కోనేరు సత్యప్రసాద్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కోనేరు సత్యప్రసాద్

కోనేరు సత్యప్రసాద్ ఆంధ్రప్రదేశ్ కు చెందిన వైద్యుడు, మానవతావాది, సామాజిక సేవకుడు.

విద్య[మార్చు]

విజయవాడ పటమటలో పాఠశాల విద్యను అభ్యసించాడు. ఆ తరువాత ఎస్.ఆర్.ఆర్. కళాశాలలో పియుసి చదివి, ఆపై బాపట్లలో వ్యవసాయశాస్త్రంలో సంవత్సరంనర డిగ్రీ చదువుకున్నారు. 1967లో గుంటూరు వైద్య కళాశాలలో వైద్య విద్యార్థిగా చేరాడు. వైద్య విద్యార్తిగా వున్నప్పుడే తన తోటి విద్యార్తులతొ కలిసి ప్రజా సేవ అనే సంస్థను ఏర్పాటు చేశాడు. దాని ఆధర్యంలో వైద్య కళాశాల అద్యాపకులు, స్తానిక వైద్యుల సహాయంతో పేదల వాడల్లో వైద్య శిభిరాలను నిర్యహించేవాడు. రిక్షా కార్మికుల వంటి నిరుపేదలకు నెలకు ఒక్క రూపాయితో వైద్య సేవలను అందించేవారు. తమ లాంటి వారిని మరి కొందరిని కలుపుకొని అమెరికా, ఆస్ట్రేలియా, యూరప్ లలోను "హీల్" శాఖలను ఏర్పాటు చేసి విరాళలను సేకరించి తన సేవా కార్యక్రమాలకు ఉపయోగించాడు. 1976 లో యుకె నుండి వైద్య విద్యలో స్నాతకోత్తర పట్టా పొందాడు.

ఉద్యోగం[మార్చు]

డాక్టరుగా 1981 లో పూర్తి స్థాయి ప్రాక్టిస్ ను యుకెలో మొదలుపెట్టాడు.

సమాజ సేవ[మార్చు]

వైద్య విద్యార్థిగా ఉన్న రోజుల్లోనే సామాజిక సేవా దృక్పథాన్ని సత్యప్రసాద్ అలవరుచుకున్నాడు. పదవ తరగతి చదివేసిన విద్యార్థుల నుండి వారి పాఠ్య పుస్తకాలను సేకరించి, పుస్తకాలు కొనుక్కోలేని విద్యార్థులకు అందించేవాడు. 1991లో హీల్(HEAL - Health & Education for ALl - అందరికీ వైద్యం, విద్య) స్వచ్ఛంద సేవా సంస్థను స్థాపించి సమాజ సేవ మొదలుపెట్టాడు.[1]

సేవా కార్య క్రమాలు[మార్చు]

డా: సత్యప్రసాద్ మొదట తన ఇంట్లోనె అంకిత పేరుతో ఒక ఆశ్రమాన్ని నెలకొల్పాడు. అనాద బాల బాలికలను చేరదీసి వారికి తిండి, బట్ట, చదువు, కపించి ప్రేమగా చూసుకున్నాడు. ఏడాది లోపలే పిల్లల సంఖ్య ఎక్కువ కాగా చోడవరంలో నాలుగెకరాల స్థలం కొని అక్కడ హీల్ విలేజ్ ను నిర్మించాడు. 26 మందితో ప్రారంభం అయిన అది త్వరలోనే 225 పిల్లలు చేరారు. గత పాతికేళ్లలో ఇక్కడ చదివి దదివి తమ కాళ్లపై తాము నిలబడే స్థితికి వచ్చిన 500 మంది బయటకు వెళ్లిపోయారు. అలా మూడు నెలల పాపగా వచ్చిన ఒక అమ్మాయి ఇంజనీరింగి చదివి ఉద్యోగంలో చేరింది. అలా బయటకు వెళ్లిన వారంతా శలవుల్లో తమ ఆత్మీయులాతో గడపడానికి హీల్ విలేజ్ కు వస్తుంటారు. ఈ హీల్ విలేజ్ ఇంకా అభివృద్ధి పరిచి కృష్ణా జిల్లా లోని అగిరి పల్లి చుట్టు ప్రక్కల 27 ఎకరాల విశాల ప్రాంగణంలో హీల్ పారడైజ్ ని ఆవిష్కరించారు. ఇక్కడి వసతి గృహాలలో 550 పిల్లలున్నారు. ఈ ప్రాంగణంలో అన్ని సౌకర్యాలతో ఒక ఇంగ్లీషు మీడియం పాఠశాల, ఆటల మైదానము, లైబ్రరీ,కంప్యూటర్ లాబ్ వున్నాయి. సెలవుల్లో పిల్లలను విహారయాత్రలకు, క్షేత్రస్థాయి పర్యటనలకు తీసుకేళ్లతారు. అనేక కారణాలవల్ల అనాదలైన పిల్లలను వార్థా పత్రికలలో చదివి, ఎవరైనా చెప్పగా విని అక్కడికి వెళ్లి తీసుకొచ్చె చేర్చుకుంటారు.

బయటివారి కూడా....[మార్చు]

హీల్ సేవలు అక్కడ వున్న పిల్లలకే పరిమితం కాదు. పైచదువులు చదువుతున్న పేద విద్ద్యార్తులకు ఆర్థిక సహాయం చేస్తున్నది. చుట్టుప్రక్కల నున్న పాఠశాల విధ్యార్తులకు, నోటు పుస్తకాలు, పాఠ శాలలకు బల్లకు, క్రీడా సామాగ్రి అందిస్తున్నారు వికలాంగులకు కృత్రిమ అవయవాలు సరఫారా చేస్తున్నారు.

మూలాలు[మార్చు]

  1. . ఈనాడు టెలివిజన్ 2 ఆంధ్రప్రదేశ్ https://www.youtube.com/watch?v=NkusNEo85JU. Retrieved 19 August 2019. Missing or empty |title= (help)

1. ఈనాడు ఆదివారం. 25 నవంబరు, 2018.