కోట్లి లయన్స్పాకిస్తానీ ప్రొఫెషనల్ టీ20 ఫ్రాంచైజీ జట్టు.[2][3] ఈ జట్టు కాశ్మీర్ ప్రీమియర్ లీగ్‌లో పాల్గొంటుంది. ఈ జట్టుకు కెప్టెన్‌గా ఖుర్రం మంజూర్, కోచ్‌గా ముస్తాక్ అహ్మద్ ఉన్నారు.[4][5][6][7] ఫ్రాంచైజీ కోట్లి జిల్లా రాజధాని అయిన కోట్లి నగరానికి ప్రాతినిధ్యం వహిస్తోంది.[8]
2021 కెపిఎల్ లో, కోట్లి లయన్స్ 1 మ్యాచ్ గెలిచింది, 3 ఓడిపోయింది, గ్రూప్ దశలో ఒక మ్యాచ్ డ్రాగా నిలిచింది. గ్రూప్‌లో చివరి స్థానంలో నిలిచి పోటీ నుంచి నిష్క్రమించారు.
2022 మేలో, మాజీ పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ 2022 కెపిఎల్ లో కోట్లి లయన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తానని ప్రకటించాడు.[9]ఖుర్రం మంజూర్‌ను జట్టు ఐకాన్ ప్లేయర్, కెప్టెన్‌గా ప్రకటించారు.[10] 2022 కెపిఎల్ సమయంలో, కెపిఎల్ వారు బకాయి చెల్లింపులను చెల్లించలేకపోయినందున కోట్లి లయన్స్ నిర్వహణను ముగించారు. కోట్లి లయన్స్ ప్రధాన కోచ్ సయీద్ ఆజాద్ జట్టును విడిచిపెట్టాడు, అతని స్థానంలో ముస్తాక్ అహ్మద్‌ని తీసుకున్నారు. కెపిఎల్ యాజమాన్యం తాత్కాలికంగా కోట్లి లయన్స్‌ను స్వాధీనం చేసుకుంది.[11]