క్యారట్ దోశ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

క్యారట్ దోశ దోశలో ఒక ప్రత్యేక రకమైన దోశ. ఇందులో పలు పోషకాలు లభ్యమౌతాయి. దీనిని ఉత్తర భారతదేశంలో విరివిగా చేస్తారు.[1]

కావలసిన పదార్థాలు[మార్చు]

  • క్యారెట్ తురుము - 1 కప్పు
  • బియ్యం - 1 కప్పు
  • పచ్చిమిర్చి - 2
  • దనియాలు - 1 టీ స్పూను
  • ఉప్పు - రుచికి తగినంత
  • పచ్చికొబ్బరి తురుము - పావు కప్పు
  • మజ్జిగ - కప్పు
  • ఉల్లి తరుగు - అరకప్పు
  • కొత్తిమీర తరుగు - పావుకప్పు
  • నూనె - కాల్చడానికి సరిపడా

తయారుచేసే విధానం[మార్చు]

  1. ఒక రాత్రంతా బియ్యం నానబెట్టాలి.
  2. నీరు వడకట్టిన బియ్యంలో పచ్చిమిర్చి, క్యారెట్ తురుము, ఉల్లి, కొత్తిమీర తరుగు, దనియాలు, ఉప్పు, పచ్చికొబ్బరి వేసి (నీటికి బదులు) మజ్జిగ చిలకరిస్తూ చిక్కగా రుబ్బుకోవాలి.
  3. తర్వాత ఈ మిశ్రమాన్ని దోశల్లా పోసుకుని రెండువైపులా కాల్చుకోవాలి.
  4. ఇందులో రైతా ను కూరగా వాడుకోవచ్చు.

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Carrot Dosa". TeluguOne Recipes (in ఇంగ్లీష్). 2020-09-16. Retrieved 2020-09-16.