Jump to content

కోనాయిపల్లి వేంకటేశ్వరస్వామి దేవాలయం

వికీపీడియా నుండి
కోనాయిపల్లి వేంకటేశ్వరస్వామి దేవాలయం
స్థానం
దేశం:భారతదేశం
రాష్ట్రం:తెలంగాణ
జిల్లా:సిద్ధిపేట జిల్లా
ప్రదేశం:కోనాయిపల్లి, నంగునూరు మండలం
నిర్మాణశైలి, సంస్కృతి
ప్రధానదైవం:వేంకటేశ్వర స్వామి
ప్రధాన పండుగలు:ఉత్సవాలు

కోనాయిపల్లి వేంకటేశ్వరస్వామి దేవాలయం, తెలంగాణ రాష్ట్రం, సిద్ధిపేట జిల్లా, నంగునూరు మండలం లోని కోనాయిపల్లి గ్రామంలో ఉంది.[1]

చరిత్ర

[మార్చు]

రూ.3.50 కోట్లతో ఈ దేవాలయం పునర్నిర్మించారు. ప్రధాన ఆలయం, కల్యాణ మండపం, రాజగోపురం, రాజమండపం, ధ్వజస్తంభం, ఆంజనేయుడు, స్వామి వారి మూలవిరాట్‌, నాగమ్మ అమ్మవారి విగ్రహాలను ఏర్పాటుచేయడంతోపాటు ఉత్తర ద్వారాన్ని కూడా నిర్మించారు.[2] ఈ దేవాలయ ముఖద్వారం దక్షిణం వైపు ఉంటుంది, ఇలా దక్షిణం వైపు ఉన్న దేవాలయాలు చాలా అరుదుగా ఉంటాయి.

ప్రాముఖ్యత

[మార్చు]

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఇది సెంటిమెంట్‌ దేవాలయం. ఏ ఎన్నికలు వచ్చినా ఇక్కడ పూజలు చేసిన తర్వాతే నామినేషన్‌ వేస్తాడు. 1985లో మొదటిసారి సిద్ధిపేట ఎమ్మెల్యేగా గెలుపొందినప్పటి నుంచి 1989, 1994, 1999, 2001, 2004, 2009, 2014, 2018లలో జరిగిన ఎన్నికల్లో వేంకటేశ్వరస్వామి దేవాలయంలో నామినేషన్‌ పత్రాలకు పూజలు నిర్వహించి, నామినేషన్‌ వేసి విజయం సాధించాడు. తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా టీడీపీ ప్రాథమిక సభ్యత్వం, శాసనసభ డిప్యూటీ స్పీకర్‌, ఎమ్మెల్యే పదవులకు 2001 ఏప్రిల్‌ 27న రాజీనామా చేసి, అదే రోజు ఉదయం కోనాయిపల్లి వెంకన్నస్వామి ఆశీర్వాదం తీసుకొని టీఆర్‌ఎస్‌ పార్టీని స్థాపించాడు. పార్టీ జెండాతో పాటు తెలంగాణ సాహిత్యం, పాటల క్యాసెట్లను దేవుడి సన్నిధిలో పెట్టి పూజలు నిర్వహించారు.[3]

ఉత్సవాలు

[మార్చు]

దేవాలయ పునఃప్రతిష్టోత్సవాలు 2022, ఫిబ్రవరి 11 నుంచి 16 వరకు ఆరురోజులపాటు నిర్వహించబడ్డాయి. ఫిబ్రవరి 14న దేవాలయంలో జరిగిన పద్మావతి గోదా సమేత వేంకటేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖామంత్రి టి. హరీశ్‌రావు పాల్గొని ప్రత్యేక పూజలను నిర్వహించాడు.[4]

మూలాలు

[మార్చు]
  1. telugu, NT News (2022-02-10). "కోనాయిపల్లి ఆలయం పునర్నిర్మాణం". Namasthe Telangana. Archived from the original on 2022-02-11. Retrieved 2022-03-04.
  2. "కోనాయిపల్లి వేంకటేశ్వరుడికి నూతన శోభ". EENADU. 2022-02-09. Archived from the original on 2022-02-08. Retrieved 2022-03-04.
  3. telugu, NT News (2022-02-10). "కోటికోటి దండాలు కోనేటిరాయ". Namasthe Telangana. Archived from the original on 2022-03-05. Retrieved 2022-03-05.
  4. "సీఎం సహకారంతో ఆలయాభివృద్ధి". andhrajyothy. Archived from the original on 2022-03-05. Retrieved 2022-03-05.