క్రానిక్ లింపోసైటిక్ లుకేమియా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
క్రానిక్ లింపోసైటిక్ లుకేమియా
Classification and external resources
Chronic lymphocytic leukemia.jpg
రక్తములోనున్న క్రానిక్ లింపోసైటిక్ లుకేమియా కణములు.
ICD-10 C91.1
ICD-9 V10.60 204.1 V10.60
ICD-O: మూస:ICDO (CLL)
9670/3 (SCL)
DiseasesDB 2641
MedlinePlus 000532
eMedicine med/370
MeSH D015451

క్రానిక్ లింపోసైటిక్ లుకేమియా అనే ఈ రకము కాన్సర్ ఎముక మజ్జ లోని లాసికాణువు లేదా లింఫొసైట్లలలో జన్యు మార్పు సంభవించి, అవి నియంత్రణ లేకుండా విభజిస్తూ ఉండటం వల్ల ఏర్పడుతుంది. ఇది చాలా నిదానముగా పెరుగుట వలన దినిని క్రానిక్ అని అంటారు.[1] దినికిను అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకేమియాకు చాలా దగ్గరి పోలికలుంటాయి. ఇది చాలా వరకు పెద్దలలోనే వస్తుంది, దీని బారిన పడే పెద్దల వయస్సు 70 సంవత్సరములు పైబడి యుండును[2], ఇది చాలా నిదానముగా పెరుగుట వలన కొంత మందిలో దీనికి చికిత్స అవసరము ఉండదు, కాని మిగతావారిలో కొన్ని ఏళ్ళ తరువాత కాన్సర్ కణములు అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకేమియాలాగా చాలా వేగముగ పెరుగడం మొదలు పెడుతుంది, దీనిని "బ్లాస్ట్ క్రైసిస్" అని అంటారు. "బ్లాస్ట్ క్రైసిస్"కు చికిత్స అవసరము. జన్యువులను పరిశీలించి రోగి ఎంత కాలము వరకు చికిత్స అవసరము లెకుండా బ్రతక గలడని చెప్పవచ్చును. ZAP-70 ఉన్నవారు సరాసరిగా 8 సంవత్సరములు బ్రతుకతారు అదే ZAP-70 లేనివారైతే సరాసరిగా 25 సంవత్సరములు బ్రతుకతారు,అంటే వీరిలో చాలా మందికి చికిత్స అవసరమే ఉండదు.[3]

లక్షణాలు[మార్చు]

చాలామందిలో రోగము మొదటి దశలో,ఎటువంటి లక్షణములు కనిపించదు సాధారణముగా ఇతర కారణాలకు రక్త పరీక్ష చెసుకొన్నపుడు బయటపడుతుంది. "బ్లాస్ట్ క్రైసిస్" దశకు రోగము చేరుకుంటే మాత్రము, అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకేమియాకు వున్న లక్షణాలు కనిపిస్తాయి.

పై చెప్పబడిన లక్షణాలు ఉన్న అందరికీ ఈ జబ్బు ఏర్పడదు, ఇతర వ్యాధులకు కూడా ఇటువంటి లక్షణాలుంటాయి.

నిర్ధారణ[మార్చు]

రక్త పరీక్ష చెయడము ద్వారా ఈ వ్యాధిని గుర్తించవచ్చు. కానీ అది ఏ రకానికి చెందినదో తెలుసుకోవడానికి మరిన్ని పరీక్షలు చెయ్యాలి. ఈ పరీక్షలకు నమూనాను ఎముక మజ్జ నుండి సేకరించాలి, దీనిని ఎముక మజ్జ జీవాణుపరీక్ష (Bone marrow biopsy) అని అంటారు.[5]

ఎముక మజ్జనుండి సూది పిచికారి సహాయంతో నమూనాను సేకరించు దృశ్యము

ఎముక మజ్జ నుండి సేకరించిన నమూనా సహాయంతో క్రింది పరీక్షలు నిర్వహిస్తారు.

చాలా మందికి వ్యాధి ప్లీనముకు మరియు కాలేయమునకు వ్యాపించి వుంటుంది.

క్రానిక్ లింపోసైటిక్ లుకేమియా కణాలు సూక్ష్మ దర్శినిలో చూస్తే ఇలా ఉంటుంది

.

చికిత్స[మార్చు]

దీనికి కొంతమందిలో చికిత్స అవసరము ఉండదు, మరికొంతమందిలో "బ్లాస్ట్ క్రైసిస్" రానంత వరకు చికిత్స అవసరము లేదు. చాలా మంది రోగులు ఈ క్రానిక్ లింపోసైటిక్ లుకేమియావలన కాక్కుండా ఇతర కారణాల వలన చనిపోతారు. "బ్లాస్ట్ క్రైసిస్"కు చేరిన వారికి రోగ నివారను కాకుండా లక్షణాలను తగ్గించుటకు మాత్రమే చికిత్స ఇస్తాదు. కొంతమందికి ఎముక మజ్జ మార్పిడి చికిత్సను అందిస్తారు.మరి కొంతమందికి కీమోథెరపి చికిత్సను అందిస్తారు.[6] ముఖ్యముగా ప్లూడరబీన్ (Fludarabine, సైక్లోపాస్పమైడ్ (cyclophosphamide) మరియు రిటుక్సిమబ్ (rituximab) అనే మందులతో చికిత్సను చేస్తారు.ప్లూడరబీన్ కు లొంగనప్పుడు అల్మెటుఝుమబ్ (Alemtuzumab) అను మందును ఇస్తారు.[2]

సైక్లోపాస్పమైడ్ మందు

ఆదారాలు[మార్చు]

  1. [1],మయో.
  2. 2.0 2.1 http://www.nlm.nih.gov/medlineplus/ency/article/000532.htm
  3. http://en.wikipedia.org/wiki/B-cell_chronic_lymphocytic_leukemia
  4. 4.0 4.1 4.2 4.3 4.4 4.5 4.6 4.7 [2],.
  5. 5.0 5.1 5.2 5.3 5.4 [3],.
  6. http://www.mayoclinic.com/health/chronic-lymphocytic-leukemia/DS00565/DSECTION=treatments-and-drugs

యితర లింకులు[మార్చు]