదు విమోచనోద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. భారత ప్రభుత్వం నుంచి సమరయోధుడిగానూ గుర్తించబడ్డారు. ప్రత్యక్షంగా రాజకీయ పదవులు పొందకున్ననూ 1977 వరకు కాంగ్రెస్ పార్టీలో, అత్యవసర పరిస్థితి అనంతరం జనతాపార్లో చురుకైన కార్యకర్తగా పనిచేశారు. 1963లో వేములవాడ వ్యవసాయ మార్కెట్ కమిటి డైరెక్టరుగా, 1973లో సిరిసిల్ల వర్తక సంఘం అధ్యక్షుడిగా, 1983లో సిరిసిల్ల అర్బన్ బ్యాంకు వ్యవస్థాపక డైరెక్టరుగా నియమించబడ్డారు.