కోబాల్ట్(II) కార్బొనేట్
| |||
పేర్లు | |||
---|---|---|---|
IUPAC నామము
Cobalt(II) carbonate
| |||
ఇతర పేర్లు
Cobaltous carbonate; cobalt(II) salt
| |||
గుర్తింపు విషయాలు | |||
సి.ఎ.ఎస్. సంఖ్య | [513-79-1] | ||
పబ్ కెమ్ | 10565 | ||
ధర్మములు | |||
CCoO3 | |||
మోలార్ ద్రవ్యరాశి | 118.94 g·mol−1 | ||
స్వరూపం | red/ pink crystals (anhydrous) pink, violet, red crystalline powder (hexahydrate) | ||
సాంద్రత | 4.13 g/cm3 | ||
ద్రవీభవన స్థానం | 427 °C (801 °F; 700 K) [2] decomposes before melting to cobalt(II) oxide (anhydrous) 140 °C (284 °F; 413 K) decomposes (hexahydrate) | ||
negligible | |||
Solubility product, Ksp | 1.0·10−10[1] | ||
ద్రావణీయత | soluble in acid negligible in alcohol, methyl acetate insoluble in ethanol | ||
వక్రీభవన గుణకం (nD) | 1.855 | ||
నిర్మాణం | |||
స్ఫటిక నిర్మాణం
|
Rhombohedral (anhydrous) Trigonal (hexahydrate) | ||
ఉష్ణగతిక రసాయన శాస్త్రము | |||
నిర్మాణము మారుటకు కావాల్సిన ప్రామాణిక ఎంథ్రఫీ ΔfH |
−722.6 kJ/mol[2] | ||
ప్రామాణిక మోలార్ ఇంథ్రఫీ S |
79.9 J/mol·K[2] | ||
ప్రమాదాలు | |||
జి.హెచ్.ఎస్.పటచిత్రాలు | [3] | ||
జి.హెచ్.ఎస్.సంకేత పదం | Warning | ||
జి.హెచ్.ఎస్.ప్రమాద ప్రకటనలు | H302, H315, H317, H319, H335, H351[3] | ||
GHS precautionary statements | P261, P280, P305+351+338[3] | ||
ఇ.యు.వర్గీకరణ | {{{value}}} | ||
R-పదబంధాలు | R22, R36/37/38, మూస:R40, మూస:R43 | ||
S-పదబంధాలు | S26, మూస:S36/37 | ||
Lethal dose or concentration (LD, LC): | |||
LD50 (median dose)
|
640 mg/kg (oral, rats) | ||
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa). | |||
verify (what is ?) | |||
Infobox references | |||
కోబాల్ట్ (II) కార్బొనేట్ఒక రసాయన సమ్మేళనం. ఇది ఒక అకర్బన రసాయన సంయోగపదార్థం. కోబాల్ట్, కర్బనం,, ఆక్సిజన్ మూలకాల సమ్మేళనం వలన ఈ రసాయన సంయోగ పదార్థం ఏర్పడినది. ఈ సమ్మేళన పదార్థంలోని కోబాల్ట్ ఒక లోహధాతువు, కర్బనం ఒక అలోహం కాగా ఆక్సిజన్ వాయురూపంలో లభ్యమగు మూలకం.ఎర్రగా, పారా మాగ్నెటిక్ గుణం కలిగిన ఈ పదార్థం, కోబాల్ట్ ఖనిజాన్ని హైడ్రో మేటలార్జికల్ విధానం ద్వారా శుద్ధి చేయునపుడు మధ్యంతరస్థాయి సమ్మేళనంగా ఏర్పడుతుంది.
కోబాల్ట్ (II) కార్బొనేట్ ఒక ఆకర్బన వర్ణ పదార్థం,, ఉత్ప్రేరకాలకు పుర్వగామి. వ్యాపారస్థాయిలో లేత వైలెట్ రంగులో లభించు ఈ సమ్మేళనపదార్థం యొక్క రసాయన సంకేత పదం CoCO3(Co(OH) x(H2O) y.నిర్జల కోబాల్ట్(II) కార్బొనేట్ సంకేత పదంCCoO3
భౌతిక ధర్మాలు
[మార్చు]కోబాల్ట్ (II) కార్బొనేట్ ఘన పదార్థం. నిర్జల కోబాల్ట్(II) కార్బొనేట్ ఎరుపు/పింకురంగులో స్పటికములుగా ఉండును.అర్ద్రకోబాల్ట్ (II) కార్బొనేట్ వైలెట్, పింకు గులో ఉండును. ఈ సంయోగ పదార్థం యొక్క ఆణుభారం 118.94గ్రాములు/మోల్. కోబాల్ట్ (II) కార్బొనేట్ యొక్క సాంద్రత 4.13గ్రాములు/సెం.మీ3.నిర్జల కోబాల్ట్ కార్బొనేట్ ద్రవీకరణ ఉష్ణోగ్రత 427 °C, కాని ద్రవికరణ కన్నాముందే కోబాల్ట్ (II) ఆక్సైడుగా వియోగంచెందును. జలయుత కోబాల్ట్ కార్బొనేట్ 140 °C వద్ద వియోగం చెందును. కోబాల్ట్ (II) కార్బొనేట్ వక్రీభవన సూచిక 1.855
ఉత్పత్తి-రసాయన లక్షణాలు
[మార్చు]కోబాల్ట్‌యుత సల్ఫేటులను సోడియం బైకార్బొనేటుటో కలిపి వేడిచెయ్యడం వలన కోబాల్ట్ (II) కార్బొనేట్ ఏర్పడును.ఏర్పడిన కార్బోనేటును కాల్సినింగు(Co3O4) చెయ్యుదురు.
- 3 CoCO3 + 1/2 O2 → Co3O4 + 3 CO2
ఏర్పడిన Co3O4 అధిక ఉష్ణోగ్రత వద్ద CoO పరివర్తింప బడుతుంది. ఎక్కువ పరివర్తక లోహకార్బోనేటులవలె, కోబాల్ట్ కార్బొనేట్ కూడా నీటిలో కరుగదు.కాని ఖనిజ ఆమ్లాల వలన చర్యకు లోనగును.
- CoCO3 + 2 HCl + 5 H2O → [Co(H2O)6]Cl2 + CO2
ఉపయోగాలు
[మార్చు]- కోబాల్ట్ కార్బోనేట్ సమ్మేళనం, కోబాల్ట్ కార్బొనైల్,, పలుకోబాల్ట్ లవణాల ఉత్పత్తికి పుర్వగామి(precursor) గా పనిచెయ్యును.
- ఈ సంయోగ పదార్థాన్ని ఆహారానికి సంబంధించి పథ్యసంబంధమైనఅదనంగా ఉపయోగిస్తారు.
- కోబాల్ట్ ఒక ఆవశ్యక మూలకం.
- మృణ్మయపాత్రల మెరుపు కలిగించు పదార్థాల తయారీకి పూర్వగామిగా ఉపయోగపడుతుంది.
రక్షణ
[మార్చు]కోబాల్ట్ కార్బోనేట్ కడుపులోకి వెళ్ళిన ప్రమాదకరం . కళ్ళను, చర్మాన్ని తాకిన ప్రకోపింప జేసే గుణం కలిగి ఉంది.