కోట శివరామయ్య
Appearance
కవి కాలాదులు
[మార్చు]కోట శివరామయ్య సానందోపాఖ్యాన మను నాలుగాశ్వాసముల పద్యకావ్యమును రచించెను. ఇతడు శూద్రుడు; కౌశికగోత్రుడు; కోట బాపనయ్య పుత్రుడు; కాళహస్తిపుర నివాసుడు. ఇతడు తాను కృష్ణదేవరాయలకాలములో నున్నధూర్జటికవి శిష్యుడ నని గ్రంథములో జెప్పుకొని యుండుటచేత ఈ కవి 1525 - 1550 వ సంవత్సరములకు మధ్యనుండియుండును.
కవితా ధోరణి
[మార్చు]సానందొపాఖ్యానమునందు లక్షణవిరుద్ధము లైన ప్రయోగములు కొన్ని కానబడుచున్నవి. కవిత్వము మృదువుగానే యున్నది. ఈ గ్రంథము నందలి రెండు మూడు పద్యముల నిందుదాహరించుచున్నాను.
- ఉ. గారెలు బూరె లిడ్డెనలు గమ్మనిదోసెలు జక్కిలంబులున్
- జారులు గూరలున్ ఫలరసంబులు దేనెలు బానకంబులున్
- సారెలు బాయసాన్నములు జక్కెర లప్పడంబులున్
- బేరిననేతులుం జెఱకుబిళ్ళలు జల్లనినీరుమజ్జిగల్. [ఆ.1]
- ఉ. పాపము చేయవల్దనుచు బల్మఱు బెద్దలు చెప్పిన న్మహా
- కోపముమీఱ వారియెడ గుత్తుకబంటివిషంబు గ్రక్కుచున్
- బాపము గీప మేడది నెపం బిడి జీవము దాటిపోయి యే
- దాపున నెందు బోవునొ నిదాన మెఱుంగ రివేటిబోధనల్. [ఆ.2]
- మ. జమువెంటం బురవీధులం జనుచు భాస్వత్పట్టణశ్రీవినో
- దము లీక్షింపుచు జూడ జూడ మఱియుం దండోపతండంబులై
- భ్రమ కల్పించుపురీవిశేషములకుం బ్రాజ్యాద్భుతానీతుడై
- యమునిం గన్గొని పల్కె సంయమి మరందానందసాంద్రోకులన్. [ఆ.3]
మూలాల జాబితా
[మార్చు]- ఆంధ్ర కవుల చరిత్రము - రెండవ భాగము (1949) రచించినవారు కందుకూరి వీరేశలింగం పంతులు. --కోట శివరామయ్య (విభాగం)