కోలిన్ అకర్‌మాన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కోలిన్ అకర్‌మాన్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
కోలిన్ నీల్ అకర్‌మాన్
పుట్టిన తేదీ (1991-04-04) 1991 ఏప్రిల్ 4 (వయసు 33)
జార్జ్, కేప్ ప్రావిన్స్, దక్షిణాఫ్రికా
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఆఫ్ బ్రేక్
పాత్రఆల్ రౌండరు
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 75)2021 నవంబరు 26 - దక్షిణాఫ్రికా తో
చివరి వన్‌డే2023 మార్చి 25 - జింబాబ్వే తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.48
తొలి T20I (క్యాప్ 50)2019 అక్టోబరు 5 - ఐర్లాండ్ తో
చివరి T20I2022 నవంబరు 6 - దక్షిణాఫ్రికా తో
T20Iల్లో చొక్కా సంఖ్య.48
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2010–2017ఈస్టర్న్ ప్రావిన్స్
2012–2019వారియర్స్ (స్క్వాడ్ నం. 48)
2017–presentలీసెస్టర్‌షైర్ (స్క్వాడ్ నం. 48)
2021Manchester Originals
2023–presentSylhet Strikers
2023Southern Brave
కెరీర్ గణాంకాలు
పోటీ వన్‌డేలు టి20 ఫక్లా లిఎ
మ్యాచ్‌లు 7 22 163 97
చేసిన పరుగులు 211 465 10,301 2,771
బ్యాటింగు సగటు 35.16 25.83 40.55 38.48
100లు/50లు 0/2 0/1 22/62 3/19
అత్యుత్తమ స్కోరు 81 62 277* 152*
వేసిన బంతులు 264 210 6,956 2,545
వికెట్లు 4 7 82 50
బౌలింగు సగటు 54.25 30.85 46.57 41.28
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 1 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 2/51 1/6 5/69 4/48
క్యాచ్‌లు/స్టంపింగులు 5/– 6/– 172/– 66/–
మూలం: Cricinfo, 7 September 2023

కోలిన్ నీల్ అకర్‌మాన్ (జననం 1991 ఏప్రిల్ 4) డచ్-దక్షిణాఫ్రికా క్రికెటరు. అతను ఇంగ్లాండ్‌లోని లీసెస్టర్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్, నెదర్లాండ్స్ జాతీయ క్రికెట్ జట్టు కోసం ఆడుతున్నాడు. [1] 2019 అక్టోబరులో నెదర్లాండ్స్ తరపున అంతర్జాతీయ రంగప్రవేశం చేసాడు. [2] [3]

అతను లీసెస్టర్‌షైర్ క్లబ్ కెప్టెన్‌గా (2020–2022) పనిచేశాడు.

జీవితం తొలి దశలో[మార్చు]

అకర్‌మాన్ 1991 ఏప్రిల్ 4న దక్షిణాఫ్రికాలోని కేప్ ప్రావిన్స్‌లోని జార్జ్‌లో జన్మించాడు. అతను జార్జ్‌లోని ఔటెనిక్వా ప్రైమరీ స్కూల్, పోర్ట్ ఎలిజబెత్‌లోని గ్రే హై స్కూల్‌లో చదువుకున్నాడు. [4] [5] [6] అతను 2010 అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్‌లో దక్షిణాఫ్రికాకు వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. [7]

దేశీయ కెరీర్[మార్చు]

2016 సీజన్‌లో, అతను 2016–17 సన్‌ఫోయిల్ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేశాడు. పది మ్యాచ్‌లలో, పదిహేడు ఇన్నింగ్స్‌లలో ఆడి మొత్తం 883 పరుగులు చేశాడు. [8]

2017 సీజన్‌కు ముందు, అకర్‌మాన్ రెండు సంవత్సరాల ఒప్పందంపై ఇంగ్లీష్ కౌంటీ జట్టు లీసెస్టర్‌షైర్‌కు సంతకం చేశాడు. [9] 2017 మేలో, క్రికెట్ సౌత్ ఆఫ్రికా వార్షిక అవార్డులలో అతను డొమెస్టిక్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్‌గా ఎంపికయ్యాడు. [10] 2017 ఆగస్టులో, అతను T20 గ్లోబల్ లీగ్ యొక్క మొదటి సీజన్ కోసం నెల్సన్ మండేలా బే స్టార్స్ జట్టులో ఎంపికయ్యాడు. [11] అయితే, 2017 అక్టోబరులో, క్రికెట్ దక్షిణాఫ్రికా ఆ టోర్నమెంట్‌ను నవంబరు 2018కి వాయిదా వేసి, ఆ తర్వాత వెంటనే రద్దు చేసింది. [12]

2019 ఆగస్టు 7న, ఇంగ్లండ్‌లో జరిగిన 2019 t20 బ్లాస్ట్‌లో, బర్మింగ్‌హామ్ బేర్స్‌పై లీసెస్టర్‌షైర్ తరపున అకర్‌మాన్ పద్దెనిమిది పరుగులకు ఏడు వికెట్లు పడగొట్టాడు. [13] ఇవే ట్వంటీ-20 క్రికెట్ మ్యాచ్‌లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు.[14] 2022 ఏప్రిల్లో, ది హండ్రెడ్ 2022 సీజన్ కోసం అతన్ని మాంచెస్టర్ ఒరిజినల్స్ కొనుగోలు చేసింది. [15] 2022 జూలైలో, కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో అకర్‌మాన్, ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో 277 నాటౌట్‌తో తన తొలి డబుల్ సెంచరీని సాధించాడు. [16]

అంతర్జాతీయ కెరీర్[మార్చు]

2019 జూన్‌లో, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో జరిగే 2019 ICC T20 వరల్డ్ కప్ క్వాలిఫైయర్ టోర్నమెంట్‌కు ముందు, నెదర్లాండ్స్ క్రికెట్ జట్టు కోసం ఆడేందుకు అకర్‌మాన్ అందుబాటులోకి వచ్చాడు. [17] 2019 సెప్టెంబరులో, అతను 2019–20 ఒమన్ పెంటాంగ్యులర్ సిరీస్, 2019 ICC T20 వరల్డ్ కప్ క్వాలిఫైయర్ టోర్నమెంటు కోసం డచ్ స్క్వాడ్‌లలో ఎంపికయ్యాడు. [18] అతను 2019 అక్టోబరు 5న ఐర్లాండ్‌పై నెదర్లాండ్స్ తరపున తన ట్వంటీ20 ఇంటర్నేషనల్ (T20I) రంగప్రవేశం చేసాడు [19]

2021 సెప్టెంబరులో, 2021 ICC పురుషుల T20 ప్రపంచ కప్ కోసం డచ్ జట్టు వైస్-కెప్టెన్‌గా అకర్‌మాన్ ఎంపికయ్యాడు. [20] 2021 నవంబరులో, దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్ కోసం డచ్ వన్ డే ఇంటర్నేషనల్ జట్టులో అకర్‌మాన్ ఎంపికయ్యాడు. [21] అతను 2021 నవంబరు 26న దక్షిణాఫ్రికాపై తన తొలి వన్‌డే ఆడాడు. [22]

మూలాలు[మార్చు]

  1. "Associate player roundup from Round 2 of the Bob Willis Trophy". Emerging Cricket. Retrieved 12 August 2020.
  2. "Colin Ackermann". ESPN Cricinfo. Retrieved 7 November 2015.
  3. "Colin Ackermann gets Netherlands call-up for T20 World Cup Qualifier". International Cricket Council. Retrieved 9 September 2019.
  4. "South African rising star Ackermann to become new professional at Netherfield Cricket Club". The Westmorland Gazette (in ఇంగ్లీష్). Retrieved 26 September 2021.
  5. "Former Outeniqua Primary School learner takes record 7/18". Retrieved 26 September 2021 – via PressReader.
  6. "The Home of CricketArchive". cricketarchive.com. Retrieved 26 September 2021.
  7. "South Africa Under-19s Squad - S Africa U19 Squad - ICC Under-19 World Cup, 2010 Squad". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 26 September 2021.
  8. "Records: Sunfoil Series, 2016/17: Most runs". ESPN Cricinfo. Retrieved 12 February 2017.
  9. "Leicestershire turn to Ackermann". ESPNcricinfo. 20 October 2016. Retrieved 27 October 2016.
  10. "De Kock dominates South Africa's awards". ESPN Cricinfo. Retrieved 14 May 2017.
  11. "T20 Global League announces final team squads". T20 Global League. Archived from the original on 5 September 2017. Retrieved 28 August 2017.
  12. "Cricket South Africa postpones Global T20 league". ESPN Cricinfo. Retrieved 10 October 2017.
  13. "Part-timer Colin Ackermann takes first-ever T20 seven-for on astounding night". ESPN Cricinfo. Retrieved 8 August 2019.
  14. "Colin Ackermann sets T20 record with 7/18". International Cricket Council. Retrieved 8 August 2019.
  15. "The Hundred 2022: latest squads as Draft picks revealed". BBC Sport. Retrieved 5 April 2022.
  16. "Colin Ackermann, Wiaan Mulder score unbeaten double-tons on landmark day for Leicestershire". ESPN Cricinfo. Retrieved 14 July 2022.
  17. "Experienced Colin Ackermann added to Dutch Men's Squad". Royal Dutch Cricket Association (KNCB). Archived from the original on 4 జూన్ 2019. Retrieved 4 June 2019.
  18. "Ryan Campbell announces squad for T20 World Cup Qualifier". Royal Dutch Cricket Association. Retrieved 8 September 2019.
  19. "2nd Match, Oman Pentangular T20I Series at Al Amerat, Oct 5 2019". ESPN Cricinfo. Retrieved 5 October 2019.
  20. "Dutch ICC Men's T20 World Cup squad announced". Royal Dutch Cricket Association. Retrieved 10 September 2021.
  21. "Six changes in Netherlands squad for Centurion". Emerging Cricket. Retrieved 4 November 2021.
  22. "1st ODI, Centurion, Nov 26 2021, Netherlands tour of South Africa". ESPN Cricinfo. Retrieved 26 November 2021.