Coordinates: 18°37′18″N 78°40′26″E / 18.6217705°N 78.6738°E / 18.6217705; 78.6738

రుద్రంగి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రుద్రంగి, తెలంగాణ రాష్ట్రం, రాజన్న సిరిసిల్ల జిల్లా, రుద్రంగి మండలానికి చెందిన గ్రామం.[1]

రుద్రంగి
—  రెవెన్యూ గ్రామం  —
రుద్రంగి is located in తెలంగాణ
రుద్రంగి
రుద్రంగి
అక్షాంశరేఖాంశాలు: 18°37′18″N 78°40′26″E / 18.6217705°N 78.6738°E / 18.6217705; 78.6738
రాష్ట్రం తెలంగాణ
జిల్లా రాజన్న సిరిసిల్ల
మండలం రుద్రంగి
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 10,009
 - పురుషుల సంఖ్య 4,886
 - స్త్రీల సంఖ్య 5,123
 - గృహాల సంఖ్య 2,499
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్
వెబ్‌సైటు: http://www.rudrangi.in/

ఇది మండల కేంద్రమైన చందుర్తి నుండి 10 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన సిరిసిల్ల నుండి 30 కి. మీ. దూరంలోనూ ఉంది. 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత కరీంనగర్ జిల్లా లోని చందుర్తి మండలంలో ఉండేది. పునర్వ్యవస్థీకరణలో దీన్ని కొత్తగా ఏర్పాటు చేసిన రుద్రంగి మండలం లోకి చేర్చారు. [2]2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2499 ఇళ్లతో, 10009 జనాభాతో 4082 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 4886, ఆడవారి సంఖ్య 5123. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1427 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 328. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 572158.పిన్ కోడ్: 505307.

నూతన మండల కేంధ్రంగా గుర్తింపు[మార్చు]

లోగడ రుద్రంగి  గ్రామం కరీనగర్ జిల్లా పరిధిలోని చందుర్తి మండలానికి చెందినది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్య్వస్థీకరణలో భాగంగా రుద్రంగి గ్రామాన్ని (1+01) రెండు గ్రామాలుతో నూతన మండల కేంధ్రంగా రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[3]

గ్రామ చరిత్ర[మార్చు]

ఈ ఊరు దాదాపు 180 సంవత్సరాల క్రితం ఇటిక్యాల్ దొర ఆద్వర్యంలో ఉండేది. ఊరి మధ్యలో ఆయన నివాసం. 'గడి'గా పిలిచే ఆ నివాసంలో అనేక పనివాళ్ళతొ ఆర్బాటంగా ఉండేది.అందులోని తలుపులు, కిటికీల పైన ఉన్న కళ చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. దొర అజమాయిషిలో ఊరు ఉండేది. ఆ నివాసం ముందు నుంచి ఎవరు వెళ్ళినా చెప్పులు విడిచి వెళ్ళాల్సిందే. అలా జరిగాక చాలా రోజులకు నక్సలైట్ల ప్రాబల్యం పెరిగి ఆ దొర పట్టణాలకు వలస పోయారు. ఆ గడిలోని కట్టెను దొంగలు, ప్రజలు కొల్లగొట్టారు. ఊరిలో పంటలు పండక ప్రజలు, యువకులు గల్ఫ్ దేశాలకు వెళ్ళి తమ భార్యాపిల్లలను పొషించుకుంటున్నారు. చుట్టుపక్క గ్రామాలైన తొర్తి, కొత్తపేట, సనుగుల, లింగంపేట, కలికొట, మానాల లంబాడి తండ నుండి ప్రజలు ఏ అవసరానికైనా ఇక్కడికే వస్తారు.రాజన్న సిరిసిల్ల జిల్లాలో రుద్రంగి ఒక అద్భుతమైన గ్రామం.చుట్టూ పచ్చని అడవులతో, కొండలతో ఎపుడు చూసిన చూడాలనిపించేలా ఉంటుంది. కొండ పైన నరసంహ స్వామి దేవాలయం ఆ పక్కన చిన్న చెరువులాంటి మంగలికుంట, కోతులు, పక్షులు, ఆప్యాయంగా పలకరించే ప్రజలు.

విద్యా సౌకర్యాలు[మార్చు]

1999 వరకు ఆంగ్ల మాధ్యమపు పాఠశాలలు, కళాశాలలు, 2001 వరకు గ్రామంలో 10 వతరగతి వరకు ప్రైవేటు పాఠశాలలు లేవు. గ్రామంలో విద్యావ్యవస్థ ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతోంది. గ్రామపు కొందరు ప్రముఖుల వలన ఇంటర్మీడియట్ కళాశాల ఏరాటు చేయబడిది. ఈ మధ్యనే ప్రభుత్వ కళాశాల ఏర్పాటు అయ్యింది దీనివల్ల పేద విద్యార్థులకు చాలా లాభం జరింగింది. ఈ మధ్యనే రుద్రంగి వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో గ్రంథాలయం స్థాపించబడింది. దీనిని గ్రామ అభివృద్ధికి తొలిమెట్టుగా భావించవచ్ఛు. రుద్రంగి వెల్ఫేర్ అసోసియేషన్ గ్రామస్తులందరికి చాలా ఉపయోగకరంగా ఉండి తన సేవలను విస్తరించే దిశలో ముందడుగు వేస్తోంది. ఇది ఎంతో శుభ పరిణామం. గ్రామంలో ఐదుప్రైవేటు బాలబడులు ఉన్నాయి. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు నాలుగు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు ఐదు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలలు ఐదు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి, ప్రైవేటు మాధ్యమిక పాఠశాలలు నాలుగు ఉన్నాయి. ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉంది.

సమీప ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల వేములవాడలోను, ఇంజనీరింగ్ కళాశాల కరీంనగర్లోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల కరీంనగర్లోను, పాలీటెక్నిక్ తెట్టకుంటలోనూ ఉన్నాయి.సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం వేములవాడలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల కరీంనగర్ లోనూ ఉన్నాయి.

వైద్య సౌకర్యం[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం[మార్చు]

రుద్రంగిలో ఉన్న రెండు ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల్లో డాక్టర్లు లేరు. ఇద్దరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు.ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. పశు వైద్యశాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం[మార్చు]

గ్రామంలో9 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. డిగ్రీ లేని డాక్టర్లు 11 మంది ఉన్నారు. మూడు మందుల దుకాణాలు ఉన్నాయి.

తాగు నీరు[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. కుళాయిల ద్వారా శుద్ధి చేయని నీరు కూడా సరఫరా అవుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది. చెరువు ద్వారా గ్రామానికి తాగునీరు లభిస్తుంది.

పారిశుధ్యం[మార్చు]

గ్రామంలో భూగర్భ మురుగునీటి వ్యవస్థ ఉంది. మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు[మార్చు]

రుద్రంగిలో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

దాదాపుగా ప్రతి అరగంటకు ఒక బస్సు చొప్పున కోరుట్ల, వేములవాడ నుండి ఉన్నాయి. ఆర్.టి.సి బస్సులేకాక ఇతర జీపులు కూడా ఉంటాయి.

గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రైవేటు బస్సు సౌకర్యం, రైల్వే స్టేషన్ మొదలైనవి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

జిల్లా రహదారి గ్రామం గుండా పోతోంది. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు[మార్చు]

గ్రామంలో వాణిజ్య బ్యాంకు ఉంది. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత ఉన్నాయి. వ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. ఏటీఎమ్, సహకార బ్యాంకు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. రోజువారీ మార్కెట్, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో పబ్లిక్ రీడింగ్ రూం ఉంది. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. సినిమా హాలు, గ్రంథాలయం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

విద్యుత్తు[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 24 గంటల పాటు వ్యవసాయానికి,24 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం[మార్చు]

రుద్రంగిలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • అడవి: 1523 హెక్టార్లు
  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 236 హెక్టార్లు
  • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 120 హెక్టార్లు
  • శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 102 హెక్టార్లు
  • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 51 హెక్టార్లు
  • సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 450 హెక్టార్లు
  • బంజరు భూమి: 453 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 1147 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 1379 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 671 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు[మార్చు]

రుద్రంగిలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • బావులు/బోరు బావులు: 671 హెక్టార్లు

ఉత్పత్తి[మార్చు]

రుద్రంగిలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు[మార్చు]

వరి, ప్రత్తి

పారిశ్రామిక ఉత్పత్తులు[మార్చు]

బీడీలు

దేవాలయాలు[మార్చు]

ఊరికి చివర బుగ్గ రాజేషుని గుడి ఉంది అక్కడ ఎప్పుడు నీరు ఎండిపోని చిన్న కోనేరు ఉంది. ఊరి మధ్యలో హనుమాన్ దేవాలయం, అక్కడి రావి చెట్టు చాల ఏళ్ళ క్రితందిగా చెపుతారు.

ఇతర విశేషాలు[మార్చు]

ఈ ఊరిలో ఎక్కడ లేనివిధంగా హిరణ్యకశిపునికి గుడిలాంటి గుహ ఉంది. నరసింహావతారంలో ఉన్న మహావిష్ణువు తనని వధించబోతుంటే ఆ గుహలో దాక్కొన్నడని ప్రతీతి. ఇక్కడ నరసింహస్వామి గుడి నుంచి ఒక సొరంగమార్గం ఉందని చాలా ఏళ్ళక్రితం ఎవరో ఆ సొరంగంలోకి వెళ్ళి తిరిగి రాలేదని చెపుతారు. హిరణ్యకశిపుని గుహలోంఛి కూడా ఒక మార్గం ఉందని దాంట్లొంచి వెళితే బంగారు బంతి, బంగారు ఖడ్గం గాలిలో వేలాడుతూ కనిపిస్తాయని చెపుతారు. కాని అది తీసుకోవాలంటే ఒక మనిషి బలి కావాలని చెపుతారు. అదే విదంగా దొర గడిలో కూడా నిధి ఉందని దానికి మైసమ్మ కాపలా ఉందని చెపుతారు.

గ్రామంలో ప్రముఖులు[మార్చు]

  • ఆది శ్రీనివాస్ (వేములవాడ ఆలయ కమిటీ మాజీ చైర్మన్)
  • పొద్దుపొడుపు లింగారెడ్డి (మాజీ జెడ్ పి టి సి)
  • మాడిషెట్టి ఆనందం రావు - మాజి సర్పంచ్.
  • అంబటి గంగాధర్ - జెడ్ పి టి సి
  • బైరి గంగరాజు గంగమల్లయ్య (సర్పంచ్)

కస్తూర్బా స్కూల్‌[మార్చు]

  • ఈ గ్రామంలో 3.50 కోట్ల రూపాయలతో నిర్మించిన కస్తూర్బా స్కూల్‌ భవనాన్ని 2022 డిసెంబరు 20న తెలంగాణ రాష్ట్ర ఐటి-పురపాలక-పరిశ్రమల శాఖామంత్రి కేటీఆర్ ప్రారంభించాడు. ఈ కార్యక్రమంలో వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు, జిల్లా ప్రజా పరిషత్ చైర్‌ప‌ర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.[4]

మూలాలు[మార్చు]

  1. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-12-09. Retrieved 2018-02-11.
  2. "రాజన్న సిరిసిల్ల జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2022-01-06 suggested (help)
  3. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 228 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  4. telugu, NT News (2022-12-20). "వేముల‌వాడ‌లో మంత్రి కేటీఆర్ ప‌ర్య‌ట‌న‌.. రూ. 72 కోట్ల ప‌నుల‌కు శంకుస్థాప‌న‌". www.ntnews.com. Archived from the original on 2022-12-20. Retrieved 2022-12-20.

వెలుపలి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=రుద్రంగి&oldid=3783056" నుండి వెలికితీశారు