క్రికెట్ పదకోశం - క-ఙ
స్వరూపం
(క్రికెట్ పదకోశం/1 నుండి దారిమార్పు చెందింది)
ఇది క్రికెట్ క్రీడలో ఉపయోగించే సాంకేతిక పదకోశం. సాంకేతిక పదాలు క్రికెట్ కు సంబంధించి చాల వరకు ఆంగ్లభాష లోనే ప్రాచుర్యంలో ఉన్నాయి. తెలుగులో సమానార్ధాలు ఉండక పోవచ్చు. అందుకని ఈ సాంకేతిక పదాలకు తెలుగు సమానార్ధాలే (ఉంటే) కాకుండా వివరణ క్లుప్తం గా క్రికెట్ సందర్భానికి తగినట్లుగా ఇవ్వడం జరిగింది.
సాంకేతిక పదాలు వాటి అర్ధాలు లేదా వివరణలు ఆంగ్ల వికీపీడియా Glossary of cricket terms నుండి తీసుకున్నాము. వేరే తీసుకున్న పదాలకు ఆధారము (source) ప్రస్తావనాలలో పేర్కొన్నాము.
పదాలు తెలుగు అక్షర క్రమంలో సాంకేతిక పదం ఉచ్చారణ అనుసరించి ఇచ్చాము. ఉదాహరణకి - "బౌలింగ్" ను "బ" అక్షరం లో చూడవచ్చు. "వికెట్" ను W లో కాకుండా "వ" లో ఇవ్వడం జరిగింది.
ఆ-అః | క-ఙ | చ-ణ | త-న | ప-మ | య-ఱ |
క
[మార్చు]- కవర్ (Cover):
- క్రికెట్ మైదానంలో పిచ్, స్క్వేర్, రన్ అప్‌లను వర్షం నుండి రక్షించడానికి గ్రౌండ్ స్టాఫ్ సాధారణంగా పైన కప్పడానికి ఉపయోగించే దుప్పటి వంటి వాటర్‌ప్రూఫ్ టార్పాలిన్ .
- క్లబ్ (Club):
- క్రికెటర్ల సమూహం, దీని నుండి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ క్రికెటర్లు, జట్లు ఏర్పడతాయి.
- క్లబ్ క్రికెట్ (Club cricket):
- (ఆస్ట్రేలియాలో గ్రేడ్ క్రికెట్) నైపుణ్యం కలిగిన ఔత్సాహికులచే అధికారికంగా నిర్వహించబడిన క్రికెట్. క్రికెట్ ఆట ఉన్నత ప్రమాణంగా పరిగణించబడుతుంది, అయితే వృత్తిపరమైన రూపాల కంటే ఇప్పటికీ తక్కువ గానే పరిగణిస్తారు.
- క్లిన్న్ బౌల్డ్ (Clean bowled):
- బౌలింగ్ తరువాత బంతి బాట్ కి కానీ పాడ్ కి కానీ తగలదు.
- కం టు ది క్రీజ్ (Come to the crease):
- ఒక బ్యాటర్ మైదానంలోకి వెళ్లి బ్యాటింగ్ ప్రారంభించడము కోసము క్రికెట్ పిచ్ వద్దకు రావడాన్ని సూచించే పదబంధం.
- కంపల్సరీ క్లోజ్ (Compulsory close -CC ):
- ఆలౌట్ కావడం లేదా ప్రకటించడం (డిక్లేర్) చేయడం కాకుండా ఇతర మార్గాల ద్వారా జట్టు ఇన్నింగ్స్ ముగించబడినప్పుడు కంపల్సరీ క్లోజ్ వర్తిస్తుంది. రెండు ఇన్నింగ్స్‌ల మ్యాచ్‌లోని ప్రతి ఇన్నింగ్స్ కూడా సమయం లేదా పరిమితి ఓవర్ల లోబడి ఉండే గ్రేడ్ క్రికెట్ పోటీలలో ఇది ప్రత్యేకంగా వర్తిస్తుంది. జట్టు స్కోర్‌లో ఈ అక్షరాలు ప్రతిబింబించేలా కనిపిస్తాయి; ఉదా 266–7(CC).
- కాజిల్డ్ (Castled)
- సాధారణంగా యార్కర్ లేదా ఫుల్ లెంగ్త్ బాల్ ద్వారా క్లీన్ బౌల్డ్ చేయడము.
- కాట్ (Caught)
- ప్రొఫెషనల్ క్రికెట్‌లో బ్యాటర్‌ను అవుట్ చేయడానికి ఇది అత్యంత సాధారణ పద్ధతి. దీనిలో బౌలర్, వికెట్ కీపర్, ఫీల్డర్‌లలో ఒకరు, బ్యాటర్ బంతిని కొట్టిన తర్వాత బంతిని నేలను తాకడానికి ముందే పట్టుకుంటారు.
- కాట్ అండ్ అవుట్ (Caught and Out):
- బౌలర్ బంతిని పట్టుకున్న తరువాత (క్యాచ్‌తో) బ్యాటర్ ఔటయ్యాడు. ప్రత్యామ్నాయ పదం "బౌల్డ్ అండ్ క్యాచ్".
- కాట్ బిహైండ్ (Caught behind):
- వికెట్ కీపర్ తీసుకున్న క్యాచ్‌తో బ్యాటర్ ఔటయ్యాడు.
- కారమ్ బాల్ (Carrom ball):
- నెమ్మదైన బౌలింగ్ శైలి. దీనిలో స్పిన్ అందించడానికి బంతిని బొటనవేలు వంగిన మధ్య వేలు మధ్య విదిలించడం ద్వారా బంతిని విడుదల చేస్తారు.
- కారీ ది బాట్ (Carry the bat):
- జట్టులోని మిగిలిన వారు ఆలౌట్ అయిపోయినా ఒక ప్రారంభ బ్యాట్స్ మన్ ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తూ, మొత్తం ఆడి ముగింపులో నాటౌట్‌గా మిగిలిపోయాడు. ఓపెనింగ్ బ్యాటర్ అద్భుతమైన ప్రదర్శన చేసినట్లుగా పరిగణిస్తారు.
- కార్ట్ వీల్ (Cartwheel):
- బౌలింగ్ చేసేటప్పుడు బంతి గట్టిగా తగిలి స్టంప్ కదలిక వలన నేల నుండి చీలిపోతుంది. జిమ్నాస్టిక్ కార్ట్‌వీల్ లాగా ల్యాండింగ్‌కు ముందు పల్టీలు కొడుతుంది.
- క్యాచ్ (Catch):
- ఒక ఫీల్డర్ బంతిని ఒకటి లేదా రెండు చేతులతో పూర్తిగా నియంత్రిస్తూ, అది నేలను తాకే ముందు పట్టుకోవడం వలన బ్యాటర్ అవుట్ అవుతాడు. ఈ ప్రక్రియలో వికెట్ కీపర్ గ్లౌస్‌లను ఉపయోగించవచ్చు, కానీ ఇతర ఫీల్డర్‌లెవరూ క్యాచ్‌ని తీసుకోవడంలో సహాయపడేందుకు ఇతర పరికరాలు ఉపయోగించకూడదు.
- కాప్ (Cap):
- ఫీల్డర్లు వేసుకునే మెత్తని టోపీ. జాతీయ జట్టుకు చెందిన క్రికెటర్ కు చిహ్నం
- కాంపిటీటివ్ ఉమెన్స్ క్రికెట్ (Competitive Women's Cricket):
- మహిళలకు ఫస్ట్-క్లాస్, లిస్ట్ A, T20 అని క్రికెట్‌కు పురుషులతో సమానమైన అధికారిక హోదాను సూచిస్తుంది.
- కెఫెటేరియా బౌలింగ్ (Cafeteria bowling):
- బౌలింగ్ లో నాణ్యత లోపిస్తుంది. దానితో చాల సులువుగా బ్యాటింగ్ చేస్తారు.
- కెప్టెన్ (Captain):
- జట్టు కు నాయకుడు/నాయకురాలు. జట్టును నడిపించడానికి నియమిస్తారు. కెప్టెన్ బ్యాటింగ్ వరుసను నిర్ణయిస్తాడు, ఏ బౌలర్ బౌలింగ్ చేయాలో, ఫీల్డర్లు ఎక్కడ ఉండాలో, ఎప్పుడు డెసిషన్ రివ్యూ వ్యవస్థను వినియోగించుకోవాలో నిర్ణయించుతాడు. ఈ కెప్టెన్ నిర్ణయాలు, మ్యాచ్ ఫలితం మీద ప్రభావం చూపిస్తాయి. ఆట లేనప్పుడు కూడా జట్టు ఎంపిక లోను, ప్రసార మాధ్యమాలతో వ్యవహరించడములో జట్టుకి ప్రాతినిధ్యం వహిస్తాడు.
- కౌంటీ క్రికెట్ (County cricket):
- ఇంగ్లండ్, వేల్స్‌లో ఆడే అత్యున్నత స్థాయి దేశీయ క్రికెట్.
- క్రీజ్ (Crease):
- స్టంప్‌ల దగ్గర ఉన్న పిచ్‌పై రంగు (పెయింట్) వేయబడిన స్ట్రెయిట్ వైట్‌వాష్ లైన్. పిచ్ ప్రతి చివరన నాలుగు క్రీజులు ఉన్నాయి: 'పాపింగ్ క్రీజ్', 'బౌలింగ్ క్రీజ్', రెండు 'రిటర్న్ క్రీజులు'. 'క్రీజ్' అనే పదం పాపింగ్ క్రీజ్‌ని లేదా దాని ఆవల ఉన్న ప్రాంతాన్ని సూచిస్తుంది. ఒక పరుగు పూర్తయిందా, బ్యాటర్ రనౌట్ అయ్యిందా, డెలివరీ నో బాల్ లేదా వైడ్ వంటివాటిని నిర్ధారించడానికి క్రీజులు ఉపయోగించుతారు.
- క్రికెటర్ (Cricketer):
- క్రికెట్ ఆట అడే వ్యక్తి.
గ
[మార్చు]- గ్రాస్ (Grass):
- ఒక క్యాచ్‌ను వదలడానికి, బంతిని మైదానంలోని గడ్డిపై పడేలా చేయడం.
- గ్రిప్ (Grip):
- బాట్ హేండిల్ కి ఉన్న రబ్బర్ తొడుగులు
- గ్రీన్ టాప్ (Green top):
- అసాధారణంగా అధిక మొత్తంలో కనిపించే గడ్డితో కూడిన పిచ్, ఇది పేస్ బౌలర్‌లకు ప్రత్యేకంగా అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు.
- గూగ్లీ (Googly):
- స్పిన్ బౌలర్ మణికట్టు ద్వారా వేసే బంతి స్పిన్నింగ్ డెలివరీ, ఇది వ్యతిరేక దిశలో తిరుగుతుంది. కుడిచేతి వాటం బౌలర్. గూగ్లీ ఆఫ్ సైడ్ నుండి లెగ్ సైడ్‌కు మారుతుంది. 1900లో బోసాంక్వెట్ అభివృద్ధి చేసాడు.
- గోగింగ్ (Gouging):
- పిచ్ లేదా బంతిని ఉద్దేశపూర్వకంగా దెబ్బతీయడం.
- గోజ్జా (Gozza):
- ఆస్ట్రేలియన్ క్రికెట్‌లో ఈ పదం అంటే అందుకున్న మొదటి బంతికే ఔట్ అయిన బ్యాటర్ అని అర్థం.
- గోల్డెన్ డక్ (Golden duck):
- బ్యాటర్ ఇన్నింగ్స్‌లో ఎదుర్కొన్న మొదటి బంతి కే (సున్నా) ఔట్ అవుతే గోల్డెన్ డక్ అంటారు.
- గ్రౌండ్ (Ground):
- పిచ్, ఫీల్డ్, పెవిలియన్, ప్రేక్షకుల సౌకర్యాల కోసం ఉపయోగించే సమిష్టి పదం. గణనీయమైన ప్రేక్షకుల సౌకర్యాలతో కూడిన పెద్ద మైదానాలను స్టేడియంలుగా పేర్కొంటారు.
గ్రౌండ్స్ మాన్ (Groundsman or curator)
- క్రికెట్ మైదానాన్ని నిర్వహించడానికి ఇంకా పిచ్‌ను సిద్ధం చేయడానికి బాధ్యత వహించే వ్యక్తి.
గ్లోవ్స్ (Gloves)
- బ్యాటర్ కిట్‌లో బ్యాటింగ్ గ్లోవ్స్, ధరించే చేతి రక్షణ. బ్యాట్ హ్యాండిల్‌ను పట్టుకున్నప్పుడు బంతి రాపిడి నుండి రక్షించడానికి ప్యాడింగ్ ఎక్కువగా ఉంటుంది.
- వికెట్ కీపర్స్ గ్లోవ్స్, వికెట్ కీపర్ ధరించే వెబ్‌డ్ క్యాచింగ్ గ్లోవ్స్. పట్టుకున్న బంతి నుండి రక్షించడానికి కావలసిన పాడింగ్ లోపలి భాగంలో ఉంటుంది. ఫీల్డింగ్ టీమ్‌లోని ఇతర సభ్యులెవరూ గ్లోవ్‌లను ఉపయోగించడానికి అనుమతించరు.